Friday, April 3, 2020

నకిలీ వార్తలకు చెక్‌ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం factcheck.telangana.gov.in

దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఏదైనా సంఘటన జరిగిందంటే చాలు. దానిపై ఎన్నో వార్తలు వస్తుంటాయి. అందులో కొన్ని నిజాల, కొన్ని అబద్దాలు ఉంటాయి. దీంతో చాలా మంది ఫేక్ వార్తలు నిజం అని నమ్మేస్తుంటారు. మరికొంత మంది ఫేక్ న్యూస్ వినీ వినీ నిజమైన వార్త వచ్చినా నమ్మకుండా కొట్టిపారేస్తుంటారు. దీంతో ప్రజలు ఏది నమ్మాలో, ఏది నమ్మొద్దో అయోమయంలో పడిపోతుంటారు.అయితే ప్రస్తుతం ప్రజలు అలాంటి అయోమయంలోనే ఉంది. 


ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు ఇలాంటి ప్రచారాలు చేయకూడదని చెప్పినప్పటికీ కొంత మంది ఇలాంటి వార్తలను పోస్ట్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇలాంటి నకిలీ వార్తలకు చెక్‌ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైన చొరవ చూపింది. నకిలీ వార్తలను తెలుసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఓ వైబ్ సైట్‌ ను రూపొందించింది. ఈ వెబ్ సైట్ ద్వారా నిజమైన వార్తలను, ఫేక్ వార్తలను తెలుసుకోవచ్చు. ఈ యాప్ ని నిజానిజాలు ధ్రువీకరించే ఫ్యాక్ట్‌లీ మీడియా అండ్‌ రీసెర్చి అనే వెబ్ సైట్‌తో రూపొందించారు. https://factcheck.telangana.gov.in/ ద్వారా ప్రజలు ఏది నిజమైన వార్తో, ఏది నకిలీ వార్తో అనే నిజాలు తెలుసుకోవచ్చు. తెలంగాణ ఐటీశాఖ నిర్వహిస్తున్న ఈ వెబ్ సైట్‌లో మీ కొచ్చిన ఫార్వర్డ్‌ మెసేజ్‌లను చెక్ చేసుకోవచ్చు.