Friday, May 5, 2023

Whatsapp: తెలియని నెంబర్ల నుంచి వాట్సాప్‌ కాల్స్‌ వస్తున్నాయా.?

  

 


సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథా ఎంచుకుంటున్నారు. కొంగొత్త మార్గాల్లో అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్నో రకాల మోసాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ మోసమో మరోసారి వెలుగు చూసింది. ఈసారి సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్‌ను తమ మోసానికి వారధిగా వాడుకుంటున్నారు....

సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథా ఎంచుకుంటున్నారు. కొంగొత్త మార్గాల్లో అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్నో రకాల మోసాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ మోసమో మరోసారి వెలుగు చూసింది. ఈసారి సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్‌ను తమ మోసానికి వారధిగా వాడుకుంటున్నారు. ఇటీవలి కాలంలో చాలా మందికి తెలియని నెంబర్ల నుంచి వాట్సాప్‌ కాల్స్‌ వస్తున్నాయి. అవికూడా ఇతర దేశాలకు చెందిన కోడ్‌తో వస్తున్నాయి.

ఈ ఫేక్‌ కాల్స్‌ ద్వారా కొంత మంది యూజర్లను టార్గె్ట్‌ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. వాయిస్‌ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ నెంబర్‌ను కొనుగోలు చేయడం ద్వారా ఇతర దేశాల నుంచి ఫోన్‌ వస్తున్నట్లు భ్రమ కలిగిస్తున్నారు. ఇలా ఫోన్‌ కాల్స్‌ చేసి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పని ఉందంటూ వినియోగదారులను మోసం చేస్తున్నారు. కేవలం వెబ్‌సైట్స్‌ క్లిక్‌ చేస్తే డబ్బులు వస్తాయంటూ ఆశ చూపుతూ యూజర్లను నిండా ముంచుతున్నారు. కాబట్టి ఇలాంటి ఫోన్‌ కాల్స్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది యూజర్లు తమకు ఇలాంటి అన్ నోన్ నెంబర్స్ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయంటూ ట్విట్టర్ వేదికగా స్క్రీన్ షాట్స్ పోస్ట్ చేస్తున్నారు.