బ్యాంక్ ఆఫ్ బరోడా
తెలంగాణలో ఖాళీలు
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో స్వీపర్ కమ్ ప్యూన్ పోస్టుల భర్తీకి బెంగళూరులోని బ్యాంక్ ఆఫ్ బరోడా జోనల్ కార్యాలయం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం ఖాళీలు: 46 (ఎస్సీ - 7, ఎస్టీ - 3, ఓబీసీ - 13, అన్రిజర్వ్డ్ - 23).
ఖాళీలున్న జిల్లాలు / ప్రదేశాలు: వరంగల్, సూర్యాపేట, సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి, నిజామాబాద్, నిర్మల్, నల్గొండ, మంచిర్యాల, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి.
విద్యార్హత: అభ్యర్థులు పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగులో రాయడం, చదవడం వచ్చి ఉండాలి. ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానం ఉంటే మంచిది.
వయసు: 16 డిసెంబరు 2016 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిలో మినహాయింపులు ఉంటాయి.
ఎంపిక విధానం: అభ్యర్థులను ఆన్లైన్ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. మొత్తం 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో (ఇంగ్లిష్ విభాగం ప్రశ్నలు మినహాయించి) ఉంటుంది. పరీక్షలో కింది అంశాలు ఉంటాయి.
* తెలుగు భాషా పరిజ్ఞానానికి సంబంధించిన అంశాలు: 30 మార్కులు
* ఆంగ్ల భాషా పరిజ్ఞానానికి సంబంధించిన అంశాలు: 10 మార్కులకు.
* జనరల్ అవేర్నెస్ (బ్యాంకింగ్ అంశాలతో సహా): 20 మార్కులు
* ఎలిమెంటరీ అర్థమెటిక్ / న్యూమరికల్ ఎబిలిటీ: 20 మార్కులు
* సైకోమెట్రిక్ టెస్ట్: 20 మార్కులు
* ఆన్లైన్ పరీక్షలో కనీస ఉత్తీర్ణత మార్కులు 40. అభ్యర్థులు అన్ని విభాగాల్లోనూ కనీస కటాఫ్ మార్కులు సాధించాలి.
* వేతన శ్రేణి: రూ.9560 - రూ.18545
* దరఖాస్తు: ఆన్లైన్లో. చివరి తేది: 16 డిసెంబరు
* దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.400, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు రూ.100.
* వెబ్సైట్: www.bankofbaroda.co.in