కేంద్ర రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే తన తొలి రైల్వే బడ్జెట్‌ను  ఫిబ్రవరి 12, 2014న లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఎన్నికల నేపథ్యంలో  ప్రయాణికులపై ఎలాంటి అదనపు భారం వేయలేదు. రూ 1,60,775 కోట్ల మేర సరకు రవాణా  ఆదాయమే లక్ష్యంగా ఈ దఫా రైల్వే బడ్జెట్ పట్టాలనెక్కింది. కొత్తగా 72  రైళ్లను రైల్వే మంత్రి ప్రతిపాదించారు. ఇందులో 17 ప్రీమియం, 38  ఎక్స్‌వూపెస్, 10 పాసింజర్ రైళ్లతో పాటు నాలుగు మెమో, మూడు డెమో  రైళ్లున్నాయి. మన రాష్ట్రానికి తాజా బడ్జెట్‌లో కొంత ప్రాధాన్యం పెరిగిందనే  చెప్పొచ్చు. వివిధ అంశాల వారీగా రైల్వే బడ్జెట్‌ను పరిశీలిస్తే..    భద్రతకు సంబంధించిన అంశాలు: కాపలాలేని క్రాసింగ్‌లను పూర్తిగా  తొలగించేందుకు చర్యలు. ఇప్పటి దాకా కాపలాలేని 5, 400 క్రాసింగ్‌లను  పూర్తిగా తొలగించారు. రైళ్లు ఢీ కొనకుండా దేశీయంగా అభివృద్ధి పరచిన  సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు రైల్వే మంత్రి ప్రతిపాదించారు.  ఇటీవలే పలు రైళ్లలో అగ్ని ప్రమాదాలు భారీ ఎత్తున జరిగిన నేపథ్యంలో ఆ తరహా  ప్రమాదాల నివారణకు ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుతం ఈ ప్రయోగాన్ని రాజధాని  ఎక్‌వూపెస్‌లో చేపట్టనున్నారు. ఇది విజయవంతమైతే అన్ని రైళ్లకు క్రమంగా విస్తరిస్తారు.    సదుపాయాల కల్పన: కర్ణాటక, జార్ఖంఢ్, మహారాష్ట్ర, ఆంధ్రవూపదేశ్ తదితర  రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాల సాయంతో వ్యయ వాటా విధానంతో మౌలిక సదుపాయాలను  పెంచనున్నారు. రైల్వే రంగంలో విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడులను  ఆకర్షించడానికి ప్రతిపాదనలు చేశారు. రైల్వే టారిఫ్ అథారిటీని ఏర్పాటు  చేయనున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించారు. ప్రయాణ, రవాణా చార్జీలను  సహేతుకంగా నిర్ణయించడంలో స్వతంత్ర ప్రతిపత్తి ఈ సంస్థకు ఉంటుంది. పర్యావరణ  పెంపునకు దోహదపడే పలు చర్యలను కూడా తాజా బడ్జెట్‌లో రైల్వే మంత్రి  ప్రతిపాదించారు. రైల్వే ఎనర్జీ మేనేజ్‌మెంట్ అమలుల్లోకి రానుంది. పవన,  సౌరశక్తిలను వినియోగించే ప్రాజెక్టులను చేపట్టనున్నారు. సంబంధిత మంత్రిత్వ  శాఖతో చర్చించి 40% మేర రాయితీని ఇందులో ప్రతిపాదించనున్నారు. బయో  టాయిపూట్ల వినియోగాన్ని 2, 500 రైళ్లకు విస్తరించారు.   నిధుల సమీకరణకు రుణాలు:రూ. 13, 800 కోట్ల మేర రుణాలను మార్కెట్ల నుంచి  రైల్వే శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకోనుంది. రైలు వ్యాగన్లు, కంటెయినర్ల  తయారీకి గానూ వీటిని వినియోగించనున్నారు. ఇందుకుగానూ రూ 12, 800 కోట్లను  కేటాయించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం కింద మరో రూ 6, 005 కోట్లను  సమీకరించాలని నిర్ణయించారు. ఇది సాకారం అయితే, 2014-15 ఆర్థిక సంవత్సరంలో  రైల్వేలు రూ. 19, 805 కోట్ల మేర నిధులను సమీకరించుకుంటుంది.    బడ్జెట్‌లో ఆంధ్రవూపదేశ్   భారీగా కాకున్నా, ఈ దఫా రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రవూపదేశ్‌కు కొంత మేర  ప్రయోజనం దక్కింది. దేశ వ్యాప్తంగా ప్రతిపాదితమైన 55 ఎక్స్‌వూపెస్ రైళ్లలో,  15 దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉండనున్నాయి. ఇవి రాష్ట్ర రాజధాని  హైదరాబాద్ గుండా ప్రయాణించనున్నాయి. తాజా బడ్జెట్‌లో రెండు డబుల్ డెక్కర్  ఎక్సవూపెస్ రైళ్లను ప్రతిపాదించారు. ఇవి రెండు ఆంధ్రవూపదేశ్ రాష్ట్రానికే  దక్కాయి. రాష్ట్ర రాజధానిలోని కాచిగూడ నుంచి తిరుపతికి, ఒక డబుల్ డెక్కర్  పరుగులు తీయనుంది. హైదరాబాద్ గుల్బర్గాల మధ్య ఇంటర్ సిటీ ఎక్సవూపెస్  రానుంది.    చార్జీల మోత పెంచనప్పటికీ, రైల్వే టారీఫ్ అథారిటీ ఏర్పాటు, పరోక్షంగా  చార్జీల పెంపునకు ఉద్దేశించిందేని భావించవచ్చు. మరో మూడు నెలల్లో సాధారణ  ఎన్నికలు రానున్న నేపథ్యంలో తాజా బడ్జెట్‌లో చార్జీల పెంపు వంటి  నిర్ణయాన్ని తీసుకోలేదని చెప్పొచ్చు. నిజానికి ఈ టారీఫ్ ఏర్పాటు, 2012లో  ప్రతిపాదించిన రైల్వే బడ్జెట్‌లోనే 2012 లోనే నాటి రైల్వే శాఖ మంత్రి  దినేశ్ ద్వివేదీ ప్రతిపాదించారు. మరో వైపు రైల్వే మంత్రులుగా ఉన్నవారు,  సొంత రాష్ర్టం, లేదా సొంత నియోజకవర్గానికి అధిక లబ్ధి పొందేలా నిర్ణయాలు  తీసుకోవడం పరిపాటిగా మారింది. ప్రస్తుత రైల్వే మంత్రి అదే తీరును  ప్రదర్శించారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న గుల్బర్గా నియోజక వర్గానికి  మంచి ప్రాధాన్యం ఇచ్చారు. కొత్తగా వచ్చిన రైళ్లలో సుమారుగా 15, ఈ  నియోజకవర్గం గుండా పరుగులు తీయనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో  కొత్తగా రానున్న ఎనిమిది ఎక్సవూపెస్ రైళ్లలో అయిదు ఉత్తర కర్ణాటకలో ఉన్న  గుల్బర్గా మీదుగా ప్రయాణించేవే. ఉత్తర కర్ణాటకకు అత్యంత సమీపంలో ఉన్న రెండు  లైన్ల డంబ్లింగ్ సర్వేకు కూడా రైల్వేమంత్రి పచ్చజెండా ఊపారు.    రైల్వే బడ్జెట్ చరిత్ర: భారత సాధారణ బడ్జెట్ నుంచి, రైల్వే బడ్జెట్‌ను  1924లో వేరు చేశారు. పది మంది సభ్యులతో కూడిన విలియం ఆక్‌వర్త్  నేతృత్వంలోని కమిటీ సూచన మేరకు, రైల్వేకు ప్రత్యేక బడ్జెట్‌ను  ప్రవేశపెట్టారు. స్వాతంత్య్రం వచ్చాక, తొలి రైల్వే శాఖ మంత్రిగా జాన్  మత్తాయ్ బాధ్యతలు స్వీకరించారు. తొలిసారిగా రైల్వే బడ్జెట్ ప్రసంగాన్ని  ప్రత్యక్ష ప్రసారం 24 మార్చి, 1994లో చేశారు. యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో  వరుసగా ఆరు సార్లు నాటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రవేశపెట్టారు.  యూపీఏ-2 హయాంలో ఆరుగురు రైల్వే శాఖ బాధ్యతలు నిర్వహించారు. తొలుత ఆ పదవిలో  నియామకం అయిన తృణమూల్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ, పశ్చిమబెంగాల్ ముఖ్య  మంత్రిగా బాధ్యతలు స్వీకరించింది. దీంతో అదే పార్టీకి చెందిన దినేశ్  త్రివేదీ రైల్వే మంత్రి అయ్యారు. అయితే ఆయన 2012 బడ్జెట్‌లో రైల్వే  చార్జీలు పెంచడంతో మమత ఒత్తిడి మేరకు ఆయన పదవీత్యాగం చేయాల్సి వచ్చింది.  అదే పార్టీకి చెందిన ముకుల్ రాయ్ బాధ్యతలు స్వీకరించారు. అయితే యూపీఏ కూటమి  నుంచి తృణమూల్ వైదొలగడంతో తాత్కాలికంగా సీజీ జోషీ అదనంగా రైల్వే శాఖ  బాధ్యతలను స్వీకరించారు. అనంతరం పూర్తి స్థాయి మంత్రిగా పవన్ కుమార్  బన్సల్‌ను నియమించారు. అయితే అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన కూడా  వైదొలిగారు. దీంతో మల్లికార్జున ఖర్గే ఆ బాధ్యతలను చేపట్టారు.   ఇతర ముఖ్యాంశాలు:   ఆదాయ అంచనాలు  - ప్రయాణికుల ద్వారా రూ 45, 255 కోట్లు  -సరకు రవాణా చార్జీల ద్వారా రూ 1,05,770 కోట్లు  - ఇతరేతర మార్గాల ద్వారా రూ 9, 700 కోట్లు  -4,556 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ, 2,027 కిలోమీటర్ల మేర కొత్త మార్గాల  నిర్మాణం  -దేశ వాణిజ్య రాజధాని ముంబై, అలహాబాద్‌ల మధ్య హైస్పీడ్ రైలు ప్రాజెక్టు  నిర్మాణం/ ఈ ఏడాది ఏప్రిల్ కల్లా పూర్తి చేసేలా లక్ష్యం.  - ప్రస్తుతం దేశంలో రెండే రెండు రాష్ట్రాల్లో రైల్వే సౌకర్యాలు అందుబాటులో  లేవు, అవి అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఈ రెండు రాష్ట్రాలకు ఈ ఏడాది రైల్వే  సౌకర్యాలు అందుబాట్లోకి రానున్నాయి.   -19 కొత్త లైన్ల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో సర్వే చేపట్టనున్నారు. ఇందులో  భాగంగా అయిదు డంబ్లింగ్ ట్రాక్‌లకు కూడా సర్వే చేస్తారు.  -దేశ వాణిజ్య రాజధాని ముంబైలో జులై నుంచి ఏసీ ఈఎంయూ రైళ్లు పరుగులు  పెట్టనున్నాయి.   -టికెట్ కన్‌ఫర్మ్ అయిన పక్షంలో ప్రయాణికుల మొబైల్‌కు సంక్షిప్త సందేశం  రానుంది. ప్రస్తుతం ఉన్న వాటికి అదనంగా మరికొన్ని ఆహార కేంద్రాలు,  ఎస్కలేటర్లను ఏర్పాటు చేయనున్నారు.   -వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ 1.6 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించే లక్ష్యం  -ప్రత్యేక పార్శిల్ రైళ్లలో పాల రవాణ చేపట్టాలని నిర్ణయం  -ప్యాంట్రీలలో ఎల్పీజీ సిలిండర్ల స్థానంలో ఎలక్ట్రిక్ వంట పరికరాలు  -రాష్ట్ర 13వ అసెంబ్లీ సమావేశాలు ముగిసాయి. ద్రవ్యవినిమయ బిల్లు- 2014ను  ఉభయ సభలు ఆమోదించడంతో శాసన సభ నిరవధికంగా వాయిదా పడింది.  -గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీతో  అమెరికా రాయబారి నాన్సీ పావెల్ సమావేశమయ్యారు. 2002లో జరిగిన గోద్రా  అల్లర్ల తరువాత నరేంద్ర మోడీకి వీసా ఇవ్వడానికి అమెరికా నిరాకరిస్తూ  వస్తోంది. గత 13 ఏళ్లలో ఓ విదేశీ రాయబారి స్థాయి అధికారి గాంధీనగర్ రావడం  ఇదే ప్రథమం.  -సౌర కుటుంబంలో సూర్యుడి చుట్టూ తిరుగుతున్న ఒక తోకచుక్కను యూరోపియన్ ఖగోళ  శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి 'టోటాస్' అని పేరు పెట్టారు.  -సైనిక యుద్ధట్యాంకులకు 'నైట్ విజన్' పరికరాలను సమకూర్చడానికి కేంద్ర  ప్రభుత్వం అంగీకరించి. రూ. 1,800 కోట్లతో ఈ పరికరాల కొనుగోలు ఒప్పందానికి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.   ఫిబ్రవరి 14   -ఆమ్ ఆద్మీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి  రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ మద్దతుతో డిసెంబర్ 28న ముఖ్యమంత్రి  పదవిని చేపట్టారు.  -ఇండోనేసియాలోని జావా దీవిలోని 'మౌంట్ కెలూద్' అగ్నిపర్వతం గురువారం రాత్రి  బద్దలైంది. దీంతో బూడిద, శకలాలు 18 కిలోమీటర్ల దూరం వరకు వెదజిల్లాయి.  -బ్లడ్ కేన్సర్ (ల్యుకేమియా) వ్యాపించడానికి కారణమవుతున్న 'బీఆర్‌జీ1' అనే  జన్యువును కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియెల్ శాస్త్రవేత్తలు  గుర్తించారు.