Monday, July 27, 2015

రిశికేశ్వరి చనిపోలేదు మనమే చంపేసాం


రిశికేశ్వరి చనిపోలేదు మనమే చంపేసాం
అయ్యా నన్ను లైంగికంగా వేదిస్తుండు అని ప్రిన్సిపాల్ కు
మోర పెట్టుకుంటే , నువ్వే వాడిని కదిలిస్తున్నావ్ అని
తిరిగిబెదిరించి పంపించిన ఆచార్యులును ఏమనాలి.
అర్ధనగ్నంగా నడిపించిన ఆ వ్యక్తులను ఏమనాలి ?ఆ వీడియో
తీసిన వాడిని ఏమనాలి ?ప్రేమించకపోతే ఆ వీడియో ని యు ట్యూబ్ లో పెడతాను అన్నా వాడిని ఏమనాలి .?
తన బవిష్యత్తు పాడుచేయవద్దు అని కాళ్ళ వెల్ల పడ్డ
కనికరించని వార్డెన్ ,ప్రిన్సిపాల్ ,ఇంకో ఉన్మాది తదితరులను
వీళ్ళందరిని ఏమి చెయ్యాలి (వాస్తవం :మా కులపోడుకదా వాడిమీద
action తీసుకొను).
అగ్రకుల అహంకారంతో చదువుకోడానికి వచ్చిన ఒక అమ్మాయిని అర్ధ్గనగ్నంగా నడిపించిన కమ్మటి రాక్షసులను ఏమనాలి ,దాన్ని
వీడియో తీసి అందరకి షేర్ చేసిన కుల పిశాచాలను ఏమిచెయ్యాలి .?
రిశికేశ్వరి చనిపోయి ఇన్నిరొజులైనా కనీసం ఒక్కడి మీదకూడా పోలీసు
కేసు పెట్టలేదు ఒక్క fir file అవ్వలేదు ,కనీసం ఆడపిల్ల చావుని
అర్ధం చేసుకొనే మీడియా కూడా సపోర్ట్ చెయ్యట్లేదు
.ఎందుకంటే నేరం చేసింది మనకులంవాడు కాబట్టి . ఇప్పుడు యునివర్సిటీ కాంపస్ లో 15 రోజులు ఆకస్మిక సెలవులు
,బలవంతంగా ఖాలీ చేయిస్తున్న హాస్టళ్ళు ,రిశికేశ్వరి ని సపోర్ట్
చేస్తున్నవారిపై విరుగుతున్న లాటీలు , కాంపస్ లో పోలీసుల
,పారామిలటరీ బలగాల మోహరింపు ,విద్యార్ధి సంఘాలకు కులపు
సంఘాలని పేరు పెట్టి నిషేధాజ్ఞలు, ఉద్యమాన్ని నీరుగార్చడానికి
రాష్ట్ర మంత్రే స్వయంగా వచ్చాడు . ఒక విద్యార్ధి ఆత్మహత్య చేసుకొని చనిపోతే
న్యాయంచేయ్యకపోగా న్యాయం చెయ్యమని అడిగేవారిని
పోలీసులతో బెదురింపులు.ఇదేమి రాజ్యం ?
కులపు ఉన్మాదంతో పెట్రెగిపోయిన వారికి ఒక ప్రశ్న ,రేపు మీ అక్కో
,మీ చేల్లో,మీ కూతురో ఇలాంటి మా కులమే కదా అని వోదిలేసేవారా ?
డైరెక్టుగా రాష్ట్ర ముక్యమంత్రే కేసుని పక్కద్రోవ పట్టిస్తుంటే ఇంకా రిశికేశ్వరికి న్యాయం ఎలా జరుగుతుంది .అందుకే
అంటున్న రిశికేశ్వరి చనిపోలేదు మనమే చంపేసాం అని .దయచేసి ఈ
విషయన్ని రాజకీయకోణం లో కాకుండా ఒక మనిషిగా ఆలోచించాలి అని నా
మనవి.

by:
తెజావతు రవి తెలంగాణా