ఓ చిన్న స్మార్టు ఫోన్... అందులో ఓ చిన్న యాప్ ఉంటే చాలు.. ప్రపంచ దేశాలన్ని దగ్గరై పోతాయి. ఇంటర్నెట్ అక్కర లేదు. రీచార్జీతో అసలు పనే లేదు. మినిమమ్ అమౌంట్ ఫోన్లో ఉంటే చాలు ప్రపంచంలోని బంధువులందరినీ చుట్టేవచ్చు.. అదేంటి అంత ఈజీనా అనుకుంటున్నారా. అవుననే అంటున్నారు రింగో యాప్ ప్రతినిధలు అది ఎలాగో తెలుసుకుందాం. రింగో... 16 దేశాల్లో విజయవంతమైన ఈ యాప్ ఇప్పుడు భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. రింగో యాప్‌తో ప్ర పంచంతో భారతీయుల కమ్యూనికేషన్ విషయంలో పెనుమార్పు వస్తుందని రింగో సీఈఓ భవిన్ తురకియా ధీమాను వ్యక్తం చేశారు. రింగో కాల్స్‌కు ఇంటర్నెట్, వైఫై, డేటా అవసరం లేదని వివరించారు. భారత్‌లోని రింగో యూజర్, ఇంగ్లాండ్‌లోని వ్యక్తికి ఫోన్ చేయాలనుకున్నట్లైతే, రింగో భారత యూజర్‌కు లోకల్ కాల్‌ను డయల్ చేస్తుంది. అలాగే ఇంగ్లాండ్‌లోని యూజర్‌కు కూడా లోకల్ కాల్‌ను డయల్ చేస్తుంది. ఈ ఇరువురిని కేరియర్ సర్క్యూట్ల ద్వారా అనుసంధానం చేస్తుందని వివరించారు.