హంటర్ కమిషన్- 1882
ఉద్దేశం:
- ఉడ్ తాఖీద్ సిఫారసులను సక్రమంగా అమలు పరచుటకు ఏ చర్యలు తీసుకోవాలో సూచించుటకు గవర్నర్ జనరల్ రిప్పన్ "సర్ విలియం హంటర్" ను భారతీయ విధ్య కమీషన్ అధ్యక్షుడిగా నియమించాడు.
- హంటర్ కమీషన్ ను " తొలి భారతీయ విధ్య కమీషన్" అని కూడా అంటారు.
- ప్రాథమిక విధ్యలో మార్పులు తేవడం ప్రధానోద్దేశంగా ఏర్పడిన కమీషన్.
ముఖ్యాంశాలు:
- ప్రాథమిక విధ్యను స్థానిక సంస్థలకు అప్పగించి అందరికీ అందుబాటులోకి తేవాలి.
- స్వదేశీ పాఠశాలలను ప్రొత్సహించాలి.
- ఉపాధ్యాయులకు వృత్తి విధ్యలో శిక్షణ ఇవ్వాలి.
- ఉపాధి విధ్యకు ప్రాధాన్యత ఇవ్వాలి.
- అరోగ్యం, శీలం విద్యాభ్యాసంలో భాగం కావాలి.
- మాధ్యమిక మరియు ఉన్నత పాఠశాలలను ప్రైవేటు పరం చెయ్యాలి.
- ప్రాథమిక విధ్యను మాతృభాషలోనే బోధించాలి.
- స్త్రీ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి.
- విద్యా రంగంలో ప్రభుత్వ పెట్టుబడి పెరిగి, విద్యావ్యవస్థ క్రమంగా విస్తరించడం జరిగింది.