Saturday, August 3, 2024

Telangana Department wise Job Calendar 2024-2025

 


 Job Calendar  Download 2024-2025

 

 తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వెంటనే.. జాబ్ క్యాలెండర్ ను అమలు చేస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి పలు మార్లు చెప్పారు. దీనిలో భాగంగానే .. ఈరోజు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటన చేసేలా చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈరోజు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు.
ఇప్పటి వరకు ఏ నోటిఫికేషన్ ఎప్పుడోస్తుందో.. దేనీ కోసం ప్రిపేర్ కావాలో తెలిక ఉద్యోగ అభ్యర్థులు తీవ్ర గందర గోళానికి గురయ్యే వారు. కొన్నిసార్లు ఒకేసారి రెండు మూడు నోటిఫికేషన్ వరుసగా ఉండటం వల్ల కొన్ని అవకాశాలను అభ్యర్థులు కోల్పోయేవారు. మరికొన్నిసార్లు దీనికి భిన్నంగా ఏళ్లకు ఏళ్లు ఒక్క నోటిఫికేషన్ కూడా ఉండేది కాదు.
దీంతో అభ్యర్థులు తమ భవిష్యత్తు పూర్తిగా ఆగమ్య గోచరంగా ఉండేది. ఇటీవల తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు.. మాత్రం ఎగిరి గంతేసే వార్తను కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది.   
సీఎం రేవంత్ గతంలో చెప్పినట్లుగానే.. తెలంగానలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు. దీనిలో ఏ  శాఖల ఎగ్జామ్ లు ఎప్పుడు నిర్వహిస్తారో పూర్తి వివరాలు వెల్లడించారు. కానీ పోస్టుల సంఖ్య మంత్రి నోటిఫికేషన్ ను ప్రకటించినప్పుడు ఉంటుందని,తెలంగాణ సర్కారు క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించి జాబ్ క్యాలెండర్ ప్రకారం..



గ్రూప్ I మెయిన్స్: అక్టోబర్ 21-27, 2024 (నోటిఫైడ్: ఫిబ్రవరి 2024), 2. గ్రూప్ III సేవలు: నవంబర్ 17-18, 2024 (నోటిఫైడ్: డిసెంబర్ 2022), 3. ల్యాబ్ టెక్/నర్స్/ఫార్మసిస్ట్: నవంబర్ 2024 (నోటిఫైడ్: సెప్టెంబర్ 2024), 4. గ్రూప్ II సేవలు: డిసెంబర్ 2024 (నోటిఫైడ్: డిసెంబర్ 2022),5. TGTRANSCOలో Engg పోస్ట్‌లు: జనవరి 2025 (నోటిఫైడ్: అక్టోబర్ 2024), 6. గెజిటెడ్ ఇంజనీరింగ్ సేవలు: జనవరి 2025 (నోటిఫైడ్: అక్టోబర్ 2024) లో షెడ్యూల్ ను విడుదల చేస్తారు.  

 ఉపాధ్యాయ అర్హత పరీక్ష: జనవరి 2025 (నోటిఫైడ్: నవంబర్ 2024),8. గ్రూప్ I-ప్రిలిమ్స్: ఫిబ్రవరి 2025 (నోటిఫైడ్: అక్టోబర్ 2024),9. గెజిటెడ్ ఇతర సేవలు: ఏప్రిల్ 2025 (నోటిఫైడ్: జనవరి 2025), 10. ఉపాధ్యాయుల DSC: ఏప్రిల్ 2025 (నోటిఫైడ్: ఫిబ్రవరి 2025), 11. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్: మే 2025 (నోటిఫైడ్: ఫిబ్రవరి 2025), 12. టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్: జూన్ 2025 (నోటిఫైడ్: ఏప్రిల్ 2025) న నోటిఫికేషన్ లు ఉంటాయి.

 గ్రూప్ I-మెయిన్స్: అక్టోబర్ 2025 (నోటిఫైడ్: జులై 2025),14. SI సివిల్ పోస్టులు: ఆగస్టు 2025 (నోటిఫైడ్: ఏప్రిల్ 2025), 15. PC సివిల్ పోస్టులు: ఆగస్టు 2025 (నోటిఫైడ్: ఏప్రిల్ 2025), 16. డిగ్రీ కళాశాలల్లో అకడమిక్ పోస్టులు: సెప్టెంబర్ 2025 (నోటిఫైడ్: జూన్ 2025), 17. రెస్ కాలేజీలలో డిగ్రీ లెక్చరర్లు: సెప్టెంబర్ 2025 (నోటిఫైడ్: జూన్ 2025), 18. గ్రూప్ II (ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్‌తో సహా): అక్టోబర్ 2025 (నోటిఫైడ్: మే 2025), 19. గ్రూప్ III (w/ గ్రూప్ IV): నవంబర్ 2025 (నోటిఫైడ్: జులై 2025), 20. Exec కేడర్ పోస్టులు: నవంబర్ 2025 (నోటిఫైడ్: జూలై 2025)న ఎగ్జామ్ నోటిఫికేషలు విడుదల చేస్తారని తెలుస్తోంది.  

Job Calendar  Download 2024-2025

Friday, July 19, 2024

TS- HWO MARK'S - DOWNLOAD

 

 
 TS- HWO MARK'S - DOWNLOAD

Monday, July 15, 2024

SOCIAL STUDIES 6TH - 10TH CLASS BIT BANKS


SOCIAL STUDIES 6 TH CLASS BIT BANK -   Download

SOCIAL STUDIES 7 TH CLASS BIT BANK -   Download

SOCIAL STUDIES  8 TH CLASS BIT BANK -   Download 

SOCIAL STUDIES 9 TH CLASS BIT BANK -   Download 

SOCIAL STUDIES 10 TH CLASS BIT BANK -   Download  


Tags : Social bit bank class 10, Social bit bank pdf,Social Bits in Telugu PDF, Social bits in English
10th Class social Bits in Telugu PDF
10th Class Social Bits quiz with Answers
Social bit bank notes
10th Class Social Bits pdf


Sunday, July 14, 2024

ఆధార్ కార్డ్‌లతో ఎన్ని మొబైల్ నంబర్‌లు నమోదు: check

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) మార్గదర్శకాల ప్రకారం, ఒక మొబైల్ సబ్‌స్క్రైబర్ తమ పేరుతో తొమ్మిది మొబైల్ నంబర్‌లను నమోదు చేసుకోవచ్చు. కొత్త SIM కార్డ్‌ని కొనుగోలు చేసేటప్పుడు, చెల్లుబాటు అయ్యే చిరునామా మరియు గుర్తింపు రుజువు అవసరం. ఆధార్ కార్డ్ అనేది కొత్త SIM కార్డ్‌లను జారీ చేయడానికి టెలికాం ఆపరేటర్‌లచే ఆమోదించబడిన చెల్లుబాటు అయ్యే పత్రం. అయితే ఆర్థిక నేరాల కోసం వేరొకరి ఆధార్ సమాచారాన్ని ఉపయోగించి మోసపూరిత ఘటనలు పెరుగుతున్నాయి. అందువల్ల, DoT కొత్త పోర్టల్‌ను ప్రారంభించింది - టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ (TAF-COP), ఇది ప్రజలు తమ ఆధార్ కార్డ్‌లతో ఎన్ని మొబైల్ నంబర్‌లు నమోదు చేయబడిందో తనిఖీ చేయడంలో సహాయపడుతుంది.

Link:       https://tafcop.sancharsaathi.gov.in/telecomUser/


Friday, July 12, 2024

UPI వాడేవాళ్లకి శుభవార్త.. అకౌంట్ లో డబ్బులు లేకున్నా నో ప్రాబ్లమ్!

 


 

NPCI- నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా త్వరలో UPI కస్టమర్ల కోసం ఒక పెద్ద సర్వీస్ ని ప్రారంభించబోతోంది.  కొత్త సర్వీస్ ప్రారంభం తర్వాత మీ UPI అకౌంట్ కూడా క్రెడిట్ కార్డ్ లాగా పని చేస్తుంది. అంటే మీ అకౌంట్ లో డబ్బు లేకపోయినా కూడా  UPI పేమెంట్స్ చేసే అవకాశం ఉంటుంది.

ఇప్పుడు వినియోగదారుల UPI అకౌంట్ క్రెడిట్ కార్డ్‌గా పని చేస్తుందని, ప్రతి కస్టమర్ తన CIBIL స్కోర్ ప్రకారం క్రెడిట్ లిమిట్ పొందుతారని NPCI తెలిపింది. ఈ క్రెడిట్‌ను వ్యాపారితో మాత్రమే ఉపయోగించవచ్చు. దీనికి బ్యాంకులు వడ్డీని కూడా వసూలు చేస్తాయి. ఈ కొత్త సర్వీస్ కి సంబంధించి  NPCI అనేక ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులతో మాట్లాడింది, అవి కూడా దీనికి అంగీకరించాయి. ఈ సదుపాయం కోసం NPCIకి ఇప్పటివరకు ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, PNB, ఇండియన్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ సపోర్ట్ లభించింది.

ఈ సదుపాయం వల్ల కేవలం కస్టమర్లు మాత్రమే కాకుండా దుకాణదారులు కూడా దీని వల్ల ప్రయోజనం పొందుతారు. ప్రస్తుతం, క్రెడిట్ కార్డు ద్వారా రూ. 2 వేలకు పైగా చెల్లింపు చేస్తే, దాదాపు 2 శాతం ఛార్జీ చెల్లించాలి. UPIలో క్రెడిట్ లైన్  పొందిన తర్వాత అటువంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు కార్డ్‌పై ఎలాంటి వడ్డీని చెల్లించనవసరం లేదు.

మీరు UPI అందించే ఈ సర్వీస్ ని ఉపయోగించే వరకు UPI ద్వారా లభించే క్రెడిట్ లైన్‌పై మీరు ఎలాంటి వడ్డీని చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు ఉపయోగించే నిధుల మొత్తానికి మాత్రమే మీరు వడ్డీని చెల్లించాలి. ఒక విధంగా, ఇది ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం మాదిరి పని చేస్తుంది. మీరు రూ.20 వేలు క్రెడిట్ లైన్ పొంది రూ.10 వేలు మాత్రమే ఉపయోగించారనుకోండి, అప్పుడు మీరు రూ.10 వేలకు మాత్రమే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.