Thursday, March 30, 2017

భారత దేశ చరిత్రలో ముఖ్య సంఘటనలు


 
క్రీస్తు పూర్వం
» 3000-1500 - సింధునాగరికత కాలం

బుద్ధుడు
» 576 - బుద్ధుడి జననం
» 527 - మహావీరుడి జననం
» 327-326 - భారత దేశంపైకి అలెగ్జాండర్ దండయాత్ర. దీని వల్ల యూరోప్ నుంచి మన దేశానికి భూమార్గం మొదటిసారి ఏర్పడింది.
» 313 - జైన గ్రంథాల ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు సింహాసనం అధిష్టించిన సంవత్సరం.
» 305 - సెల్యుకస్ నికెటర్ ను చంద్రగుప్త మౌర్యుడు ఓడించాడు.
» 273 - 232 - అశోకుడి పాలన
» 145 - 101 - చోళ వంశానికి చెందిన శ్రీలంక రాజు ఎలరా పాలన కాలం.
» 58 - విక్రమ శకం ప్రారంభం
క్రీస్తు శకం
» 78 - శక యుగం ప్రారంభం
» 120 - కనిష్కుడి పట్టాభిషేకం
» 320 - గుప్తుల పాల ప్రారంభం (భారత్ లో స్వర్ణయుగం)
» 380 - విక్రమాధిత్యుడి పట్టాభిషేకం
» 405-411 - ఫాహియాన్ భారత సందర్శన
» 415 - మొదటి కుమారగుప్తుడి పట్టాభిషేకం
» 455 - స్కందగుప్తుడి పట్టాభిషేకం
» 606-647 - హర్షవర్థనుడి పాలనా కాలం
» 712 - మొదటిసారిగా భారత దేశం పై అరబ్బుల దండయాత్ర
» 836 - కనౌజ్ లో భోజరాజు పట్టాభిషేకం
»985 - రాజరాజచోళుడి పట్టాభిషేకం
» 998 - సుల్తాన్ మహమ్మద్ పట్టాభిషేకం
» 1001 - భారత దేశంపై గజనీ మహమ్మద్ మొదటి దండయాత్ర. ఇందులో పంజాబ్ రాజు జయపాలుడిని గజనీ ఓడించాడు.
» 1025 - గజనీ మహమ్మద్ దండయాత్రలో సోమనాథ దేవాలయం ధ్వంసం.
» 1191 - మొదటి తరైన్ యుద్ధం. ఘోరీ మహమ్మద్, పృథ్విరాజ్ చౌహాన్ ల మధ్య జరిగింది. 
పృథ్విరాజ్ విజయం సాధించాడు.
» 1192 - తరైన్ యుద్ధం. ఘోరీ మహమ్మద్, పృథ్విరాజ్ ల మధ్య జరిగింది. ఈసారి విజయం ఘోరీ మహమ్మద్ ను వరించింది.
» 1206 - కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడు. బానిస వంశ స్థాపన
» 1210 - కుతుబుద్దీన్ ఐబక్ మరణం
» 1221 - భారత దేశంపై మంగోలుల దండయాత్ర. ఛెంఘిజ్ ఖాన్ దండెత్తి వచ్చాడు.
» 1236 - రజియా సుల్తానా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించింది.
» 1240 - రజియా సుల్తానా మరణం.
» 1246 - బాల్బన్ పాలన ప్రారంభం
» 1296 - అల్లాఉద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సింహాసనాన్ని ఎక్కాడు.
» 1316 - అల్లాఉద్దీన్ ఖిల్జీ మరణం.
» 1325 - మహమ్మద్ బీన్ తుగ్లక్ పాలన ప్రారంభం.
» 1327 - తుగ్లక్ పాలనలో ఢిల్లీ నుంచి దౌలతాబాద్ కు రాజధాని మార్పు.
» 1336 - దక్షిణాదిన విజయనగర సామ్రజ్యానికి పునాదులు.
» 1351 - ఫిరోజ్ షా సింహాసనానికి వచ్చాడు.
» 1388 - ఫిరోజ్ తుగ్లక్ మరణం
» 1398 - భారత్ పై తైమూర్ దండయాత్రలు

గురునానక్
» 1469 - గురునానక్ జననం
» 1494 - ఫర్ఘానాలో సింహాసనాన్ని అధిష్టించిన బాబర్.
» 1497-98 - భారత దేశానికి సముద్రమార్గం కనుగొన్న వాస్కొడిగామా.
» 1526 - మొదటి పానిపట్టు యుద్ధం. బాబర్ చేతిలో ఇబ్రహీం లోడీ పరాజయం. మొగలు సామ్రాజ్య స్థాపన.
» 1527 - కణ్వ యుద్ధం. ఇందులో రాణా సంగాను బాబర్ ఓడించాడు.
» 1530 - బాబర్ మరణం. హుమాయున్ రాజ్యానికి వచ్చాడు.
» 1539 - హుమాయున్ ను ఓడించి షేర్ షా సూరి భారత దేశ రాజ్యాధినేత అయ్యాడు.
» 1540 - కనౌజ్ యుద్ధం
» 1555 - ఢిల్లీ సింహాసనాన్ని హుమాయున్ తిరిగి దక్కించుకున్నాడు.
» 1556 - రెండో పానిపట్టు యుద్ధం
» 1557 - గోవాలో మొట్టమొదటి పుస్తక ప్రచురణ
» 1565 - తల్లికోట యుద్ధం
» 1576 - హల్దీఘాట్ యుద్ధం. అక్బర్ చేతిలో రాణా ప్రతాప్ ఓటమి.
» 1582 - దీన్-ఇ-ఇలాహీ అనే కొత్త మతాన్ని అక్బర్ ఏర్పాటు చేశాడు.
» 1597 - రాణా ప్రతాప్ మరణం
» 1600 - ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన
» 1605 - అక్బర్ మరణం. జహంగీర్ పాలన ప్రారంభం.
» 1611 - నూర్జహన్ తో జహంగీర్ వివాహం.
» 1616 - జహంగీర్ సభను సందర్శించిన సర్ థామస్ రో.

శివాజీ
» 1627 - శివాజీ జననం. జహంగీర్ మరణం.
» 1628 - షాజహన్ భారత దేశ చక్రవర్తి అయ్యాడు.
» 1631 - ముంతాజ్ మహల్ మరణం.
» 1634 - భారత దేశంలో బ్రిటిష్ వర్తకానికి బెంగాల్ లో అనుమతి.
» 1659 - సింహాసనాన్ని అధిష్టించిన ఔరంగజేబు. షాజహాన్ కు జైలు శిక్ష
» 1665 - శివాజీని ఖైదు చేసిన ఔరంగజేబు.
» 1666 - షాజహన్ మరణం.
» 1675 - సిక్కుల తొమ్మిదో గురువు తేజ్ బహదూర్ కి ఉరిశిక్ష
» 1680 - శివాజీ మరణం.
» 1684 - బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ బొంబాయిలో మొదటి ముద్రణాలయాన్ని స్థాపిచింది.
» 1707 - ఔరంగజేబు మరణం.
» 1708 - గురుగోవింద్ సింగ్ మరణం.
» 1780-84 - రెండో మైసూర్ యుద్ధం.
» 1784 - పిట్స్ చట్టం.
» 1790-92 - మూడో మైసూర్ యుద్ధం
» 1793 - బెంగాల్ శాశ్వత సెటిల్ మెంట్
» 1799 - నాలుగో మైసూర్ యుద్ధం – టిప్పు సుల్తాన్ మరణం.
» 1802 - బేసిన్ ఒప్పందం
» 1809 - అమృతసర్ ఒప్పందం

రాజా రామమోహన్ రాయ్
» 1828 - రాజారామమోహన్ రాయ్ బ్రహ్మ సమాజం ఏర్పాటు.
» 1829 - సతీసహగమన ఆచారం నిషేధం
» 1830 - బ్రహ్మ సమాజ స్థాపకుడు రాజారామమోహన్ రాయ్ ఇంగ్లండ్ సందర్శన
» 1833 - రాజారామమోహన్ రాయ్ మరణం.
» 1838 - కలకత్తాలో మొట్ట మొదటి నూలు మిల్లు ఏర్పాటు
» 1839 - మహారాజా రంజిత్ సింగ్ మరణం
» 1839-42 - మొదటి ఆగ్రా యుద్ధం
» 1845-46 - మొదటి ఆంగ్లో – సిక్ యుద్ధం
» 1852 - రెండో ఆంగ్లో – బర్మా యుద్ధం
» 1853 - బాంబే, థానేల మధ్య మొదటి రైలు ప్రయాణం. కలకత్తాలో మొదటి టెలిగ్రాఫ్ లైన్ ఏర్పాటు
» 1857 - సిపాయి తిరుగుబాటు లేదా ప్రథమ స్వాతంత్ర్య పోరాటం
» 1861 - రవీంద్రనాథ్ ఠాగూర్ జననం

రవీంద్రనాథ్ ఠాగూర్
» 1867 - బొంబాయిలో డాక్టర్ ఆత్మారామ్ పాండురంగ ఆధ్వర్యంలో ప్రార్థనా సమాజ్ ఏర్పాటు.
» 1869 - మహాత్మా గాంధీ జననం
» 1875 - స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ్ ఏర్పాటు; దివ్యజ్ఞాన సమాజం ఏర్పాటు.
» 1876 - సురేంద్రనాథ్ బెనర్జీ భారతీయ సంఘం (ఇండియన్ అసోసియేషన్) ఏర్పాటు.
» 1885 - భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన
» 1885 – 1905 - మితవాద యుగం
» 1889 - జవహర్ లాల్ నెహ్రూ జననం

స్వామి వివేకానంద
» 1893 - చికాగోలో స్వామి వివేకానంద చరిత్రాత్మక ప్రసంగం.
» 1897 - సుభాస్ చంద్రబోస్ జననం
» 1904 - టిబెట్ యాత్ర
» 1905 - లార్డ్ కర్జన్ ఆధ్వర్యంలో మొదటి బెంగాల్ విభజన
» 1906 - ముస్లిం లీగ్ స్థాపన
» 1906 – 1920 - అతివాద యుగం
» 1909 - మింటో – మార్లే సంస్కరణలు
» 1911 - ఢిల్లీ దర్బార్; బ్రిటిష్ రాజు, రాణి భారత సందర్శన; భారత్ రాజధానిగా ఢిల్లీ.
» 1913 - గదర్ పార్టీ ఏర్పాటు
» 1914 - మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం
» 1915 - భారత దేశానికి గాంధీజీ రాక.
» 1916 - కాంగ్రెస్, ముస్లిం లీగ్ మధ్య లక్నో ఒప్పందం; మద్రాస్ లో హోమ్ రూల్ లీగ్ ఏర్పాటు.
» 1917 - చంపారన్ ఉద్యమం
» 1918 - మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు
» 1919 - మాంటేగ్ – ఛేమ్స్ ఫర్డ్ సంస్కరణలు, రౌలత్ చట్టం, అమృతసర్ లో జలియన్ వాలాభాగ్ ఉదంతం
» 1920 - ఖిలాఫత్ ఉద్యమం
» 1921 - ఉత్తర ప్రదేశ్ లో రైతుల పోరాటం, మోప్లా తిరుగుబాటు.
» 1922 - చౌరీచౌరా సంఘటన, సహాయ నిరాకరణ ఉద్యమం నిలుపుదల.
» 1922 - మొదటి కమ్యూనిస్టు పత్రిక సోషలిస్టు ప్రచురణ.
» 1926 - భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ స్థాపన.
» 1927 - సైమన్ కమిషన్ బహిష్కరణ; భారత్ లో బ్రాడ్ కాస్టింగ్ ప్రారంభం.
» 1928 - పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్ మరణం
» 1929 - మీరట్ కుట్ర కేసు
» 1929 - లాహోర్ లో జరిగిన కాంగ్రెస్ సదస్సులో సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం తీర్మానం
» 1930 - సహాయ నిరాకరణ ఉద్యమం, గాంధీజీ దండియాత్ర (ఏప్రిల్ 6); మొదటి రౌండ్ టేబుల్ సమావేశం.
» 1931 - గాంధీ – ఇర్విన్ ఒప్పందం; రెండో రౌండ్ టేబుల్ సమావేశం.
» 1932 - మూడో రౌండ్ టేబుల్ సమావేశం.
» 1935 - భారత ప్రభుత్వ చట్టం రూపకల్పన
» 1937 - ప్రొవిన్షియల్ అటానమీ.
» 1939 - రెండో ప్రపంచ యద్ధం ప్రారంభం.
» 1941 - రవీంద్రనాథ్ ఠాగూర్ మరణం, సుభాస్ చంద్రబోస్ భారత దేశం నుంచి తప్పించుకొని వెళ్లిపోవడం.
» 1942 - క్రిప్స్ మిషన్ ఇండియా రాక, ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభం.
» 1942-44 - ప్రొవిన్షియల్ అజాద్ హిందూ హుకూమత్ ను సుభాస్ చంద్రబోస్ ఏర్పాటు చేశారు. అజాద్ హింద్ ఫౌజ్ ను కూడా బోస్ ఏర్పాటు చేశారు. బెంగాల్ లో తీవ్రమైన కరవు వచ్చింది.
» 1945 - వేవెల్ ప్రణాళిక; సిమ్లా సమావేశం; ఇండియన్ నేషనల్ ఆర్మీ విచారణ, సిమ్లా సమావేశం, రెండో ప్రపంచ యుద్ధం ముగింపు.
» 1946 - క్యాబినెట్ మిషన్ భారత్ సందర్శన, కేంద్రంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు.
» 1947 - అఖండ భారత్ విభజన. రెండు దేశాలుగా భారత్, పాకిస్థాన్ ఆవిర్భావం.
» 1948 - గాంధీజీ హత్య (జనవరి 30), దేశవ్యాప్తంగా సంస్థానాల విలీనం.
» 1949 - కశ్మీర్ లో శాంతిస్థాపనకు అంగీకారం, భారత రాజ్యాంగానికి ఆమోదం (నవంబరు 26)
» 1950 - గణతంత్ర రాజ్యంగా భారత్ ఆవిర్భావం (జనవరి 26న), భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది.
» 1951 - మొదటి పంచవర్ష ప్రణాళిక. ఢిల్లీలో మొదటి ఆసియా క్రీడల నిర్వహణ.
» 1952 - లోక్ సభకు మొదటి సాధారణ ఎన్నికల నిర్వహణ.
» 1956 - రెండో పంచ వర్ష ప్రణాళిక ప్రారంభం.
» 1957 - దేశ వ్యాప్తంగా రెండో సాధారణ ఎన్నికల నిర్వహణ, గోవా విముక్తి
» 1963 - పదహారో రాష్ట్రంగా నాగాలాండ్ ఆవిర్భావం.

లాల్ బహదూర్ శాస్త్రి
» 1964 - జవహర్ లాల్ నెహ్రూ మరణం; ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి.
» 1965 - భారత్ పై పాకిస్థాన్ దాడి
» 1966 - తాష్కెంట్ ఒప్పందం, లాల్ బహదూర్ శాస్త్రి మరణం, భారత ప్రధానిగా ఇందిరాగాంధీ.

ఇందిరా గాంధీ
» 1967 - నాలుగో సాధారణ ఎన్నికలు. మూడో రాష్ట్రపతిగా డాక్టర్ జాకీర్ హుస్సేన్ ఎన్నిక.
» 1969 - భారత రాష్ట్రపతిగా వి.వి. గిరి ఎన్నిక, బ్యాంకుల జాతీయీకరణ.
» 1970 - రాష్ట్రంగా మేఘాలయ
» 1971 - కొత్త రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్, భారత్ – పాక్ యుద్ధం, కొత్త దేశంగా బంగ్లాదేశ్.
» 1972 - సిమ్లా ఒప్పందం; సి. రాజగోపాలాచారి మరణం.
» 1973 - మైసూర్ రాష్ట్రానికి కర్ణాటకగా పేరు మార్పు.
» 1974 - భారత్ లో అణ్వస్త్ర ప్రయోగం, అయిదో రాష్ట్రపతిగా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్.
» 1975 - ఆర్యభట్ట ఉపగ్రహ ప్రయోగం, 22వ రాష్ట్రంగా సిక్కిం. ఎమర్జెన్సీ ప్రకటన.
» 1976 - భారత్ – చైనా మధ్య దౌత్య సంబంధాలు.
» 1977 - ఆరో సాధారణ ఎన్నికలు, లోక్ సభలో జనతా పార్టీ ఆధిక్యం, ఆరో రాష్ట్రపతిగా నీలం 
సంజీవరెడ్డి.
» 1979 - ప్రధాని పదవికి మొరార్జీ దేశాయ్ రాజీనామా, ప్రధాన మంత్రిగా చరణ్ సింగ్, ఆగస్టు 20న చరణ్ సింగ్ రాజీనామా, ఆరో లోక్ సభ రద్దు.
» 1980 - ఏడో సాధారణ ఎన్నికలు; అధికారంలోకి కాంగ్రెస్ (ఐ), ప్రధాన మంత్రిగా ఇందిరాగాంధీ; విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణం; ఎస్ ఎల్ వి – 3 ద్వారా రోహిణి ఉపగ్రహ ప్రయోగం.
» 1982 - మార్చి 19న ఆచార్య జె.బి. కృపలానీ మరణం; ఇన్ శాట్ – 1ఏ ప్రయోగం; జులై 15న రాష్ట్రపతిగా జైల్ సింగ్; నవంబరు 5న గుజరాత్ లో తుపాను వల్ల 500 మంది మరణం; నవంబరు 15న ఆచార్య వినోబా మరణం; నవంబరు 19న తొమ్మిదో ఆసియా క్రీడలు ప్రారంభం.
» 1983 - ఢిల్లీలో చోగమ్ సదస్సు
» 1984 - పంజాబ్ లో ఆపరేషన్ బ్లూస్టార్; అంతరిక్షంలోకి రాకేశ్ శర్మ; ఇందిరాగాంధీ హత్య, ప్రధానిగా రాజీవ్ గాంధీ.

రాజీవ్ గాంధీ
» 1985 - రాజీవ్ – లోంగోవాలా సంధి; అసోం ఒప్పందం; ఏడో పంచ వర్ష ప్రణాళిక; పార్టీ ఫిరాయింపుల చట్టం.
» 1986 - మిజోరాం ఒప్పందం
» 1987 - రాష్ట్రపతిగా ఆర్.వెంకట్రామన్, ఉప రాష్ట్రపతిగా శంకర్ దయాళ్ శర్మ, బోఫోర్స్ గన్, ఫెయిర్ ఫాక్స్ వివాదాలు.
» 1989 - అయోధ్యలో రామ శిలాన్యాస పూజ; మొదటి సారిగా భారత్ ఐఆర్ బిఎమ్ ‘అగ్ని’ ని ఒడిశా నుంచి విజయవంతంగా ప్రయోగించారు (మార్చి 22). జూన్ 5న త్రిశూల్ క్షిపణి ప్రయోగం, సెప్టెంబరు 27న పృథ్వి రెండోసారి ప్రయోగం విజయవంతం; నవంబరు 29న ఎన్నికల్లో ఓడిపోయిన రాజీవ్ గాంధీ ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు; జవహర్ రోజ్ గార్ యోజన ప్రారంభం; నేషనల్ ఫ్రంట్ నాయకుడు వి.పి. సింగ్ ఏడో ప్రధానిగా ఎన్నిక.
» 1990 - వెనక్కి వచ్చిన భారత శాంతి దళం; ఇండియన్ ఎయిర్ లైన్స్ కి చెందిన ఎ-320 ప్రమాదం; జనతా దళ్ విభజన; ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న బీజేపీ; అద్వాణీ రథయాత్ర-అరెస్టు; మండల్ కమిటీ నివేదిక అమలును ప్రకటించిన వి.పి.సింగ్; రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదం నేపథ్యంలో అయోధ్యలో హింసాకాండ.
» 1991 - జనవరి 17న గల్ఫ్ యుద్ధం; మే 21న రాజీవ్ గాంధీ హత్య; జూన్ 20న పదో లోక్ సభ ఏర్పాటు; ప్రధాన మంత్రిగా పీవీ నరసింహారావు.

పీవీ నరసింహారావు
» 1992 - ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాల ఏర్పాటు; ఏప్రిల్ 23న భారతరత్న, ఆస్కార్ అవార్డు గ్రహీత సత్యజిత్ రే మరణం; జులై 25న రాష్ట్రపతిగా శంకర్ దయాళ్ శర్మ ఎన్నిక; ఫిబ్రవరి 7న మొదటి సారిగా భారత్ స్వదేశీయంగా తయారు చేసిన ఐఎన్ ఎస్ శక్తి సబ్ మెరైన్ ప్రారంభం.
» 1993 - జనవరి 29న అయోధ్యలో 67.33 ఎకరాల స్వాధీనానికి ఆర్డినెన్స్; ముంబయిలో వరుస బాంబు పేలుళ్లు – 300 మృతి; మహారాష్ట్ర లో భూ కంపం.
» 1994 - పౌర విమానయానంపై ఏకస్వామ్యానికి ముగింపు పలికిన ప్రభుత్వం; గ్యాట్ ఒప్పందంపై వివాదాలు; ప్లేగు వ్యాధి వ్యాప్తి; మిస్ యూనివర్స్ గా సుస్మితాసేన్, మిస్ వరల్డ్ గా ఐశ్వర్యరాయ్
» 1995 - ఉత్తర ప్రదేశ్ లో మొదటి దళిత ముఖ్యమంత్రిగా మాయావతి; మహారాష్ట్ర, గుజరాత్ లలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు; కర్ణాటకలో జనతా దళ్, ఒడిశాలో కాంగ్రెస్ ప్రభుత్వాల ఏర్పాటు; మాయవతి ప్రభుత్వం పడిపోవడంతో ఉత్తర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధింపు; ఇన్ శాట్ 2సి, ఐఆర్ ఎస్1-సి ప్రయోగాలు.
» 1996 - హవాలా కుంభకోణం; పీఎస్ ఎల్ వీ డీ3 ప్రయోగం; పదకొండో లోక్ సభ ఎన్నికలు; అతి పెద్ద పార్టీగా బీజేపీ.
» 1997 - భారత దేశపు 50 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

అటల్ బిహారి వాజ్ పేయీ
» 1998 - మదర్ థెరిసా మరణం; భారత ప్రధానిగా వాజ్ పేయీ; పోఖ్రాన్-2 అణు పరీక్షలు.
» 1999 - డిసెంబరు 24న భారత విమానం ఐసీ – 814 హైజాక్ చేసి కాందహార్ తీసుకెళ్లిన అఫ్ఘనిస్థాన్ తీవ్రవాదులు; ఆ విమాన ప్రయాణికులు, సిబ్బంది విడుదల కోసం ముగ్గురు మిలిటెంట్లను భారత ప్రభుత్వం జూన్ లో జైలు నుంచి విడుదల చేసింది; పాకిస్థాన్ అక్రమ నిర్బంధం నుంచి ఎనిమిది రోజుల తర్వాత ఫ్లైట్ లెఫ్ట్ నెంట్ నచికేత విడుదల; పాకిస్థాన్ దురాక్రమణలను నిరోధించడానికి కార్గిల్ యుద్ధం, ఆపరేషన్ విజయ్ తో విజయం సాధించిన ఇండియన్ ఆర్మీ.
» 2000 - అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్ పర్యటన; చత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్ రాష్ట్రాల ఆవిర్భావం; 100 కోట్లు దాటిన భారత్ జనాభా.
» 2001 - జులైలో భారత్- పాకిస్థాన్ ల మధ్య ఆగ్రా సదస్సు; జనవరిలో గుజరాత్ భూకంపం; మార్చిలో ఆయుధాల ఒప్పందంలో ఆర్మీ ఆఫీసర్లు, మంత్రుల అక్రమాలను బయటపెట్టిన తెహల్కా; స్వాతంత్ర్యానంతరం ఆరో జనాభా లెక్కలు.
» 2002 - అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఎన్నిక. ఫిబ్రవరి 27న గుజరాత్ లోని గోద్రా లో మత కలహాలు; నేషనల్ వాటర్ పాలసీ ప్రకటన.

అబ్దుల్ కలాం
» 2003 - ఇన్ శాట్ – 3ఏ ప్రయోగం విజయవంతం; వైట్ కాలర్ నేరాలను అరికట్టడానికి ఆర్థిక ఇంటెలిజెన్స్ విభాగాన్ని సీబీఐ ఏర్పాటు చేసింది; ఇన్ శాట్ -3ఇ ప్రయోగం సఫలం.
» 2004 - సాధారణ ఎన్నికల్లో ఎన్ డీఏ పరాజయం; మన్మోహన్ సింగ్ ప్రధానిగా ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్.