తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదటిసారి నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫలితాలు శుక్రవారం విడుదలకానున్నాయి. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేస్తారు. ఉపాధ్యాయుల నియామక పరీక్ష(డీఎస్సీ) రాయాలంటే టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. అంతేకాక టెట్ మార్కులకు డీఎస్సీలో 20శాతం వెయిటేజీ ఉంటుంది. పలుసార్లు వాయిదా పడిన టెట్ చివరకు మే 22న జరిగింది. డీఎడ్ విద్యార్థులు పేపర్-1కు, బీఈడీ పూర్తిచేసిన వారు పేపర్-2 రాశారు. పేపర్-1కు 88,158మంది, పేపర్-2కు 2,51,924 మంది హాజరయ్యారు.
Results: Download
Results: Download