
అడిలైడ్: ఐసీసీ ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం చేసింది. ఆదివారం అడిలైడ్‌లో  జరిగిన వన్డే మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ 76 పరుగుల తేడాతో ఘన విజయం  సాధించింది. వరల్డ్ కప్ చరిత్రలో దాయాది పైన ఓటమెరుగని భారత్ మరోసారి తన  విజయపరంపరను కొనసాగించి చరిత్రను పునరావృతం చేసింది.   ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటివరకు పాక్‌తో జరిగిన ఆరు మ్యాచ్‌ల్లోనూ భారత్  విజయబావుటా ఎగురవేసింది. పాక్ పైన విజయం సాధించడంతో భారత క్రికెట్  అభిమానులు పెద్దఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. విరాట్ కోహ్లీకి మేన్ ఆఫ్  ది మ్యాచ్ దక్కింది.   భారత జట్టు బ్యాటింగ్‌లో శిఖర్ ధావన్, సురేష్ రైనా, విరాట్ కోహ్లీలు  మెరిశారు. బౌలింగులో షమీ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. నాలుగు కీలక వికెట్లు  తీశాడు. భారత్ గెలుపు పైన ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ  టీమిండియాకు అభినందనలు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం  కేసీఆర్, వైసీపీ అధినేత జగన్‌లు కూడా అభినందనలు తెలిపారు.   ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ పైన భారత్ 76  పరుగుల తేడాతో గెలిచింది.