మొబైల్ యూజర్స్ కి సుభవార్త. మీ మొబైల్ లో తక్కువ మెమరీ తో ఇబ్బంది పడుతున్నార. కొత్త అప్లికేషనులు ఇన్స్టాల్ చేయటానికి మెమరీ సరిపోవటం లేదా ? అయితే మీరు ఇక ఇబ్బంది పడవలసిన అవసరం లెదు. కింద చూపించిన విధంగా ఫాలో అవ్వండి.
సాధారణంగా మనం మొబైల్ కొన్నప్పుడు కంపెనీ ప్రొమొషన్స్ కోసం కానీ, కస్టమర్ నీడ్స్ కోసం కానీ మనకు తెలియని లేదా అవసరం లేని చాలా అప్లికేషన్స్ మొబైల్ లో ఇన్స్టాల్ చేసి ఉంటాయి. ఈ అప్లికేషన్స్ సాధారణంగా అన్ ఇన్స్టాల్(remove ) చేయటానికి వీలుకాదు. దీనివల్ల మన మొబైల్ లో సగం మెమరీ వేస్ట్ అవుతుంది. ఈ కింద చూపించిన విధంగా చేస్తే మనకు అవసరం లేని అప్లికేషన్స్ అన్ ఇన్స్టాల్ చేయవచ్చు.
- మొదటిగా దీనికోసం మీరు కంప్యూటర్ ఉపయోగించాల్సి ఉంటుంది
- కంప్యూటర్ లో మీరు ఒక సాఫ్ట్వేర్(software ) డౌన్లోడ్ చేయాలి.
- మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ పేరు Kingo Root(కింగో రూట్ ).
- కింగో రూట్ ని డౌన్లోడ్ చేయటానికి కింద చూపించన లింక్ మీద క్లిక్ చేయండి.
- http://www.kingoapp.com/ (డౌన్లోడ్ లింక్ )
- కింగో రూట్ ని ఇన్స్టాల్ చేయండి.
- ఇన్స్టాల్ చేసిన కింగో రూట్ సాఫ్ట్వేర్ ని ఓపెన్ చేయండి .
- తర్వాత మీ మొబైల్ లో USB DEBUGGING మోడ్ ని యాక్టివేట్ చేయండి. దీన్ని యాక్టివేట్ చేయటానికి మీ మొబైల్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి అప్లికేషన్స్ పార్ట్ ని ఓపెన్ చేయాలి, అందులో మీకు డెవలప్మెంట్(DEVELOPMENT ) పార్ట్ కనపడుతుంది దాన్ని ఓపెన్ చేయండి. అందులో మీకు USB DEBUGGING ఆప్షన్ ఉంటుంది దాని ఆక్టివేట్ చేయండి .
- ఇప్పుడు మీ మొబైల్ ని డేటా కేబుల్ ద్వారా కంప్యూటర్ కి కనెక్ట్ చేయండి..
- కనెక్ట్ చేసిన తర్వాత మీ స్క్రీన్ మీద కింగో రూట్ సాఫ్ట్వేర్ కింద చూపించిన విధంగా కనబడుతుంది .
- మీ మొబైల్ కనెక్ట్ చేసిన తర్వాత 5 నిమషాలు వెయిట్ చేయండి. కింగో రూట్ ఆటోమేటిక్ గా మీ మొబైల్ డ్రైవర్స్ ని ఇన్స్టాల్ చేసుకుంటుంది. తర్వాత మీకు పైన రెండవ బొమ్మలో చూపించిన విధంగా మీ మొబైల్ మోడల్ ని చూపిస్తుంది .
- తర్వాత రూట్(Root ) బటన్ క్లిక్ చేయండి
- మీ మొబైల్ రూటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దయచేసి మీ మొబైల్ ని కదిలించవద్దు.
- రూట్ కంప్లీట్ ఐన తర్వాత కింద చూపిన విదంగా మెసేజ్ వస్తుంది.
- ఫినిష్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ విజయవంతంగా రూట్ చేయబడింది
- ఇప్పుడు మీ మొబైల్ ని కంప్యూటర్ నుంచి డిస్ కనెక్ట్ చేయండి .
- తర్వాత మీ మొబైల్ లో ప్లే స్టోర్ నుంచి Explorer యాప్ ని ఇన్స్టాల్ చెయన్ది.
- ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన Explorer అప్లికేషన్ ఓపెన్ చేయండి.
- ఇందులో మీకు కిందకు వెళితే System అని ఫోల్డర్ ఉంటుంది . దాన్ని ఓపెన్ చేయండి
- అందులో మీకు App అనే ఫోల్డర్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేయండి. అందులో మీకు ఇన్స్టాల్ అయ్ ఉన్న అప్ప్స్ కనపడతాయి. అందులో మీకు ఉపయోగం లేని అప్లికేషను మీద లాంగ్ ప్రెస్ చేస్తే ఆప్షన్స్ వస్తాయి అందులో డిలీట్ ఆప్షన్స్ క్లిక్ చెయన్ది. ఇప్పుడు మేం మెమరీ ఫ్రీ అవుతుంది