Showing posts with label Others. Show all posts
Showing posts with label Others. Show all posts

Sunday, July 29, 2012

లండన్ ఒలింపిక్స్ 2012 విశేషాలు:


లండన్ ఒలంపిక్స్‌లో ఆర్చరీ విభాగంలో క్వాలిఫికేషన్ రౌండ్‌లో 64 పాల్గోంటుండగా... ఇందులో 32 మంది తర్వాత రౌండ్‌లోకి వెళతారు. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకుముందే జరుగుతున్న రెండో ఈవెంట్ ఆర్చరీ. ఇప్పటికే ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. మరోవైపు 2004 ఏథెన్స్ గేమ్స్ అనంతరం అధిక సంఖ్యలో లండన్‌కు అర్హత సాధించిన ఆర్చర్లు నాలుగు ఈవెంట్లలో కనీసం రెండింటిలోనైనా పోడియం సాధించాలని చూస్తున్నారు.

       
   
        ప్రపంచ నంబర్‌వన్ దీపికా కుమారిపై భారత్ భారీ ఆశలే పెట్టుకుంది. తను ఏమేరకు రాణిస్తుందో చూడాలి. రికర్వ్ విభాగంలో దీపికా, బొంబేలా దేవి, చెక్రవోలు స్వురో తలపడుతున్నారు. ‘మహిళల వ్యక్తిగత విభాగంలో దీపిక పతకం సాధిస్తుందనే భావనలో ఉన్నాం. ఆమె గత రెండేళ్లుగా ప్రఖ్యాత ఆర్చర్లను ఓడిస్తూ వస్తోంది. ప్రపంచ చాంపియన్ కొరియాను సైతం మట్టికరిపించింది' అని జాతీయ కోచ్ లింబారామ్ తెలిపారు. ఈనెల 28న పురుషుల ఫైనల్, 29న మహిళల ఫైనల్ జరుగుతుంది. వ్యక్తిగత విభాగంలో 2న మహిళల, 3న పురుషుల తుది పోరు ఉంటుంది.
   
       

        ఈ క్రీడల్లో మొత్తం 204 దేశాలు, 10,500 మంది అథ్లెట్లు 16 రోజుల పాటు సాగనుంది. ఈ ఆటల పండగ ప్రారంభ వేడుకలను బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 శుక్రవారం రాత్రి ప్రారంభించనున్నారు. టెన్నిస్‌ కోసం వింబుల్డన్‌, ఫుట్‌బాల్‌ కోసం వెంబ్లీ, ఆర్చరీ కోసం లార్డ్స్‌ మైదానాలను అందంగా తీర్చిదిద్దారు.


   

    ఆర్చరీ:

    దీపిక కుమారి, బొంబేలా దేవి, చక్రవోలు స్వారో (మహిళల టీమ్, వ్యక్తిగత రికర్వ్), జయంత తాలుక్‌దార్, రాహుల్ బెనర్జీ, తరుణ్‌దీప్ రాయ్ (పురుషుల టీమ్, వ్యక్తిగత రికర్వ్).

    వేదిక: లార్డ్స్ మైదానం; తేదీలు: జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు తొలి రోజు ర్యాంకింగ్ రౌండ్స్ జరిగాక 28, 29వ తేదీల్లో టీమ్ విభాగాల్లో పతకాల కోసం మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం మూడు రోజులపాటు వ్యక్తిగత విభాగాల్లో నాకౌట్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆగస్టు 2, 3వ తేదీల్లో పతకాల కోసం మ్యాచ్‌లు ఉంటాయి.

   

    లండన్ ఒలింపిక్స్ 2012 విశేషాలు:


   

    204 పాల్గొనే దేశాలు

    26 క్రీడాంశాలు

    34 వేదికలు

    302 మెడల్ ఈవెంట్స్

    10,500 మొత్తం అథ్లెట్లు

    28,000 జర్నలిస్టులు

    సుమారు *3.48 కోట్లు - లోగో తయారీ ఖర్చు

    1.50 లక్షలు సిద్ధంచేసిన కండోమ్స్

    350 మైళ్లు ఏర్పాటుచేసిన కేబుల్స్ (క్రీడల ప్రసారానికి వీలుగా)

    1.40 కోట్లు ఏర్పాటు చేయనున్న భోజనాలు

    8.80 కోట్లు అమ్ముడైన టికెట్లు