Saturday, December 3, 2022

TSPSC Ground Water Department Posts :టీఎస్‌పీఎస్సీ (TSPSC) నుంచి మరో రెండు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.

 


 

TSPSC Ground Water Department Posts :టీఎస్‌పీఎస్సీ (TSPSC) నుంచి మరో రెండు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ రెండు నోటిఫికేషన్లు గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ కు సంబంధించినవి. వీటిలో నాన్ గెజిటెడ్ పోస్టులు (Non Gazetted)- 25, గెజిటెడ్ (Gazetted) పోస్టులు- 32 ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి రెండు నోటిఫికేషన్లను విడివిడిగా TSPSC విడుదల చేసింది.

నాన్ గెజిటెడ్ పోస్టుల వివరాలు:

  • టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రోజియాలజిస్ట్) - 07
  • టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రాలజిస్ట్ ) - 05
  • టెక్నికల్ అసిస్టెంట్ (జియో ఫిజిక్స్) - 08
  • ల్యాబ్ అసిస్టెంట్ - 01
  • జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ - 04

విద్యార్హతలు:
  • టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రోజియాలజిస్ట్) .. జియాలజీలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రాలజిస్ట్ ).. సివిల్ ఇంజనీరింగ్ లో జియాలజీ అనేది ఒక సబ్జెక్ట్ ఉండాలి. లేదా హైడ్రాలజీలో రెండేళ్ల ఎమ్సెస్సీ పూర్తి చేసి ఉండాలి.
  • టెక్నికల్ అసిస్టెంట్ (జియో ఫిజిక్స్).. జియో ఫిజిక్స్ లో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. లేదా ఎంటెక్ లో జియో ఫిజిక్స్ పూర్తి చేసిన వారు అర్హులు.
  • ల్యాబ్ అసిస్టెంట్.. కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్ట్ తో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్.. జియాలజీలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. లేదా మ్యాథమేటిక్స్ లేదా జియాలజీ ఒక సబ్జెక్ట్ తో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
  • నాన్ గెజిటెడ్ పోస్టులకు దరఖాస్తుల ప్రారంభ తేదీ - డిసెంబర్ 07, 2022
  • దరఖాస్తులకు చివరి తేదీ - డిసెంబర్ 28, 2022

గెజిటెడ్ ఉద్యోగాలు
  • అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ - 01
  • అసిస్టెంట్ కెమిస్ట్ - 04
  • అసిస్టెంట్ జియోఫిజిస్ట్ - 06
  • అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్ట్ - 16
  • అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ - 05

అర్హతలు
  • అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్.. మెటీరియాలజీ లేదా ఫిజిక్స్ లేదా మ్యాథమేటిక్స్ లేదా అప్లైడ్ మేథమేటిక్స్ లో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి.
  • అసిస్టెంట్ కెమిస్ట్.. కెమిస్ట్రీ లేదా అప్లైడ్ కెమిస్ట్రీలో డిగ్రీ కలిగి ఉండాలి. లేదా కెమికల్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేసిన వారు కూడా అర్హులు. వీటితో పాటు.. పీజీ కూడా ఉండాలి.
  • అసిస్టెంట్ జియోఫిజిస్ట్.. జియో ఫిజిక్స్ లో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి.
  • అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్ట్.. జియాలజీలో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి.
  • అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్.. సివిల్ ఇంజనీరింగ్ లో జియోలజీ అనేది ఒక సబ్జెక్ట్ కలిగి ఉండాలి. లేదా హైడ్రాలజీలో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి.
  • వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
  • గెజిటెట్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 06, 2022 నుంచి ప్రారంభం కానుండగా.. డిసెంబర్ 27, 2022 వరకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ కొనసాగనుంది.

 

 పూర్తి వివరాలకు ఇక్కడ      క్లిక్‌ చేయండి.