ఆమ్లాలు:
Tags: ఆమ్లాలు - క్షారాలు,Telugu DSC 2015 Bits, Telugu Study DSC, chemistry science DSC fair projects chemistry DSC Study Bits, periodic table chemistry science experiments chemistry science articles chemistry scientists physics chemistry science games
- ఆమ్లాల ధర్మాలను మొదట రాబర్డ్ బాయిల్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు.
- అలోహ ఆక్సైడ్ లను నీటిలో కరిగించగా ఆమ్లాలు ఏర్పడతాయి.
- ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి.
- నీలి లిట్మస్ ను ఎర్రగా మారుస్తాయి.
- సజల ఆమ్లాలు లోహాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును వెలువరిస్తాయి.
- అవి లోహ కార్బనేట్ లతో చర్య జరిపి కార్బన్ దై ఆక్సైడ్ వాయువును వెలువరిస్తాయి.
- పాలలో ఉండే ఆమ్లం లాక్టిక్ ఆమ్లం
- నిమ్మ, నారింజ వంటి ఫలాలలో ఉండే ఆమ్లం-సిట్రిక్ ఆమ్లం
- చింతపండులో ఉండే ఆమ్లం- టార్టారిక్ ఆమ్లం
- ఉసిరికాయలో ఉండే ఆమ్లం- ఆస్కార్బిక్ ఆమ్లం
- వెనిగర్ లో ఉండే ఆమ్లం - ఎసిటిక్ అమ్లం
- జీర్ణ రసాలలో ఉత్పత్తి అయ్యే ఆమ్లం - హైడ్రోక్లోరిక్ అమ్లం (ఇది ఆహారాన్ని జీర్ణం చేస్తుంది)
- చీమ కుట్టీనపుడు మన శరీరంలోకి ప్రవేశించే ఆమ్లం- ఫార్మిక్ ఆమ్లం
- మూత్రంలో ఉండే ఆమ్లం- యూరికామ్లం
- సల్ఫ్యూరిక్ ఆమ్లం (గంధకి కామ్లం) ను ఆమ్లాలకు రాజు (King of Acid) అంటారు.
- ప్రపంచంలో అత్యధికంగా ఉత్పత్తి చేసే రసాయనాల్లో సల్ఫ్యూరిక్ ఆమ్లం ప్రథమ స్థానం ఆక్రమిస్తుంది.
- లోహ ఆక్సైడ్ లను నీటిలో కరిగించిన క్షారాలు ఏర్పడతాయి
- క్షారాల ధర్మాలను మొదట రౌలే అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు.
- ఇవి రుచికి చేదుగా ఉంటాయి.
- ఇవి ఎర్ర లిట్మస్ ను నీలిరంగుగా మారుస్తాయి.
- ఇవి తాకితే జారిపోయే స్వాభావంతో ఉంటాయి
- వీటిని అమ్మోనియం లవణాలతో వేడిచేసినప్పుడు అమ్మోనియా వాయువు వెలుపడుతుంది. మనం వాడె బట్టల సోడా ద్రావణం, సున్నపు నీరు, బూడిద నీరు క్షారాలకు ఉదాహరణలు.
- క్షారాలను నారింజరంగు ఉన్న మిథైల్ ఆరంజి సూచికను పసుపు రంగుకు మారుస్తాయి.
- ఇవి ఫినాఫ్తలీన్ సూచిక రంగును గులాబి రంగును మారుస్తాయి.
upload ......
Tags: ఆమ్లాలు - క్షారాలు,Telugu DSC 2015 Bits, Telugu Study DSC, chemistry science DSC fair projects chemistry DSC Study Bits, periodic table chemistry science experiments chemistry science articles chemistry scientists physics chemistry science games