Sunday, June 12, 2016

సిమ్ కార్డ్ క్లోనింగ్, రూ.11 లక్షల స్వాహా!


మొబైల్ ఫోన్లలోని సిమ్లను క్లోన్ చేసి ఆర్ధిక మోసాలకు తెగబడే ప్రయత్నాలు జోరందుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ముంబైలో వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన సైబర్ నేరగాళ్ల దశ్చర్యను బహిర్గతం చేసింది.
తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.11 లక్షలు విత్డ్రా అయినట్లు తన ఫోన్కు అందిన మెసేజ్ ద్వారా తెలుసుకున్న ముంబైకు చెందిన ఓ 72 సంవత్సరాల మహిళ కంగుతింది. మాజీ అమెరికా కాన్సులేట్ ఉద్యోగి అయిన ఈమె మొబైల్ సిమ్ను హ్యాకర్లు చాకిచక్యంగా క్లోన్ చేసి, ఆ నెంబరు ద్వారా బ్యాంకుకు ఫోన్ చేసి క్రెడిట్ కార్డ్ వివరాలను సంపాదించగలిగారు. ఆ క్రెడిట్ కార్డ్ వివరాల ద్వారా రూ.11 లక్షలు విలువ చేసే విమాన టికెట్లు బుక్ చేసుకున్నట్లు సమాచారం.
Source:
సిమ్ కార్డ్ ఎలా క్లోన్ అవుతుంది..?కొత్త రకం సైబర్ మోసాల్లో ఒకటైన సిమ్ క్లోనింగ్ మిమ్మల్ని బ్యాంక్ దివాళా కోరుగా మార్చేయగలదు. మీ పర్సనల్ సిమ్ కార్డ్ను క్లోన్ చేయటం ద్వారా హ్యాకర్లు ఆ నెంబరుతో అనసంధానమై ఉన్న మీ బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించి అకౌంట్లో ఉన్న నగదును మీకు తెలియకుండా లూటీ చేసేయగలరు.
సిమ్ కార్డ్ ఎలా క్లోన్ అవుతుంది..?సిమ్ కార్డ్లను క్లోన్ చేసేందుకు హైటెక్ సాఫ్ట్వేర్లను హ్యాకర్లు ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ను ఉపయోగించి సిమ్కార్డ్ రీడర్ సహయంతో టార్గెటెడ్ యూజర్ మొబైల్ సిమ్లోని సమాచారాన్నివేరొక సిమ్కార్డ్లోకి కాపీ చేసేస్తారు. కొన్ని వైరస్ కమాండ్లతో కూడిన ఎస్ఎంఎస్ల ద్వారా కూడా సిమ్ క్లోనింగ్ సాధమ్యవుతుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు.
సిమ్ కార్డ్ క్లోన్ అయ్యిందని తెలుసుకోవటం ఎలా..?ఒక వ్యక్తికి తెలియకుండానే వారి ఫోన్ నుండి అవతలి వ్యక్తికి మెసేజ్ వెళ్లిందంటే ఆ నంబర్ క్లోన్ అయ్యిందనే అర్ధం చేసుకోవాలి. వెంటనే మీ మొబైల్ బిల్ను చెక్ చేసుకోండి. అందులో ఏమైనా మీకు తెలియని నెంబర్ల నుంచి కాల్స్ వెళ్లినట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించండి.
ఆ నెంబర్లతో జాగ్రత్త...#90, +92, #09 వంటి ప్రారంభ సంఖ్యతో వచ్చిన మిస్సుడ్ కాల్స్కు స్పందించకండి. ఎవరో తెలసుకోవాలన్న ఆత్రుతతో తిరిగి స్పందించే ప్రయత్నం చేస్తే మీ సిమ్కార్డ్ చోరికి గురయ్యే ప్రమాదముంది. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు ఇప్పటి వరకు ఆగంతకుల ఉచ్చులో లక్ష మంది వినియోగదారులు ఇరుక్కున్నట్లు సమాచారం.
ఆ కాల్‌కు తిరిగి స్పందిస్తే ఏం జరుగుతుంది? ఆ డేంజర్ కాల్కు తిరిగి స్పందించిన వెంటనే.. కాల్ సెంటర్ ప్రతినిధినంటూ ఒక వ్యక్తి మీతో మాట్లాడటం ప్రారంభిస్తారు. మీ సిమ్కార్డ్ కనెక్టువిటీ స్థాయిని పరీక్షించాల్సి ఉందని #90 లేదా #09 సంఖ్యను ప్రెస్ చెయ్యమని ఆదేశిస్తారు.
కీలక సమాచారం కాపీ కాబడుతుందివారి మాటలను నమ్మి ఆ సంఖ్యను ప్రెస్చేస్తే ఫోన్లోని కీలక సమాచారం కాపీ కాబడుతుంది. క్లోనింగ్ కాబడిన సదరు వ్యక్తి సిమ్ కార్డును ఆగంతకులు ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటారు.
సీడీఎమ్ఏ కార్డులతోహ్యాకర్లు సీడీఎమ్ఏ కార్డులను క్లోన్ చేసినంత సులువుగా జీఎస్ఎమ్ కార్డులను క్లోన్ చేయలేరని నిపుణులు చెబుతున్నారు.
GSM కార్డులను క్లోన్ చెయ్యాలంటే GSM కార్డులను క్లోన్ చెయ్యాలంటే సిమ్ కార్డులను ఫోన్ నుండి బైటికి తీయాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. బైటకు తీసాక ఫోన్కు సిమ్ కార్డుకు మధ్య క్లోనింగ్ జరిగే సిమ్ కార్డ్ రీడర్ ను ఉంచి కొద్ది రోజుల పాటు ఆపరేట్ చేయాల్సి ఉంటుందని తద్వారా రహస్య కోడ్తో సహా క్లోనింగ్ చేయవచ్చని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.