Saturday, January 14, 2017

ఉద్యోగ సంక్రాంతి


👉🏻ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల విద్యాసంస్థల్లో మొత్తం 11,666 పోస్టులవారీగా భర్తీచేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీటిలో ఇప్పటికే దాదాపు మూడువేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగా.. మిగిలినవాటికి నోటిఫికేషన్‌లు త్వరలో వెలువడనున్నాయి.
👉🏻 తెలంగాణ: నిరుద్యోగులపై రాష్ట్రప్రభుత్వం వరాలు కురిపిస్తున్నది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 11,666 పోస్టుల భర్తీకి ముందస్తు ప్రణాళికలు రూపొందించింది. వీటిని మూడేండ్లలో విడుతలవారీగా రెగ్యులర్, ఔట్‌సోర్సింగ్ పద్ధతు ల్లో భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందులో దాదాపు మూడువేల పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయగా... మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీటిలో రెగ్యులర్ పోస్టుల భర్తీ ప్రక్రియను టీఎస్‌పీఎస్సీ ద్వారా చేపట్టనున్నారు.
👉🏻ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా...
రాష్ట్ర ప్రభుత్వం 2016-17 విద్యాసంవత్సరంలో కొత్తగా ప్రారంభించిన 103 ఎస్సీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, 30 డిగ్రీ కళాశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లో కొత్త పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. రెగ్యులర్ పద్ధతిలో 4616, ఔట్ సోర్సింగ్ విధానంలో 733 పోస్టులను ఎస్సీ సంక్షేమశాఖ ప్రకటించింది. దశల వారీగా మూడేండ్లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ పోస్టు లు మొత్తం 4616కుగాను 2016-17 విద్యా సంవత్సరంలో 2205 పోస్టులు, 2017-18 సంవత్సరంలో 905 పోస్టులు, 2018-19 విద్యా సంవత్సరంలో 1506 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 2016-17లో 437, 2017-18లో 30, 2018-19లో 266 పోస్టులను మొత్తంమీద మూడేండ్లలో 733 పోస్టులను భర్తీ చేస్తారు.
👉🏻ఎస్టీ సంక్షేమ శాఖ ద్వారా...
కేజీ టు పీజీ విద్యావిధానం అమలులో భాగంగా ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించిన 50 గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1774 బోధన, బోధనేతర పోస్టులను మంజూరు చేసింది. ఇందులో 1515 పోస్టులను శాశ్వత ప్రాతిపదికన, 259 పోస్టులను ఔట్ సోర్సింగ్ కింద భర్తీ చేస్తారు.
👉🏻బీసీ సంక్షేమ శాఖ ద్వారా...
రాష్ట్ర ప్రభుత్వం 2016-17 విద్యాసంవత్సరంలో అప్‌గ్రేడ్ చేసిన 16 బీసీ గురుకుల జూనియర్ కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలను చేపట్టేందుకు బీసీ సంక్షేమశాఖ కసరత్తు చేపట్టింది. ఈ మేరకు బీసీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 240 రెగ్యులర్ పోస్టులను, 192 ఔట్ సోర్సింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మరోవైపు, వచ్చే విద్యాసంవత్సరం కొత్తగా ప్రారంభించనున్న 119 బీసీ గురుకుల విద్యాలయాల నిర్వహణ కొరకు మొత్తం 4,111 పోస్టుల భర్తీకి కూడా బీసీ సంక్షేమశాఖ చర్యలు ప్రారంభించింది. మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాసంస్థల సొసైటీ ద్వారా నిర్వహించే బీసీ గురుకులాల కొరకు నిర్దేశించిన ఈ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఇదివరకే ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో, నియామక ప్రక్రియను చేపట్టేందుకు బీసీ సంక్షేమశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం పోస్టుల్లో శాశ్వత ప్రాతిపదికన 3619 పోస్టులను, ఔట్ సోర్సింగ్ విధానంలో 492 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ విధంగా 2016-17, 2017-18 విద్యాసంవత్సరాలకు సంబంధించి 3859 రెగ్యులర్ పోస్టులను, 684 ఔట్‌సోర్సింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇవి రెండూ కలిపి 4543 పోస్టులు