తెలుగు వారి చరిత్ర పరిశోధనలో మొట్ట మొదట తెలుసుకొవలసిన వంశం శాతవాహనులది. క్రీ.పూ. 220 మొదలుకుని క్రీ.శ. 200 వరకు సుమారు 400 సంవత్సరాలు పాలించారు. తెలుగు చరిత్ర శీర్షికలోని మొదటి అంకం.
శాతవాహనయుగము
మౌర్య సామ్రాజ్య పతన కాలంలో నెలకొన్న అస్థిర పరిసిథతులలో శాతవాహన యుగం మొదలయింది. ఉత్తరాపథం శకులు, యువనులు, పమ్లావలు మొదలగు విదేశీయుల దాడులతో అస్థిరపడింది. ఆ సమయంలో దక్షిణపథం ఐక్యత సాధించి, శాంతిభ్రదతలు కల్పించిన ఘనత శాతవాహనులకు దక్కుతుంది. శాతవాహనులు సుమారు 400 ఏళ్ళు రాజ్యం చేసారు. క్రీ.పూ. 231/230లో శాతవాహన రాజ్య స్థాపన జరిగింది. క్రీ.శ. 220 వరకు వారి పాలన సాగంది.వంశస్థాపకుడు
శాతవాహన వంశ స్థాపకుడు సాద్వాహనుడు లేక శాతవాహనుడు, ఇతడు శ్రీముఖుని కంటే పూర్వుడు. శాతవాహన అనునది వ్యక్తి పేరు అనుటకు శాసనాలు, నాణేలు ప్రమాణాలు శాతవాహనుడు వంశస్థాపకుడే కాని ఇతను స్వతంత్ర రాజ్య స్థాపన చేయలేదు. ఆ ఘనత శ్రీముఖునికి దక్కింది. అతడు క్రీ.పూ. 231/230లో శాతవాహన రాజ్యాన్ని స్థాపించి 23 సంవత్సరాలు పాలించినాడు.శాతవాహన రాజులు
తొలిరాజులు
శ్రీముఖుని తరువాత, అతని తమ్ముడు కన్హ క్రి.పూ 208 సింహాసనం ఎక్కి 10 సంవత్సరాలు రాజ్యం చేసాడు. శ్రీముఖుని కుమారుడు మొదటి శీతకర్ణి ఆ తరువాత రాజ్యమేలినాడు (క్రీ.పూ. 197-179) ఇతడు 18 సంవత్సరాలు పాలించినాడు. అతడు చిన్న వయసులోనే మరణించినప్పటికి తొలి శాతవాహనులలో అతను ముఖ్యుడు. అతనికి కుమారహకుశతి శ్రీమత్, కుమారశాతవాహన, వేదసిరి కుమారులు. తండ్రి మరణ సమయానికి వీరు చిన్నవారు. తల్లి నాగనకాదేవి ఈవిడ మహారథి అంగీయ రాకుమారి. భర్త మరణానంతరము తన తండ్రి త్రణకాయిరో సాయముతో రాజ్యభారం వహించింది. నాగనిక మరణానంతరం అన్నదమ్ముల మధ్య గొడవలు రేగి రాజ్యాన్ని పంచుకొని పాలించినారు.ఆతరువాత కాలంలో ముఖ్యంగా చప్పుకోవలసింది రెండవ శీతకర్ణి. మొదటి శీతకర్ణి తరువాత వచ్చిన్నమైన రాజ్యాన్ని తిరిగి ఏకం చేసినాడు. శకులను ఓడించి మగధ, కళింగ రాజ్యాలను ఆక్రమించినాడు. ఇతడు 56 ఏళ్ళు పాలన సాగించాడు. ఇతడుక్రి.పూ. 100 ప్రాంతంలో రాజ్యం చేసాడు.
రెండో శాతకర్ణి తరువాత అపీలక, మేఘస్వాతి, కుంతల శీతకర్ణి, పులోమావి, హాలశాతవాహనులు రాజ్యం చేసారు. పులోమావి మగధ రాజు కాణ్వసుశర్మను వధించినాడు. ఇతడు క్రీ.పూ. 43-19 మధ్య రాజ్యపాలన చేసినాడు. పులోమావి 15వ శాతవాహన రాజు. క్రి.శ 6-7 మధ్య కాలంలో హాలుడు పాలించినాడు. ఇతడు స్వయంగా గాధాసప్తశతిని సంకలనం చేసినాడు. లీలావతి కావ్యం, అభిధాన చింతామణి దేశీనాయమాల మొదలైన గ్రంథాలు హాలుని కీర్తిని తరువాతి కాలాలకు నిలిపినాయి.
హాలుని తరువాతి రాజుల కాలంలో శకులు విజృంభించి శాతవాహన రాజ్యానికి గడ్డుకాలం పట్టింది. వారి రాజ్యం ఆంధ్రదేశ ప్రాంతాలకు పరిమితమయింది. శాతవాహనుల ప్రతిష్టను తిరిగి సంపాదించిన రాజు గౌతమీపుత్ర శాతర్ణి. శాతవాహనులందరిలోకి అత్యంత పేరు పొంది భారతీయ చక్రవర్తులలో ప్రముఖునిగా నిలిచాడు. క్రి.శ 75-110 మధ్య పరిపాలించాడు.
గౌతమీ పుత్ర శతకర్ణి పలు దిగ్విజయాత్రలు జరిపి తిరగి శాతవాహనుల రాజ్యాన్ని సువిశాల సామ్రాజ్యంగా మలిచాడు. నాసిక్లో అతను వేయించిన రెండు శాసనాలు, అతని తల్లి బాలశ్రీ వేయించిన శాసనం గౌతమీపుత్ర శతకర్ణి గురించి తెలుసుకోవడానికి ముఖ్య ఆధారాలు. ఇతని తల్లి బ్రాహ్మణీ. ఇతను వూదిక విద్యాధర్మతత్పరుడు. రాజకీయ కారణాలచేత పరమత సహనాన్ని కనబర్చినాడు. బౌద్ధ మతాలనుయూయిలకు దాన ధర్మములు చేసినాడు.
గౌతమీపుత్ర శాతకర్ణి తరువాత అతని కుమారుడు వాసిష్టీపుత్ర రెండో పులోమావి రాజ్యాధిపత్యం వహించారు. ఇతడు క్రీ.శ. 110-13.. కాలం మధ్య రాజ్యపాలన చేశాడు. (ఇందులోను, గౌతమీపుత్ర శాతకర్ణి కాలనిర్ణయంలోను కొన్ని విరుధ సమయాలను పలువురు చరిత్రకారులు తెల్పుతున్రాని గ్రహింపవలె) రెండో పులోమావి తండ్రి వలే జయించిన ప్రాంతాలు లేవు. ఇతని కాంలోనే శాతవాహనుల వైభవం తగ్గడం ప్రారంభమైందని చెప్పవచ్చు.
రెండో పులోమావి తరువాత శివశ్రీశీతకర్ణి రాజ్యమేలినాడు. మహాక్షాత్తప రుద్రదాముని కుమార్తె రుద్రదామునికను పెండ్లి చేసుకున్నాడు. అయినప్పటికి క్షాత్రపులతో సమరం తప్పలేదు. రుద్రధాముడు అతనిని ఓడించి అల్లుడని విడిచిపెట్టినట్లు జూనాగడ్ శాసనం వల్ల తెలుస్తున్నది.
శాతవాహన రాజులలో శివశ్రీ శ్రీతకర్ణి తరువాత యజ్ఞశ్రీ శాతకర్ణి చివరివాడు. ఆంధ్రపదేశ్, మధ్యప్రదేశ్, బిరార్, కొంకణ, సౌరాష్ట్ర, మహారాష్ట్ర ప్రాంతాలలో దొరికిన ఇతని నాణేలను బట్టి యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహన రాజ్యాన్ని పూర్వం వలే విస్తరింపచేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ బౌద్ధ మతాచార్యుడైన నాగార్జునా చార్యుని పోషించినాడని ప్రతీతి.
యజ్ఞశ్రీ మరణానంతరం శాతవాహన రాజ్యం క్షిణించి త్వరలోనే నశించింది.
శాతవాహన యుగ విశేషాలు
ధర్మశాస్త్ర సమ్మతమైన రాచరికం శాతవాహనుల రాజ్యాంగానికి మూలం. రాజు సర్వసైన్యాధక్షుడు. పరిపాలనాధ్యక్షుడు. మంత్రుల ఆజ్ఞ సాయముతో రాజు పాలించేవాడు. రాజే ఆజ్ఞలు జారీ చేసేవాడు. ధర్మశాష్ట్రసమంతమైన పన్నులు వసూలు చేసి ప్రజలకవసరమైన సంస్థలను పోషించేవాడు. శాతవాహన సామ్రాజ్యం కేంద్రీకృత రాజరికం కాదు. వారి కింద అనేక సామంతరాజ్యాలుండేవి. సామతరాజులు ప్రాంతాలు కాని ప్రదేశాలను రాజు పాలించేవాడు. అనేక ఉన్నతోద్యోగులు రాజ్యపాలనకి సహకరించేవారు. నగరాలన్నింటిలోను కార్యాలయాలు ఉండేవి (Records offices) ధన రూపంలో జీతాలు ఇచ్చేవారు. '' దేయమేయ'', ''రాజభాగం'' అనే పేర్లతో పంటలో రాజుకు భాగం వుండేది. భూమి పనున, వృత్తి పన్నులు వసూలు చేసేవారు. రాజు ప్రత్యక్ష పాలనలో ఉన్న ప్రాంతాలు ( అంటే సామంత రాజ్యాలు కాని సామ్రాజ్య భాగం) '' ఆహారాలు'' అనే రాష్ట్రాలుగా విభజించచారు. ప్రతి రాష్ట్ర రాజధానిలోను సైన్యాగారాలు ఉండేవి. నగరాలకు రక్షణగా దుర్గనిర్మాణం ఉండేది. రాష్ట్ర పాలనకు '' ఆమాత్యులను'' రాజు నియమించేవాడు. వారిని తరచు బదిలీ చేస్తుండేవాడు. ఆమాత్యులకు వంశపారంపర్య మక్కులల ఉండేవి కావు. పరిపాలనకు గ్రామం ప్రాతిపదిక. సాంఘిక పరిస్థితులు సంఘంలో ‘చతుర్వర్ణ వ్యవస్థ’ ఏర్పడింది. పితృస్వామ్య ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. కుటుంబ పెద్దను ‘గహపతి’ (గృహపతి) అని పిలిచేవారు. గౌతమీపుత్ర శాతకర్ణిని ‘వినివర్తిత చతుర్వర్ణ సాంకస్య’ అని ‘నాసిక్ శాసనం’ వర్ణించింది. బ్రాహ్మణులకు సంఘంలో ప్రత్యేక గౌరవం ఉండేది. వృత్తిని బట్టి కులాలు, ఉపకులాలు ఏర్పడ్డాయి. సంఘంలో స్త్రీకి గౌరవం లభించేది. స్త్రీలకు ఆస్తి హక్కులుండేవి. ఆనాటి బౌద్ధ విహారాలకు స్త్రీలే ఎక్కువ దానధర్మాలు చేశారు. గౌతమీపుత్ర ‘వాసిష్టీపుత్ర’ అనే మాతృసంజ్ఞలు స్త్రీలకు ఉన్న గౌరవాన్ని సూచిస్తున్నాయి. స్త్రీ, పురుషులు ఒకే విధమైన ఆభరణాలు ధరించేవారు. జూదం, నాట్యం, సంగీతం ఆనాటి ప్రజల వినోదం. అమరావతి కార్లే శిల్పాల్లో స్త్రీ-పురుషులను వివిధ భంగిమల్లో అలంకారాలతో తీర్చిదిద్దారు. శాతవాహనుల సమకాలికులైన శకులు, యవనులు, పహ్లవులు, వైదిక బౌద్ధమతాలను అవలంభించారు. ధర్మదేవ, అగ్ని వర్మన్, రుషభదత్త మొదలైన హిందువుల పేర్లను పెట్టుకున్నారు. శకరాజైన రుషభదత్తుడు రాజస్థాన్‌లో పుష్కర ప్రాంతానికి యాత్రలు చేసి బ్రాహ్మణులకు గోవులు, గ్రామాలు దానం చేశాడు. గాధాసప్తశతి ఆనాటి ప్రజల జీవిత, ఆచార- వ్యవహారాలను చక్కగా వర్ణించింది. మత పరిస్థితులు: శాతవాహన తొలిరాజులు వైదిక మతాన్ని పోషించారు. మొదటి శాతకర్ణి రెండు అశ్వమేధ, ఒక ‘రాజసూయ’ యాగం చేసినట్లు అతని భార్య ‘నాగనిక’ వేయించిన ‘నానాఘాట్ శాసనం’ తెలుపుతుంది. గౌతమీపుత్ర శాతకర్ణికి ‘ఏకబ్రాహ్మణ’, ‘ఆగమనిలయ’ అనే బిరుదులుఉన్నాయి. వైదిక మతంతో పాటు శివుడిని కూడా ఆరాధించేవారని గాధాసప్తశతి పేర్కొంది. సంరక్షణ వాసుదేవాయతనం నిర్మించిన ప్రాకారాన్ని క్రీ.పూ. 2వ శతాబ్దం నాటి ‘ఘోసండి’ శాసనం ప్రస్తావించింది. మధ్యప్రదేశ్ ‘విదిశ’ ప్రాంతంలో హెలియోడోరస్ క్రీ.పూ. 1వ శతాబ్దంలో వేసిన స్తంభ శాసనం ‘భాగవత మతం’ గురించి ప్రస్తావించింది. శాతవాహన రాజుల్లో కృష్ణ, వేదశ్రీ, శకిశ్రీ, యజ్ఞనుశ్రీ పేర్లను బట్టి వైదిక ధర్మాన్ని ఆచరించినట్లు తెలుస్తుంది. శివ -కేశవులు, రాధా- కృష్ణులను ఆరాధించే వారని గాధాసప్తశతి పేర్కొంది. ప్రజలు గ్రామ దేవతలు, చెట్లు - పుట్టలు, సర్పాలను ఆరాధించేవారు. బౌద్ధ మతం: క్రీ.పూ. రెండో శతాబ్దం నుంచి, మూడో శతాబ్దం వరకు పశ్చిమ, తూర్పు, దక్కన్ ప్రాంతాల్లో బౌద్ధం విశేష ఆదరణ పొందింది. స్థూపాలు, చైత్యగృహాలు, విహారాలకు వృత్తి పనివారు, వర్తక శ్రేణులు, స్త్రీలు విరివిగా దానాలు చేశారు. శాతవాహన తొలి రాజు కృష్ణుడు (కన్హ) బౌద్ధ బిక్షువుల కోసం నాసిక్‌లో గుహాలయం నిర్మించాడు. గౌతమీ బాలశ్రీ, రెండో పులోమావి కార్లేలో మహా సాంఘికులకు గుహదానం చేశారు. రుషభ దత్తుడు గోవర్పనలో గుహ నిర్మాణానికి నాలుగు వేల ‘కార్షాపణులు’ (వెండి నాణేలు) బౌద్ధ భిక్షువులకు దానం చేశాడు. నాసిక్, కార్లే, కన్హౌరి, కుడ, భాజా, బేడ్సా, అజంతా వంటి గుహలు దక్కన్ పశ్చిమ ప్రాంతంలో భిక్షువుల కోసం నిర్మించారు. తూర్పు తీరంలో అమరావతి, భట్టిప్రోలు, జగ్గయ్యపేట, గుంటుపల్లి, శాలిహుండం, రామ తీర్థం, బుద్ధన్నకొండ ప్రాంతాల్లో అనేక బౌద్ధ వాస్తు నిర్మాణాలు చేశారు. బౌద్ధమతంలో అనేక శాఖలు విస్తరించాయి. వీటిలో అంధక శాఖ (ఆంధ్రులు), బాదనీయ శాఖ (నాసిక్), మహా సాంఘికులు (కార్లై), దమ్మ మత్తరీయలు (సోపార), చైత్యకులు (అమరావతి), పూర్వ శైలీయులు, అపర శైలీయులు (నాగార్జున కొండ) ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జైనమతం: శాతవాహన యుగంలో జైన మత ఆదరణ తక్కువ. రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు మొదట జైన మతాన్ని అనుసరించాడు. ప్రసిద్ధ జైనమతాచార్యుడు ‘కొండ కుందాచార్యుడు’ శాతవాహనులకు సమకాలికుడు. ఇతడు సమయసారం అనే గ్రంథం రచించాడు. ఇది ‘శ్వేతాంబర’, ‘దిగంబర’ జైన శాఖీయులకు ప్రమాణ గ్రంథం. తొలి శాతవాహనులు జైన మతాన్ని పోషించినట్లు ఆవశ్య సూత్రం, కల్ప ప్రదీప, ప్రభావిక చరిత్ర గ్రంథాలు తెలుపుతున్నాయి. గుంటూరు జిల్లా వడ్డమాను కొండ వద్ద లభించిన పురావస్తు అవశేషాలు శాతవాహనుల కాలాన్ని సూచిస్తాయి. భాషా సారస్వతాలు: శాతవాహనుల రాజభాష ప్రాకృతం. బ్రహ్మీలిపి. శాతవాహనులు పశ్చిమ క్షాత్రపుల శాసనాలన్నీ ప్రాకృత భాషలో లిఖించారు. క్రీ.పూ. 3వ శతాబ్దంలో ప్రాకృత భాష - బ్రహ్మీలిపి బహుళ ప్రజాదారణ పొందాయి. హాలుడు 700 శృంగార పదాలతో గాధాసప్తవతిని ప్రాకృత భాషలో సంకలనం చేశాడు. దీని నుంచే ‘అమృతం ప్రాకృత కావ్యం’ అనే సూక్తి ఏర్పడింది. ఇతడికి ‘కవి వత్సలుడు’ అనే బిరుదు ఉంది. ఇతని ఆస్థానంలో కుమారిల, శ్రీ పాలితుడు ముఖ్యులు. శాతవాహన మంత్రి గుణాఢ్యుడు పైశాచ భాషలో (ప్రాచీన ప్రాకృత భాష) ‘బృహత్కథను’ రచించాడు. దీని ఆధారంగా క్షమేంద్రుడు బృహత్కథాసార సంగ్రహం, సోమదేవసూరి - కథా సరిత్సాగరం సంస్కృత భాషలో రచించారు. ధనపాలుడు- తిలకమంజరీ, బుధస్వామిన్- బుద్ధకథా శీర్షిక, బృహత్కథా శ్లోక సంగ్రహం, సంస్కృత భాషలో రచించారు. ఈ సంస్కృత గ్రంథాలన్నీ మలిశాతవాహనుల కాలంలో వచ్చాయి. శర్వ వర్మన్ - కాతంత్ర వ్యాకరణ గ్రంథం సంస్కృతంలో రచించాడు. కుతూహలుడు, లీలావతి పరిణయం ప్రాకృతంలో రచించాడు. కొండకుందాచారి సమయసారం రచించాడు. శక రుద్రదమనుడు క్రీ.శ. 150లో గిర్నార్ శాసనాన్ని సంస్కృత భాషలో వేయించాడు. గాధాసప్తశతిలో అనేక దేశీయ పదాలు కనిపిస్తాయి. విద్యాబోధన బ్రాహ్మణ ఆశ్రమాలు, బౌద్ధ విహారాల్లో జరిగేది. ప్రముఖ విద్యా కేంద్రాల్ని ఘటికలు (ఉన్నత విద్యా కేంద్రాలు) అనేవారు. శ్రీపర్వతం (నాగార్జున కొండ) ప్రముఖ విద్యాకేంద్రంగా ప్రసిద్ధి చెందింది. మాధ్యమిక వాద సిద్ధాంత కర్త, ఆచార్య నాగార్జునుడు తన గ్రంథాలన్నీ సంస్కృత భాషలోనే రచించాడు. ప్రజ్ఞా పారమిత శాస్త్రం, మూల మాధ్యమిక శాస్త్రం, ద్వాదశ నికాయ శాస్త్రం, శూన్య సప్తతి, సుహృల్లేఖ, యోగాచార శాస్త్రం, రస రత్నాకరం, రతి శాస్త్రం.. వీటిని సంస్కృతం నుంచి చైనా భాషలోకి అనువదించారు. భారతీయ తర్కశాస్త్రానికి నాగార్జునుడిని పితామహుడిగా పేర్కొంటారు. రెండో తథాగతుడు, ఇండియన్ ఐన్‌స్టీన్, ఇండియన్ మార్టిన్ లూధర్ అనే బిరుదులు నాగార్జునుడికి ఉన్నాయి. వాస్తు నిర్మాణాలు: శాతవాహనుల కాలంలో భవన నిర్మాణానికి మట్టి, ఇటుకలు, వెదురు బొంగులు వినియోగించేవారు. రాతి గుహల్లో స్థూపాలు, చైత్య గృహాలు, విహారాలు నిర్మించారు. మహా చైత్యం (స్థూపం), బుద్ధుడి అవశేషాలపై నిర్మించారు. ఆంధ్రదేశంలో భట్టిప్రోలు స్థూపం అతి ప్రాచీనమైంది. నాగార్జున కొండ, అమరావతి, ఘంటశాల, చందవోలు స్థూపాలకు ప్రసిద్ధి. బౌద్ధ బిక్షువుల నిత్య పూజ కోసం నిర్మించినవే చైత్యగృహాలు. ముందు భాగం చతురస్రం, వెనుక భాగం వంపుగా ఉంటూ, మధ్య భాగంలో బుద్ధుడి ప్రతిమ ఉంటుంది. చైత్యం గజపృష్టాకారంలో ఉంటుంది. ఆంధ్రాలో చేజర్ల, గుంటుపల్లి, శాలిహుండం (శ్రీకాకుళం), విద్యాధరపురం (విజయవాడ), రామతీర్థం (విజయనగరం జిల్లా) ప్రసిద్ధ చైత్య నిర్మాణాలు. పశ్చిమ తీరంలో కార్లీ, భాజ, బేడ్సా, కన్హౌరీ ప్రసిద్ధి గాంచిన చైత్య గృహాలు. కొండల్ని తొలిచి వీటిని నిర్మించారు. బౌద్ధ బిక్షువులు నివసించడానికి ఏర్పాటు చేసినవే ‘వసతులు’. ఇవి చిన్న చిన్న గదులుగా ఉంటాయి. ఆంధ్ర దేశంలో రామతీర్థం, శాలిహుండం, కోరుకొండ, గుంటుపల్లి, విజయవాడ గుహ-విహారాలుగా ప్రసిద్ధి పొందాయి. నాగార్జున కొండ, అమరావతిల్లో ఇటుకలతో నిర్మించిన విహారాలు కనిపిస్తాయి. శాతవాహనుల కాలం నాటి చిత్రకళ అజంతా, ఎల్లోరా, పితల్ కోరా, జునార్ గుహల్లో కనిపిస్తుంది. అజంతా 9, 10 గుహల్లో ఆంధ్రులు చిత్రించిన చిత్రలేఖనాలున్నాయి. గుంటుపల్లి గుహలు: పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు దగ్గర కామవరపు కోట సమీపంలో ఉన్నాయి. కొండపై చైత్య గృహం, విహారం నిర్మించారు. ఇవి క్రీ.పూ. 200 సంవత్సరాల నాటివి. శంకరం గుహలు: విశాఖ జిల్లా, అనకాపల్లికి 2 మైళ్ల దూరంలో ఉన్నాయి. విహారాలు, చైత్యాలు నిర్మించారు. క్రీ.శ. 4వ శతాబ్దం నాటి సముద్ర గుప్తుడి బంగారు నాణెం లభించింది. గుర్రం ముద్రలున్న శాతవాహన నాణేలు, వేంగీ చాళుక్యుడు, కుబ్జ విష్ణు వర్థనుడి రాగి నాణేలు లభించాయి. రామతీర్థం గుహలు: విజయనగరానికి 8 మైళ్ల దూరంలో ఉన్నాయి. గురుభక్త కొండ మీద మహా చైత్యం (స్థూపం), చైత్య గృహాలు ఉన్నాయి. ప్రాకృత భాషలో ఉన్న రెండు ముద్రికలు ఇక్కడ లభించాయి. శాలిహుండం: శ్రీకాకుళం జిల్లాలో వంశధార నది ఒడ్డున ఈ గ్రామం ఉంది. దీనికి దక్షిణ దిశలో ఉన్న కొండ మీద చైత్య గృహాలున్నాయి. క్రీ.శ. 8, 9 శతాబ్దాలకు చెందిన మారీచ, తారా, అవలోకితేశ్వర వంటి వజ్రయానానికి చెందిన 12 బౌద్ధ విగ్రహాలు లభించాయి. చేది వంశం: శాతవాహనుల సమకాలీన వంశం. ఈ వంశానికే మహామేఘవాహన వంశమని పేరుంది. స్వతంత్ర కళింగ రాజ్య స్థాపనకు మూల పురుషులు ఈ వంశీయులు. ఈ వంశంలో ఖారవేలుడు ముఖ్యుడు. ఇతడికి ‘కళింగాధిపతి, కళింగ చక్రవర్తి’ అనే బిరుదులు ఉన్నాయి. ఇతడు ఒరిస్సాలో ఉదయగిరి గుహల్లో హాతిగుంఫా శాసనాన్ని వేశాడు. ఇతడు క్రీ.పూ. 2వ శతాబ్దానికి చెందినవాడు. శాతవాహన రెండో శాతకర్ణి ఇతడికి సమకాలికుడు. ఖారవేలుడు జైన మతస్థుడు. ఉదయగిరి (కుమారగిరిపై) జైన పరిషత్ నిర్వహించి, జైన మత గ్రంథాలను క్రోడీకరించాడు. తన రాజధాని నగరంలో ‘మహా విజయ ప్రాసాదం’ నిర్మించాడు. శాతవాహనాంతర రాజవంశాలు సుమారు నాలుగున్నర శతాబ్దాల పాటు దక్షిణాపథాన్ని ప్రధానంగా ఆంధ్ర దేశాన్ని పాలించిన శాతవాహన రాజవంశం క్రీ.శ. 3వ శతాబ్ది ప్రారంభంలో అస్తమించింది. ఈ సమయంలో వారి సామంతులు, మాండలిక ప్రభువులు స్వతంత్రులయ్యారు. ఈ రాజవంశాలు నాలుగు శతాబ్దాల కాలం (క్రీ.శ. 200-614) దక్షిణాపథాన్ని పాలించాయి. వారిలో ఇక్ష్వాకులు, బృహత్పలాయనులు, ఆనందగోత్రులు, శాలంకాయనులు, విష్ణుకుండినులు, పల్లవులు ముఖ్యులు. వీరితో పాటు చుటు వంశీయులు- బనవాసి (మైసూరు), ఆభీరులు (మహారాష్ట్ర ప్రాంతాన్ని), వాకాటకులు (విదర్భ ప్రాంతాన్ని), కంచిలో పల్లవులు కూడా రాజకీయాధికారాన్ని చేపట్టారు. ఇక్ష్వాకులు: ఇక్ష్వాకులు విజయపురి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని కృష్ణా-గుంటూరు ప్రాంతాన్ని యాభై ఏళ్లకు పైగా పాలించారు. పురాణాలు వీరిని ‘శ్రీపర్వతీయ ఆంధ్రులని’ పేర్కొంటున్నాయి. నాగార్జునకొండకు శ్రీపర్వతమనే పేరు ఉన్నట్లు ఇక్కడ లభించిన ప్రాకృత శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక్ష్వాకులు బుద్ధుడి వంశం వారని, బుద్ధుడు ఇక్ష్వాకు రాజ వంశీయుడని నాగార్జునకొండ ప్రాకృత శాసనాల్లో ప్రస్థావించారు. ‘ఇక్షు’ (చెరుకుగడ) చిహ్నాన్ని తమ తెగకు గుర్తింపుగా చేసుకోవడం వల్ల వీరు ఇక్ష్వాకులై ఉంటారని బి.ఎస్.ఎల్. హనుమంతరావు అభిప్రాయపడ్డారు. ఇక్ష్వాకు రాజ్య స్థాపకుడు వాసిష్టీపుత్ర శ్రీఛాంతమూలుడు. ఇతడు (క్రీ.శ. 200-218) మధ్య కాలంలో రెండు దశాబ్దాలు పాలించినట్లు గుంటూరు జిల్లాలో లభించిన రెంటాల, కేసనపల్లి శాసనాలు పేర్కొంటున్నాయి. ఇతడు గొప్ప విజేత. ఇతని రాజ్యం క్షాత్రపుల ఉజ్జయిని, బనవాసి (మైసూరు) వరకు విస్తరించింది. ఛాంతమూలుడు ధనక, పూగియ వంశాలతో మైత్రీ, వివాహ సంబంధాలు నెలకొల్పాడు. ఇతడు శైవుడు. కార్తికేయుని భక్తుడు. కోవి, హిరణ్య, గో, హల, సహస్ర ప్రదాత, అప్రతిహత శాసనుడు, వాసిష్టీపుత్రుడిగా ఛాంతిసిరి వేయించిన నాగార్జునకొండ శాసనం వర్ణించింది. చాంతమూలుడు అశ్వమేధ, రాజసూయ యాగాలు చేసి, సామ్రాట్, సార్వభౌమ బిరుదులు పొందాడు. శ్రీవీరపురుషదత్తుడు (క్రీ.శ. 218-238): శ్రీఛాంతమూలుడి తర్వాత అతని కుమారుడు శ్రీవీరపురుషదత్తుడు 20 ఏళ్లు పాలించాడు. మహారాజ-మాఢరీపుత్ర శ్రీపురుషదత్తుడని నాగార్జునకొండ, జగ్గయ్యపేట శాసనాలు పేర్కొన్నాయి. ఉజ్జయిని రాజైన రెండో శకరుద్రసేనుని కుమార్తె రుద్రధరభట్టారికను వివాహం చేసుకున్నాడు. ఇతని కాలంలో బౌద్ధమతం స్వర్ణయుగంగా భాసిల్లింది. శ్రీపర్వత ప్రాంతం గొప్ప ధార్మిక, సాంస్కృతిక కేంద్రంగా వర్ధిల్లింది. నాగార్జునకొండ మహాచైత్యాన్ని (స్థూపం) భదంత ఆనందుడు అనే ఆచార్యుడి పర్యవేక్షణలో ఇతడు పునరుద్ధరించాడు. |