Tuesday, July 26, 2022

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ ....

 

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..

 


 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ జాతరలో భాగంగా పలు నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. అందులో భాగంగానే చాలా రోజులుగా ఎదురు చూస్తున్నా MBBS ఉద్యోగార్థులకు, ఆరోగ్యశాఖ శుభవార్త చెప్పింది. మొత్తం 969 పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు, ఈ నెల 21వ తేదీ నుండి ఆగస్ట్ 14వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు.. దరఖాస్తు చేయడానికి ముందు ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం ఈ పేజి చివర లో కనిపిస్తున్న నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి అధికారికి నోటిఫికేషన్స్ చదవండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అయిన ఖాళీల వివరాలు, విభాగాల వారీగా ఖాళీల సంఖ్య, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం..

ఖాళీల వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య : 969


విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

◆ సివిల్ అసిస్టెంట్ సర్జన్ - 751,

◆ సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్/ జనరల్ డ్యూటీ - 211,

◆ సివిల్ అసిస్టెంట్ సర్జన్ మెడిసిన్ - 7..


విద్యార్హత: 

ప్రస్తుత గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి MBBS లేదా దానికి సమానమైన విద్యార్హతతో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.


వయోపరిమితి:

దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై నాలుగు సంవత్సరాలకు మించకుండా ఉండాలి, అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తింపజేశారు.. పూర్తి వివరాలుకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.

 

దరఖాస్తు విధానం:

దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


దరఖాస్తు ఫీజు:

దరఖాస్తు మరియు ప్రాసెసింగ్ ఫ్రీ ₹.320/-.


ఎంపిక విధానం:

మెరిట్ ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు.. మొత్తం 100 మార్కులుగా పరిగణించారు.

◆ అకడమిక్ విద్యార్హతలకు సాధించిన ప్రతిభకు 80 మార్కులు.

◆ ప్రభుత్వ గవర్నమెంట్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహించిన దానికి 20 మార్కులు, ప్రతి 6నెలల సర్వీస్కు 2.5 మార్కులు లెక్కిస్తారు..

 

 

గౌరవ వేతనం:

పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు ₹.58,850/- నుండి ₹.1,37,050/- వరకు జీతంగా చెల్లిస్తారు..

 అధికారిక వెబ్సైట్:   https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm

 ఆన్లైన్ దరఖాస్తులో భాగంగా.. ఆధార్ కార్డ్, 10 నుండి MBBS వరకు విద్యార్హత ధ్రువపత్రాలు, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నమోదు కాఫీ, లోకల్ అర్హత కోసం 1 నుండి 7 వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రం, సర్వీస్ సర్టిఫికెట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ లను అప్లోడ్ చేయాలి.

 


ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 21.07.2022 నుండి,

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 14.08.2022, సాయంత్రం 5 గంటల వరకు.