ఈ రోజుల్లో ఫోన్ లో డేటా అనేది చాలా సీక్రెట్ గా ఉంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. మన ఫోన్లో ఎన్నో రహస్యాలు మనం దాచిపెడుతుంటాము. ఎదుటివారు మన ఫోన్ తీసుకున్నప్పుడు మన ఫోన్లో ఫోటోలు, వీడియోలు అన్నీ సెర్చ్ చేస్తుంటారు. దీని వల్ల అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా మన ఫ్యామిలీ మెంబర్స్ మన ఫోన్ తీసుకున్నప్పుడు మన ఫోన్లోని డేటా వారికి కంటపడితే ఒక్కోసారి కొంప కొల్లేరు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి వాటి నుండి మనం బయట పడటం ఎలా అనే విషయాల మీద అందరూ సెర్చ్ చేస్తుంటారు. ఈ శీర్షికలో భాగంగా మీకు కొన్ని ట్రిప్స్ ఇస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.
ట్రిక్ 1 : హిడెన్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి మీరు ముందుగా ఓ హిడెన్ ఫోల్డర్ క్రియెట్ చేసుకుని అందులోకి గ్యాలరీ, వాట్సప్, మీడియా ప్లేయర్స్,ఈమెయిల్ ఛాటింగ్, ఆఫీసు ఎడిటర్స్ ను పంపేయండి ఇందుకోసం మీరు ముందుగా ఓపెన్ ఫైల్ మేనేజర్ యాప్స్ ని మీ స్మార్ట్ ఫోన్లో ఓపెన్ చేయండి. క్రియేట్ న్యూ ఫోల్డర్ ఆప్సన్ ఎంపిక చేసుకోండి ఆ ఫోల్డర్ కి మంచి నేమ్ సెట్ చేసుకోడి. నేమ్ కి ముందు ఆ ఫోల్డర్లో డాట్ (.)ని యాడ్ చేయాలి. అప్పుడే ఫోల్డర్ హిడెన్ అవుతుంది. ఇప్పుడు రహస్యంగా దాచుకోవాల్సిన ఫైల్స్ ని అందులోకి ట్రాన్స్ ఫర్ చేయండి.
ఫోల్డర్ ని హైడ్ చేసుకోండి ఇక రెండో విషయానికొస్తే క్రియేట్ చేసుకున్న ఫోల్డర్ ని హైడ్ చేయడం ఎలా అనేది తెలుసుకుందాం. దీని కోసం ఈ స్టెప్ట్స్ ఫాలో అవండి. మీ స్మార్ట్ ఫోన్లో ఫైల్ మేనేజర్ యాప్ ని ఓపెన్ చేయండి మీరు హైడ్ చేయాలనుకున్నపోల్టర్ ని నేవిగేట్ చేయండి. ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి క్రియేట్ న్యూ ఫైల్ సెలక్ట్ చేసుకోండి. ఇప్పుడు .NoMEDIA అని ఫైల్ నేమ్ ఇవ్వండి అది అయిపోయిన తరువాత మీ ఫోన్ ఫైల్ మేనేజర్ క్లోజ్ చేసిన తరువాత రీ స్టార్ట్ చేయండి. ఇప్పుడు మీ యొక్క ఫోల్డర్ హిడెన్ అవుతుంది.
Show hidden files ఈ ప్రాసెస్ పూర్తి అయిన తరువాత హిడెన్ ఫైల్ ను మనం ఎలా చూసుకోవాలి అనే దానిపై ఈ మెథడ్స్ ఫాలో అవ్వండి. ఫైల్ మేనేజర్ యాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ లో కెళ్లి Show hidden files ని టర్న్ ఆన్ చేయండి. అక్కడ వ్యూ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ లో మీరు ఆ ఫోల్డర్ ని డిలీట్ చేయాలనుకుంటే వెంటనే చేయవచ్చు.
Computer ఫైల్స్‌ని హైడ్ చేయడం ఎలా ?
https://www.youtube.com/watch?v=VgE7HfvOa_8