2005కు ముందు ఉన్న కరెన్సీ మార్చుకునేందుకు రిజర్వు బ్యాంక్ ఇచ్చిన గడువు మరింత పొడిగిం చారు. మరో వారం రోజుల్లో ఈ గడువు ముగియ నుండగా, ఈ ఏదాది చివరి వరకు (డిసెంబర్ 31) వరకు పొడిగించారు. ఈలోగా ప్రజలు తమ వద్ద ఉన్న 2005 పూర్వకంగానే కరెన్సీ నోట్లను రూ.500, రూ. 1000 సహా బ్యాంకుల్లో ఇచ్చేసి కొత్తగా మార్పిడి చేసుకునే వీలుంది. 2005 కంటే ముందునాటి రూ.500, రూ.1000 నోట్లను వెంటనే ఆయా బ్యాంకుల్లో ఇచ్చేసి వినియోగ దారులు మార్చుకోవాలని ఇప్పటికే ఆర్‌బిఐ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలోనే ఈ నిర్ణయాన్ని వెలువరించినా కొన్నికారణాలవల్ల గడు వును రెండుసార్లు పొడిగించారు. జూన్ 30లోగా రిజర్వు బ్యాంక్ ఆదేశాలు పాటించాలని చెప్పారు. -