Tuesday, March 3, 2015

ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన: ప్రత్యేకతలు


కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ  పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన 2015-16 బడ్జెట్‌లో ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకాన్ని గురించి వివరించారు. అసలు ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం అంటే ఏమిటీ? దీని ప్రత్యేకలు ఏంటో చూద్దాం. ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం ముఖ్య ఉద్దేశ్యం జీవిత బీమా కవరేజి. ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పేరిట కొత్తగా చేపడుతున్న పథకం నిరుపేదలకు కాస్త ఊరటనిస్తుంది. 
ఎవరెవరు ఈ పథకం కిందకు అర్హులు చూద్దాం. 
1. బ్యాంకు ఖాతా కలిగి ఉండి, 18-50 ఏళ్ల మధ్య వయసున్నవారు ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకానికి అర్హులు. 
2. ఈ పథకంలో చేరాలనుకునే వారు 50 ఏళ్లు నిండక ముందే చేరాల్సి ఉంది. ప్రీమియం పూర్తైన తర్వాత కూడా 55 ఏళ్ల పాటు ఇందులో కొనసాగవచ్చు.
3. 18-50 ఏళ్లలోపు ఉన్న వారు 12 వాయిదాల్లో రూ. 330 ప్రీమియం చెల్లించాలి. 
4. చందాదారులు ఖాతా నుండి ప్రీమియం చెల్లింపు నేరుగా బ్యాంకు ద్వారా తీసుకోబడుతుంది. 
5. ఏదైనా ప్రమాదం వల్ల చనిపోతే, ఈ పథకం కింద రూ. 2 లక్షల బీమా సదుపాయం కల్పిస్తున్నారు. 
6. ఈ పథకం కింద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి ప్రతి ఏడాది దానికదే పునరుద్ధరణ, రెండోది ఎంపిక వ్యక్తిగతం. 
7. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన కింద ఖాతాలు తెరిచిన వారికే ఈ పథకం వర్తిస్తుంది. పెన్షన్ ఫండ్‌లో పొదుపు చేసే వారికి రూ. 50 వేల వరకు రాయితీ.