Wednesday, July 18, 2018

గూగుల్ తేజ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని, ఉపయోగించుకోవడం - about Google Tez

చక్కటి సాంకేతిక విజ్ఞానాన్ని మనకు అందించే ప్రతిష్టాత్మక సంస్థ గూగుల్, తేలికగా ఎటువంటి వెబ్ పరిజ్ఞానం లేని వారు కూడా ఉపయోగించే తరహా పేమెం... thumbnail 1 summary




చక్కటి సాంకేతిక విజ్ఞానాన్ని మనకు అందించే ప్రతిష్టాత్మక సంస్థ గూగుల్, తేలికగా ఎటువంటి వెబ్ పరిజ్ఞానం లేని వారు కూడా ఉపయోగించే తరహా పేమెంట్ యాప్ ‘‘తేజ్’’ ను అందుబాటులోకి తెచ్చింది.



గూగుల్ తేజ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని, ఉపయోగించుకోవడం స్టెప్ బై స్టెప్:

2. ప్లేస్టోర్ నుంచి గూగుల్ తేజ్ యాప్ పేజి కనిపిస్తుంది అక్కడ కనిపించే INSTALL పై క్లిక్ చేయండి. యాప్ డౌన్ లోడ్ అవడం ప్రారంభం అవుతుంది. 
3. డౌన్ లోడ్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకూ వేచియుండండి. ఆ తరువాత ఆటోమేటిక్ గా యాప్ ఇన్ స్టాల్ అవుతుంది.
4. యాప్ ఇన్ స్టాల్ అవడం పూర్తయ్యాక కనిపించే OPEN బటన్ పై క్లిక్ చేయండి.
5. గూగుల్ తేజ్ యాప్ ఓపెన్ అవుతుంది. మొదటి స్క్రీన్ లో మీ భాషను ఎంచుకోమని అడుగుతుంది. ENGLISH ను ఎంచుకుని పైన కనిపించే   >   బటన్ పై క్లిక్ చేయండి.
6. తరువాత స్టెప్ లో మీ మొబైల్ నెంబరు అడుగుతుంది. మీ బ్యాంక్ అకౌంట్ మరియు ఆధార్ నెంబరుతో లింక్ అయిన మొబైల్ నెంబరును ఎంటర్ చేయండి. తరువాత పైన కనిపించే   >    పై క్లిక్ చేయండి.
7. మీ ఈమెయిల్ అకౌంట్ చూపి CONTINUE చేయమని అడుగుతుంది. CONTINUE పై క్లిక్ చేయండి.
8. మీ మొబైల్ కు OTP పంపబడి కన్ఫర్మేషన్ కోరుతుంది. OTP ఎంటర్ చేసి  పైన గల   >   బటన్ పై క్లిక్ చేయండి.
9. సెక్యూరిటీ కోసం స్క్రీన్ లాక్ లేదా గూగుల్ నాలుగంకెల పిన్ పెట్టుకోమని కోరుతుంది. నచ్చినది ఎంచుకుని CONTINUE చేయండి.
10. అంతే మీ గూగుల్ తేజ్ అకౌంట్ క్రియేట్ అయినట్లే.

గూగుల్ తేజ్ అకౌంట్ కు బ్యాంక్ అకౌంట్ ను యాడ్ చేయడం:

1. పైన కనిపించే + ADD BANK ACCOUNT పై క్లిక్ చేయండి.
2. మీ అకౌంట్ ఉన్న బ్యాంక్ ను ఎంచుకోండి.
3. ఆపై ఒక SMS పంపమని అడిగి పంపుతుంది.
4. మీ మొబైల్ నెంబరును వెరిఫై చేసుకుని, బ్యాంక్ అకౌంట్ ను మీకు చూపుతుంది.
5. మీ సరైన బ్యాంక్ అకౌంట్ ను ఎంచుకోండి. ప్రక్రియ పూర్తయినట్లే
6. ఒక్కొక్క సారి ఈ ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. మరోసారి ప్రయత్నిస్తే సరిపోతుంది.

గూగుల్ తేజ్ అకౌంట్ నుంచి డబ్బు పంపే విధానం:

1. గూగుల్ తేజ్ యాప్ ను ఓపెన్ చేయండి.
2. అక్కడ కనిపించే NEW పై క్లిక్ చేయండి.
3. ఇక్కడ మీకు ACCOUNT NUMBER ద్వారా లేదా UPI ID, QR, PHONE ద్వారా పేమెంట్ చేసే అవకాశం కల్పించబడుతుంది.
4. అకౌంట్ నెంబరును ఎంచుకుంటే అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, పంపవలసిన అమౌంట్ వివరాలను ఇస్తే వెంటనే మీ అకౌంట్ నుంచి అమౌంట్ పంపడం జరుగుతుంది.
5. అలాగే మీ మిత్రుల వద్ద కూడా తేజ్ అకౌంట్ ఉంటే జస్ట్ PHONE నెంబరును ఎంచుకుని కూడా అమౌంట్ పంపవచ్చు.

అమౌంట్ పంపితే ఎంత చార్జి పడుతుంది?

- ఇదే ముఖ్యమైన విషయం.
- మీరు అమౌంట్ పంపినా, పొందినా ఎటువంటి చార్జి పడదు సరికదా, మీరు రూ. 151 కంటే ఎక్కువ పంపిన ప్రతిసారి మీకొక స్క్రాచ్ కార్డ్ ఇవ్వబడుతుంది. దాని స్క్రాచ్ చేసి మీరు ఎదురు డబ్బు పొందవచ్చు.



మొత్తం మీద ఎటువంటి సెక్యూరిటీ ఇబ్బందులు లేకుండా అమౌంట్ పంపించేందుకు తేలికమార్గంగా నాకు అనిపించినందునే ఈ యాప్ ను ఉపయోగించే విధానం గురించి వివరించడం జరిగింది.