అనుకోకుండా నా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోని మెసెజ్‌లన్ని డిలీల్ చేసేసాను..?, వాటిని రికవర్ చేసుకునే మార్గం ఏదైనా ఉందా..?, 99 శాతం ఖచ్చితత్త్వంతో మీ ఎస్ఎంఎస్‌లను రికవర్ చేసుకోవచ్చు. అయితే, ఇక్కడ సమయం అనేది చాలా ముఖ్యం. డేటా రికవరింగ్ ప్రక్రియ అనేది కొద్ది పోర్షన్ మెమరీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి, మీ డివైస్‌లోని ఎస్ఎంఎస్‌లు డిలీట్ అయిన వెంటనే స్పందించాల్సి ఉంది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో డిలీట్ అయిన టెక్స్ట్ సందేశాలను రికవర్ చేసుకునే మార్గాలను మీ ముందుంచుతున్నాం... మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి ఆండ్రాయిడ్ ఫోన్‌లలోని డిలీట్ అయిన టెక్స్ట్ సందేశాలను రికవర్ చేసుకునేందుకు అనేక పీసీ ఆధారిత టూల్స్ అందుబాటులో ఉన్నాయి.వాటిలో ఎక్కువగా వాడుతున్నవి...Coolmuster Android SMS+Contacts Recovery, Android Data Recovery ముందుగా మీరు ఎంపిక చేసుకున్న ప్రోగ్రామ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పీసీలో ఇన్‌స్టాల్ చేయండి. ఆ తరువాత యూఎస్బీ కేబుల్ సహాయంతో మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను డేటా రికవరీ ప్రోగ్రామ్ ఇన్‌స్టాల్ చేయబడిన పీసీకి కనెక్ట్ చేయండి. ఆ తరువాత ప్రోగ్రామ్ లోని నిబంధనలను అనుసరిస్తూ డేటా రికవరీకి ఉపక్రమించండి. రికవర్ అయిన డేటాను ముందగా పీసీలో సేవ్ చేసుకుని ఆ తరువాత ఫోన్ లోకి బదిలీ చేసుకోండి.