తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో...హైదరాబాద్: తెలంగాణలో శాసనమండలి ఎన్నికల  పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తెలంగాణ అసెంబ్లీలో నామినేటెడ్  సభ్యుడితో కలిసి 120 మంది ఎమ్మెల్యేలు ఉండగా వారిలో మధ్నాహ్యం వరకు 118  మంది శాసనసభ్యులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటల సమయంలో అసెంబ్లీకి వచ్చి తన ఓటుహక్కును  వినియోగించుకున్నారు. మరోవైపు ఇద్దరు వామపక్ష సభ్యులు ఓటింగ్‌కు దూరంగా  ఉన్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు  కొనసాగనుంది. సాయంత్రం ఐదు గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించనున్నారు.