Job Calendar Download 2024-2025
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వెంటనే.. జాబ్ క్యాలెండర్ ను అమలు చేస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి పలు మార్లు చెప్పారు. దీనిలో భాగంగానే .. ఈరోజు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటన చేసేలా చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈరోజు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు.
ఇప్పటి వరకు ఏ నోటిఫికేషన్ ఎప్పుడోస్తుందో.. దేనీ కోసం ప్రిపేర్ కావాలో తెలిక ఉద్యోగ అభ్యర్థులు తీవ్ర గందర గోళానికి గురయ్యే వారు. కొన్నిసార్లు ఒకేసారి రెండు మూడు నోటిఫికేషన్ వరుసగా ఉండటం వల్ల కొన్ని అవకాశాలను అభ్యర్థులు కోల్పోయేవారు. మరికొన్నిసార్లు దీనికి భిన్నంగా ఏళ్లకు ఏళ్లు ఒక్క నోటిఫికేషన్ కూడా ఉండేది కాదు.
దీంతో అభ్యర్థులు తమ భవిష్యత్తు పూర్తిగా ఆగమ్య గోచరంగా ఉండేది. ఇటీవల తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు.. మాత్రం ఎగిరి గంతేసే వార్తను కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది.
సీఎం రేవంత్ గతంలో చెప్పినట్లుగానే.. తెలంగానలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు. దీనిలో ఏ శాఖల ఎగ్జామ్ లు ఎప్పుడు నిర్వహిస్తారో పూర్తి వివరాలు వెల్లడించారు. కానీ పోస్టుల సంఖ్య మంత్రి నోటిఫికేషన్ ను ప్రకటించినప్పుడు ఉంటుందని,తెలంగాణ సర్కారు క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించి జాబ్ క్యాలెండర్ ప్రకారం..
గ్రూప్ I మెయిన్స్: అక్టోబర్ 21-27, 2024 (నోటిఫైడ్: ఫిబ్రవరి 2024), 2. గ్రూప్ III సేవలు: నవంబర్ 17-18, 2024 (నోటిఫైడ్: డిసెంబర్ 2022), 3. ల్యాబ్ టెక్/నర్స్/ఫార్మసిస్ట్: నవంబర్ 2024 (నోటిఫైడ్: సెప్టెంబర్ 2024), 4. గ్రూప్ II సేవలు: డిసెంబర్ 2024 (నోటిఫైడ్: డిసెంబర్ 2022),5. TGTRANSCOలో Engg పోస్ట్‌లు: జనవరి 2025 (నోటిఫైడ్: అక్టోబర్ 2024), 6. గెజిటెడ్ ఇంజనీరింగ్ సేవలు: జనవరి 2025 (నోటిఫైడ్: అక్టోబర్ 2024) లో షెడ్యూల్ ను విడుదల చేస్తారు.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష: జనవరి 2025 (నోటిఫైడ్: నవంబర్ 2024),8. గ్రూప్ I-ప్రిలిమ్స్: ఫిబ్రవరి 2025 (నోటిఫైడ్: అక్టోబర్ 2024),9. గెజిటెడ్ ఇతర సేవలు: ఏప్రిల్ 2025 (నోటిఫైడ్: జనవరి 2025), 10. ఉపాధ్యాయుల DSC: ఏప్రిల్ 2025 (నోటిఫైడ్: ఫిబ్రవరి 2025), 11. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్: మే 2025 (నోటిఫైడ్: ఫిబ్రవరి 2025), 12. టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్: జూన్ 2025 (నోటిఫైడ్: ఏప్రిల్ 2025) న నోటిఫికేషన్ లు ఉంటాయి.
గ్రూప్ I-మెయిన్స్: అక్టోబర్ 2025 (నోటిఫైడ్: జులై 2025),14. SI సివిల్ పోస్టులు: ఆగస్టు 2025 (నోటిఫైడ్: ఏప్రిల్ 2025), 15. PC సివిల్ పోస్టులు: ఆగస్టు 2025 (నోటిఫైడ్: ఏప్రిల్ 2025), 16. డిగ్రీ కళాశాలల్లో అకడమిక్ పోస్టులు: సెప్టెంబర్ 2025 (నోటిఫైడ్: జూన్ 2025), 17. రెస్ కాలేజీలలో డిగ్రీ లెక్చరర్లు: సెప్టెంబర్ 2025 (నోటిఫైడ్: జూన్ 2025), 18. గ్రూప్ II (ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్‌తో సహా): అక్టోబర్ 2025 (నోటిఫైడ్: మే 2025), 19. గ్రూప్ III (w/ గ్రూప్ IV): నవంబర్ 2025 (నోటిఫైడ్: జులై 2025), 20. Exec కేడర్ పోస్టులు: నవంబర్ 2025 (నోటిఫైడ్: జూలై 2025)న ఎగ్జామ్ నోటిఫికేషలు విడుదల చేస్తారని తెలుస్తోంది.