బీజేపీని ఓడించడం థర్డ్, ఫోర్త్ ఫ్రంట్‌తో కుదిరే పని కాదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. అయితే ఆ ఫ్రంట్ సెకండ్ ఫ్రంట్ స్థాయికి ఎదిగితే ఈజీగా బీజేపీని ఓడించ వచ్చని ఆయన సూచించారు.
ఓ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పీకే పై వ్యాఖ్యలు చేశారు. అయితే.. రాబోయే ఎన్నికల్లో తృణమూల్‌ను థర్డ్‌ఫ్రంట్ గా ముందు పెట్టి, బీజేపీని ఓడిస్తారా? అని ప్రశ్నించగా..
అది కుదిరే పనికాదు. థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్ ఈ దేశంలో గెలుస్తుందని నేను నమ్మను. ఒకవేళ బీజేపీని మనం ఫస్ట్ ఫ్రంట్‌గా భావిస్తే, సెకండ్ ఫ్రంట్‌గా ఎదిగిన వారు బీజేపీని ఓడిస్తారు. బీజేపీని ఎవరైనా ఓడించాలంటే వారు సెకండ్ ఫ్రంట్ స్థాయికి ఎదగాల్సిందే అంటూ పీకే స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌ను సెకండ్ ఫ్రంట్‌గా భావిస్తారా? అని ప్రశ్నించగా.. నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. కాంగ్రెస్ అనేది దేశంలో అతిపెద్ద రెండో పార్టీ అంటూ అభివర్ణించారు.