Monday, March 16, 2015

మలేషియా విమానం మాయమై ఏడాది



అదేమీ చిన్న వస్తువు కాదు. భారీ విమానం. సరిగ్గా సంవత్సరం క్రితం 239 మందితో ప్రయాణిస్తున్న మలేషియా విమానం మాయమై పోయింది. ప్రపం చంలోని అత్యా దునిక సాంకేతిక పరి కరాలు ఆ విమానం ఎక్కడ ఉం దన్న సం గతిని గుర్తించలేకపోయాయి. విమాన శిథిలాలు కాదుకదా, దానికి సంబంధించిన చిన్న రేకుముక్క కూడా దొరకలేదు. వరల్డ్‌ ఎయిర్‌ లైన్‌ హిస్టరీలో అత్యంత విషాదకర సంఘటనగా చరిత్రకెక్కిన దుర్ఘటనలో విమానం కూలిపోయిందని భావిస్తున్న అనుమానిత ప్రాంతాన్ని అణువణువునా శోధిస్తున్నా, సమ యం ఏడాది కావడం మినహా, ఏ ఆధారమూ లభించలేదు. ప్రయాణికుల బంధువులు మాత్రం విమానం కూలిపోయిందన్న విషయం ఆధారాలతో నిర్థారణ కాకుండా ప్రయాణికులు చని పోయారని ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నారు. విమానాన్ని హైజా క్‌ చేశారనీ, తమవాళ్లను ఎవరో కిడ్నాప్‌ చేశారని నమ్ముతున్న వారూ వున్నారు. మొత్తం 23 వేల చదరపు మైళ్లు వెతకాలని లక్ష్యంగా పెట్టుకున్న మలేషియా అధికారులు, ప్రస్తుతానికి 10 వేల మైళ్లు వెతికారు. మిగిలిన ప్రాంతాన్ని మేలోగా పూర్తి చేసి విమానాన్ని కనిపెడ తామని మాత్రం చెబుతున్నారు.