Friday, April 14, 2017

మార్పులతో గురుకుల నోటిఫికేషన్‌


⏩మార్పులతో గురుకుల నోటిఫికేషన్‌

🔹గురుకులాల్లో 7,306 కొలువుల భర్తీకి కొత్త ప్రకటన విడుదల చేసిన టీఎస్‌పీఎస్‌సీ

🔹డిగ్రీలో ఎస్సీ, ఎస్టీలకు 45శాతం అర్హత

🔹తొలిసారిగా బీసీలకూ వర్తింపు

🔹జనరల్‌ అభ్యర్థులకు 50శాతం చాలు

🔹బీకామ్‌ వారికీ అవకాశం.. డీఎడ్‌ వారికి నో చాన్స్‌

🔹టీజీటీ పోస్టుల్లో టెట్‌కు 20శాతం వెయిటేజీ

🔹ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు శారీర దారుఢ్య పరీక్షల నుంచి మినహాయింపు

🔹త్వరలో జేఎల్‌, ప్రిన్సిపల్‌ పోస్టులకు ప్రకటనలు

🔹ఈ నెల (18/04/2017)  18 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు

🔻 డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా నిరుద్యోగులకు సర్కారు నుంచి తీపి కబురు! గురుకుల టీచర్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా సంక్షేమ గురుకుల పాఠశాలల్లో వివిధ కేటగిరీల్లోని 7,306 పోస్టులను భర్తీ చేయనున్నారు.

🔻ఫిబ్రవరి 6న జారీ చేసిన తొలి నోటిఫికేషన్‌లో పొందుపరిచిన పలు నిబంధనలు వివాదాస్పదం కావడంతో వాటిని పక్కనబెట్టి, ఎన్‌సీటీఈ నిబంధనలకు లోబడి కొ త్త నోటిఫికేషన్‌ జారీ చేశారు.

🔻ప్రభుత్వం చేసిన ప్రధానమైన మార్పులు...
డిగ్రీలో తప్పనిసరిగా ప్రథమశ్రేణి (60శాతం మార్కులు)లో ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధనను సడలించారు. ఈ మేరకు జనరల్‌ అభ్యర్థులకు 50శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 45శాతం మార్కులు ఉంటే సరిపోతుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా బీసీ అభ్యర్థుల కు డిగ్రీ అర్హత మార్కుల్లో 5శాతం మినహాయింపునిస్తూ 45 శాతానికి కుదించారు.

🔻 టీజీటీ పోస్టుల్లో టెట్‌కు వెయిటేజీ ఉంటుంది. పీజీటీ పోస్టులకు రెండేళ్ల బోధన అనుభవాన్ని తొలగించారు. టీజీటీ పోస్టులకు బీకాం అభ్యర్థులనూ అర్హులుగా ప్రకటించింది.

🔻 ఆర్ట్స్‌, మ్యూజిక్‌ టీచర్లకు ఇంటర్‌, డిగ్రీ అర్హతలను పరిగణలోకి తీసుకుని దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమిచ్చింది.

🔻 వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు వికలాంగ అభ్యర్థులు అర్హులు కారని పేర్కొంది. ఈ మేరకు అందుబాటులోని ప్రభుత్వ ఉత్తర్వులను పరిగణలోకి తీసుకుంది. మాజీ సైనికోద్యోగులకు ఉపాధ్యాయపోస్టుల్లో రిజర్వేషన్లు పేర్కొంది.

🔻ఇక టీజీటీ పోస్టులకుగాను బీకామ్‌ అభ్యర్థులకు, పీజీటీ పోస్టులకుగాను పబ్లిక్‌ అడ్మినిసే్ట్రషన సబ్జెక్టు చదివిన అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించారు.

🔻సవరించిన నిబంధనలు, విద్యార్హతలు, పరీక్ష తేదీలతో కూడిన పూర్తి వివరాలను టీఎ్‌సపీఎస్సీ శుక్రవారం వెబ్‌సైట్‌లో పెట్టనుంది.

🔻 ఈ నెల 18వ తేదీ నుంచి ఆనలైన ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాగా 9రకాల కేటగిరీ పోస్టుల్లో అత్యధికంగా 4,362 ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ) పోస్టులు ఉన్నాయి. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ) పోస్టులు 921, ఫిజికల్‌ ఎడ్యుకేషన టీచర్‌ పోస్టులు 616 ఉన్నాయి. టీచర్‌ పోస్టుల భర్తీలో ప్రిలిమ్స్‌, మెయిన రెండు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌ ఫలితాల ఆధారంగా ఒక్కో పోస్టుకు 15మంది చొప్పున ఎంపిక చేసి, కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష విధానంలో మెయిన్‌ను నిర్వహిస్తారు.


🔻టీజీటీ పోస్టులకు టెట్‌ వెయిటేజీ
గురుకుల టీచర్‌ పోస్టుల భర్తీలో టీజీటీ పోస్టులకు మాత్రమే టెట్‌ అర్హతను పరిగణలోకి తీసుకోనున్నారు. ప్రిలిమ్స్‌లో ఒక్కో రిజర్వేషన కేటగిరీ నుంచి 15 మందిని ఎంపిక చేసిన తర్వాత మెయిన్సకు టెట్‌ను అర్హతగా చూస్తారు. ఈ మేరకు టెట్‌కు 20 శాతం వెయిటేజీని కల్పించారు. అనంతరం మెరిట్‌ ఆధారంగా ఎంపిక జాబితాలు సిద్ధం చేస్తారు. మెరిట్‌ అభ్యర్థుల ఆప్షన్ల ప్రాధాన్యతా క్రమంలో నియామక పత్రాలను ఇస్తారు. కాగా ఐదు రకాల సంక్షేమ గురుకుల సంస్థలకు కోసం జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌లో ఒక రకమైన కేటగిరీ పోస్టులకు ఒకే రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పోస్టులను ఉమ్మడి జిల్లాల పరిధి, జోన 5, 6 పరిధి ఆధారంగానే భర్తీ చేస్తారు. రాత పరీక్షలను ఇంగ్లిషులోనే నిర్వహిస్తారు. మీడియంతో సంబంధం లేకుండా అర్హత ఉన్న అభ్యర్థులంతా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

🔻త్వరలో 700 జేఎల్‌, ప్రిన్సిపల్‌ పోస్టులకు..
గురుకులాల సొసైటీల్లో జూనియర్‌ లెక్చరర్లు, ప్రిన్సిపల్‌ పోస్టులకు త్వరలో ప్రకటనలు జారీ కానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే గురుకులాల సొసైటీలు విధివిధానాలు, అర్హతలు సిద్ధం చేశారు. ఈ ఏడాది జేఎల్‌ పోస్టులు 546 వరకు ఉన్నట్లు సమాచారం. ఈ రెండు కేటగిరీల్లో దాదాపు 700కు పైగా పోస్టులు ఉంటాయని తెలిసింది. వీటితో పాటు డిగ్రీ కళాశాల లెక్చరర్‌ పోస్టులు కూడా భర్తీ చేసే అవకాశముంది.