Sunday, March 6, 2016

గూగుల్‌ క్రోమ్‌......అన్ని పాస్‌వర్డ్‌లనూ


నె ట్టింట్లో ఎన్నని లాగిన్‌ వివరాల్ని గుర్తుంచుకుంటాం. అందుకే కొన్ని వెబ్‌ సర్వీసులకు లాగిన్‌ వివరాల్ని గుర్తుంచుకునేందుకు బ్రౌజర్‌ సాయం తీసుకుంటాం. అక్కడే సురక్షితంగా భద్రం చేస్తాం. మరి, మీరు వాడేది గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజరా? ఎప్పటి నుంచో దాంట్లోనే వివిధ వెబ్‌ సర్వీసుల లాగిన్‌ వివరాల్ని సేవ్‌ చేశారా? అవేంటో ఒకసారి చూద్దాం అనుకుంటే? 'క్రోమ్‌ పాస్‌వర్డ్‌ మేనేజర్‌'లో లాగిన్‌ వివరాల జాబితాని పొందొచ్చు. క్రోమ్‌ అడ్రస్‌బార్‌లో యూఆర్‌ఎల్‌ అడ్రస్‌ని టైప్‌ చేసి ఎంటర్‌ కొడితే చాలు. సరాసరి పాస్‌వర్డ్‌ మేనేజర్‌ ప్రత్యక్షమవుతుంది. దాంట్లో వివిధ రకాల యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌లతో మీరు వాడుతున్న సర్వీసుల జాబితా కనిపిస్తుంది. అయితే, పాస్‌వర్డ్‌లు మాత్రం చుక్కల్లానే కనిపిస్తాయి. వాటని చూడాలనుకుంటే పక్కనే ఉన్న బటన్‌ని నొక్కి వాడుతున్న కంప్యూటర్‌ పాస్‌వర్డ్‌ని ఎంటర్‌ చేయాలి. అప్పుడుగానీ పాస్‌వర్డ్‌ ఏంటో చూడగలం. చూసిన తర్వాత 'హైడ్‌'పై క్లిక్‌ చేస్తే చాలు. తిరిగి పాస్‌వర్డ్‌ చుక్కల్లా మారిపోతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే... మీరు వాడుతున్న సిస్టంకి కచ్చితంగా విండోస్‌ పాస్‌వర్డ్‌ ఉండాలి. ఆన్‌లైన్‌లోనూ ఈ లాగిన్‌ వివరాల చిట్టాని చూడొచ్చు. అందుకు యూఆర్‌ఎల్‌ని ఓపెన్‌ చేసి వాడుతున్న జీమెయిల్‌ లాగిన్‌ వివరాలతో సైన్‌ఇన్‌ అవ్వాలి