ఎలాంటి రాతపరీక్ష లేకుండా, పదవ తరగతి విద్యార్హతతో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి భారత పోస్టల్ సర్వీస్ తాజాగా భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 22 రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న 38,926 పోస్టుల భక్తికి ఆసక్తి కలిగిన భారతీయ మహిళ పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ భారీగా ఖాళీలు ఉన్నాయి..
విద్యార్హత ప్రమాణాలు, ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
భారతీయ కమ్యూనికేషన్ మంత్రిత్వశాఖకు చెందిన, ఇండియన్ పోస్టల్ సర్వీస్ దేశవ్యాప్తంగా మొత్తం ఇరవై రెండు రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న దాదాపుగా 39 వేల ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేస్తూ.. ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 38,926.
ఆంధ్ర ప్రదేశ్ లో ఖాళీల సంఖ్య: 1,716.
తెలంగాణలో ఖాళీల సంఖ్య: 1,226.
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి విద్యార్హతతో, స్థానిక భాషా పరిజ్ఞానం కలిగి మోటార్ సైకిల్ లేదా సైకిల్ నడపగలరు నైపుణ్యం కలిగి ఉండాలి.
వయసు: జూన్ 5, 2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అలాగే అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు నోటిఫికేషన్ ప్రకారం సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ను చదవండి.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు ₹.100/-
ఎస్సీ /ఎస్టీ /దివ్యాంగులకు మరియు మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఎంపిక విధానం: పదవ తరగతిలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా/ సిస్టం జనరేట్ చేసిన మెరిట్ లిస్టు ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు. ఏ ఇద్దరు అభ్యర్థుల మార్కులు సమానమైన.. వారి వయసును పరిగణలోకి తీసుకొని అధిక వ్యాసాలు కలిగిన వారికి ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికలు నిర్వహిస్తారు.
జీతం:
బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ₹.12,000/-
అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్/ Dak Seva పోస్టులకు ఎంపికైన వారికి ₹.10,000/-
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
పూర్తిస్థాయి రిజిస్ట్రేషన్ తో, ఆన్లైన్ దరఖాస్తు విధానం వీడియో లో అప్డేట్ చేస్తాను. తాజా నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.05.2022
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05.06.2022.
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ : https://indiapostgdsonline.gov.in/