భారత్‌లో ఇన్ఫినిక్స్ నోట్ 30 5జీ ( Infinix Note 30 5G) తాజాగా విడుదలైంది. 6.78 అంగుళాల 120హెడ్జ్ డిస్‌ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 6080 SoC, 8GB వరకు ర్యామ్‌తో కూడిన ఫీచర్-ప్యాక్డ్ స్మార్ట్‌ఫోన్ ఇది. హై రిజల్యూషన్ 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, JBL సౌండ్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లతో వస్తోంది.
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5,000mAh బ్యాటరీ, గేమింగ్ సమయంలో వేడెక్కడాన్ని తగ్గించడానికి బైపాస్ చార్జింగ్ మోడ్‌ను కలిగి ఉంది. ఇన్ఫినిక్స్ నోట్ 30 5జీ ఫోన్ 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. ఇక 8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999. యాక్సిస్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్‌లు రూ. 1,000 తగ్గింపును పొందవచ్చు. ఈ ఫోన్ అమ్మకాలు జూన్ 22వ తేదీ మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానున్నాయి.
స్పెసిఫికేషన్‌లు
- ఇన్ఫినిక్స్ నోట్ 30 5జీ ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) స్మార్ట్‌ఫోన్
- ఆండ్రాయిడ్ 13-ఆధారిత XOS 13 ఆపరేటింగ్ సిస్టమ్
- 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 580 నిట్‌ల వరకు గరిష్ట బ్రయిట్‌నెస్‌తో పెద్ద 6.78అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లే
- ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 SoC, మాలి G57 MC2 GPU, 8GB వరకు ర్యామ్
- హై-రిజల్యూషన్ 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, రెండు అదనపు సెన్సార్‌లు
- ముందు భాగంలో, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16-మెగాపిక్సెల్ కెమెరా.
- JBL సౌండ్‌ని అందించే డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లు.
- హై-రెస్ ఆడియో సర్టిఫికేషన్
- 256 జీబీ వరకు స్టోరోజ్, మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ఉపయోగించి విస్తరించవచ్చు.
- 5G, 4G, Wi-Fi, బ్లూటూత్, GPS, NFC, 3.5mm ఆడియో జాక్, USB టైప్-C పోర్ట్‌తో సహా వివిధ కనెక్టివిటీ ఆప్షన్లకు మద్దతు
- యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ వంటి అనేక సెన్సార్‌లు.
- బయోమెట్రిక్ ప్రమాణీకరణ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్.
- 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీ.
- గేమర్‌లు నేరుగా మదర్‌బోర్డుకు చార్జ్ చేసే బైపాస్ ఛార్జింగ్ ఫీచర్.
- 168.51x76.51x8.45mm కొలతలు, 204.7 గ్రాముల బరువు.