Saturday, October 20, 2018

తెలంగాణ అడవులు


*🔥తెలంగాణ అడవులు🔥*


*1)* రాష్ట్ర మొత్తం భూ విస్తీర్ణంలో అడవులు శాతం

జ: *24.35 శాతం*

*2)* రాష్ట్రంలో మొత్తం అటవీ విస్తీర్ణం

జ: *27,292 చ.కి.మీ.*
*(దేశంలో 12వ స్థానం. దేశ అటవీ విస్తీర్ణం - 7,01,673 చ.కి.మీ)*

*హరితహారం కార్యక్రమం (మొత్తం బడ్జెట్ : రూ.5500కోట్లు )*

*2)* మొదట ఎప్పుడు ప్రారంభించారు ?

జ: *2015 జులై 3 - కేసీఆర్ - చిలుకూరి బాలాజీ టెంపుల్ లో*

*3)* రెండో దశ హరితహారం ఎక్కడ ప్రారంభించారు

జ: *2016 జులై 8 - గుండ్రాంపల్లి,* *నల్లగొండ జిల్లా (ముఖ్యమంత్రి కేసీఆర్)*

*4)* మూడో దశ హరితహారం ఎక్కడ ప్రారంభించారు

జ: *2017 జులై 12 - కరీంనగర్ - కేసీఆర్*

*5)* హరిత హారం స్లోగన్

జ: *కోతులు వాపసు పోవాలె... వానలు వాపస్ రావాలె*

*6)* రాష్ట్రంలో అత్యధిక అడవులు ఉన్న జిల్లా

జ: *జయశంకర్ భూపాల పల్లి జిల్లా* *( 4.50 లక్షల హెక్టార్లు )*

*7)* అత్యల్ప అడవులు ఉన్న జిల్లా

జ: *హైదరాబాద్*

*8)* శాతాల పరంగా అడవులు

*అత్యధికం - జయశంకర్ భూపాల పల్లి*
*అత్యల్పం - కరీంనగర్*

*9)* తెలంగాణలో అభయారణ్యాలు - 9

*1) కవ్వాల్ అభయారణ్యం - ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో విస్తరించింది ( పులులు, నీల్ గాయ్, జింకలు, అడవి దున్నలు)*

*2) శివారం అభయారణ్యం - పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో విస్తరించింది*
*( మొసళ్ళు, క్రిష్ణ జింక, ఎలుగుబంట్లు )*

*3) ప్రాణహిత అభయారణ్యం- మంచిర్యాల జిల్లా*
*(క్రిష్ణ జింక, చింకార, తాబేళ్ళు )*

*4) అమ్రాబాద్ అభయారణ్యం - దీన్ని రాజీవ్ గాంధీ వైల్డ్ లైఫ్ అభయారణ్యం అంటారు. నాగర్ కర్నూల్, నల్లగొండ జిల్లాల్లో విస్తరించింది*
*( బెంగాల్ పులి, చిరుత, సాంబార్, క్రిష్ణ జింక)*

*5) కిన్నెరసాని అభయారణ్యం - భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తరించింది*
*( చింకార, సాంబార్, అడవి దున్న, సాంబార్, అడవి పంది, పులి, క్రిష్ణ జింక)*

*6) పాకాల అభయారణ్యం - పాకాల, వరంగల్ గ్రామీణ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలో విస్తరించింది )*
*( నీల్ గాయ్, నాలుగు కొమ్ముల దుప్పి, క్రిష్ణ జింక, స్లోత్ బేర్)*

*7) ఏటూరు నాగారం అభయారణ్యం - ఏటూరు నాగారం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విస్తరించింది.*
*(తోడేళ్ళు, నీల్ గాయ్, క్రిష్ణ జింక, మచ్చల జింక, సాంబార్ )*

*8) పోచారం అభయారణ్యం - కామారెడ్డి - మెదక్ జిల్లాల్లో విస్తరించింది*
*( పాములు, కొంగలు, బాతులు, నెమళ్ళు, చిరుత పులులు)*

*9) మంజీర అభయారణ్యం - మెదక్ జిల్లాలో విస్తరించింది*
*( 70 రకాల పక్షిజాతులు, వృక్ష జాతులు, క్షీరదాలు, సరీసృపాలు. మగ్గర్ మొసళ్ళు )*


*10)*  రాష్ట్రంలో ఫారెస్ట్ అకాడమీ ఎక్కడుంది

జ: *దూలపల్లి (ప్రచురించే మాసపత్రిక వన సంరక్షణి )*