గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలకు దరఖాస్తుల గడువు
సమీపిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేందుకు ఇంకా మూడు రోజులే గడువు
ఉంది. పూర్తి వివరాలివే..
దేశవ్యాప్తంగా రీజినల్ రూరల్ బ్యాంకు (RRB)ల్లో ఖాళీగా
ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసే నియామక పరీక్షకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) భారీ నోటిఫికేషన్ విడుదల చేసిన
విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులకు గడువు సమీపిస్తోంది. జూన్
21వరకు మాత్రమే గడువు ఉండటంతో ఈలోగా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు
చేసుకోవచ్చు. కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్-XII (CRP)ల ద్వారా
దేశవ్యాప్తంగా 9,053 ఉద్యోగాల భర్తీకి జూన్ 1 నుంచి దరఖాస్తులు
ఆహ్వనిస్తున్నారు. క్లర్క్, పీఓ, ఆఫీసర్స్ స్కేల్ II, III స్థాయి
పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీఏ,
సీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులను అర్హులుగా నిర్ణయించారు. ఆన్‌లైన్ టెస్ట్
(ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక
చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 21వరకు https://www.ibps.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగాలివే..
ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ షెడ్యూల్..
- దరఖాస్తుల స్వీకరణ: జూన్ 1 నుంచి జూన్ 21 వరకు
- ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్(PET): జులై 17 నుంచి 22వరకు
- ప్రీ ఎగ్జామ్ ట్రెయినింగ్(PET) కాల్ లెటర్ల డౌన్‌లోడ్: జులై 10
- ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ క్లర్క్ ప్రిలిమ్స్ ఆన్‌లైన్ పరీక్ష: ఆగస్టులో జరిగే అవకాశం
- ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు, మెయిన్స్ పరీక్ష సెప్టెంబర్‌లో జరిగే అవకాశం ఉంది.
- మెయిన్స్ ఫలితాలు అక్టోబర్‌లో ప్రకటించి.. అక్టోబర్/నవంబర్ మాసాల్లో ఇంటర్వూలు నిర్వహిస్తారు.
- ప్రొవిజనల్ అలాట్‌మెంట్: జనవరి, 2024
- దరఖాస్తు రుసుం: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్ సర్వీస్ మెన్ ₹175; ఇతరులు ₹850
- ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ క్లర్కు, పీవో (అసిస్టెంట్ మేనేజర్) విద్యార్హత గ్రాడ్యుయేషన్ ఉంటే చాలు. ఎలాంటి అనుభవం అవసరంలేదు.
- ఆఫీసర్ స్కేల్- 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ (మేనేజర్) పోస్టులకు గ్రాడ్యుయేషన్‌లో 50శాతం మార్కులు ఉండాలి. ఏదైనా బ్యాంకు/ఫైనాన్సియల్ ఇన్‌స్టిట్యూట్‌లో రెండేళ్ల పాటు పనిచేసిన అనుభవం తప్పనిసరి.
- వేతనం: ఉద్యోగాల హోదాలను బట్టి నెలకు కనీస వేతనం రూ.15వేలు నుంచి గరిష్ఠంగా రూ.44వేలు వరకు ఉండొచ్చు.