యాప్ దీని పూర్తి పేరు అప్లికేషన్. స్మార్ట్‌ఫోన్ యూజర్‌లకు ఈ 'యాప్స్' భలే సుపరిచితం. అందుబాటులోకి వచ్చిన స్మార్ట్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఆసరాగా చేసుకుని వివిధ రకాల మొబైల్ ఇంకా డెస్క్‌టాప్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేసే విధంగా లక్షలాది అప్లికేషన్‌లను డెవలపర్లు వృద్థి చేస్తున్నారు. తెలుగు యాప్‌లకు భలే క్రేజ్ అప్లికేషన్‌ల రూపకల్పనలో భాష కూడ కీలకం కావటంతో ఉపయుక్తమైన సమాచారంతో ప్రాంతీయ భాషల్లో రూపుదిద్దుకుంటున్న 'స్మార్ట్' యాప్స్‌కు వినియోగదారుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి ఇక మన తెలుగు విషయానికొస్తే వంటకాలు, ఫిట్నెస్, కథలు, సామెతలు, పొడుపు కథలు, జోక్స్, వంటలు, స్తోత్రాలు, బైబిల్, ఖురాన్ ఇలా అనేక అంశాలకు సంబంధించి వందలాది అప్లికేషన్‌లు మన మాతృ భాషలో అందుబాటులో ఉన్నాయి. ఈ ఉపయుక్తమైన తెలుగు యాప్స్ ద్వారా కేవలం ఒకే ఒక క్లిక్‌తో విలువైన సమాచారాన్ని స్మార్ట్‌ఫోన్ యూజర్లు తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండవల్సిన 10 తెలుగు అప్లికేషన్‌లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.. భగవథ్ గీత తెలుగు యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా మంచి మాటలను తెలుసుకోవచ్చు. Bhagavad Gita Telugu గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఈ యాప్ ద్వారా అర్థం కాని ఇంగ్లీష్ పదాలకు తెలుగు అర్థాలను తెలుసుకోవచ్చు... English Telugu Dictionary గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఈ యాప్ ద్వారా తెలుగు వంటకాలను తెలుసుకోవచ్చు. Telugu Recipes గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నఈ తెలుగు క్యాలెండర్ యాప్ ద్వారా ముఖ్యమైన తేదీలు అలానే పండుగలకు సంబంధించి సమచారాన్ని తెలుసుకోవచ్చు. Telugu calendar 2015 తెలుగు కీబోర్డ్ యాప్ Telugu Keyboard ఈ యాప్ ద్వారా తెలుగు ఎస్ఎంఎస్‌లను మీ స్మార్ట్‌ఫోన్‌లో పొందవచ్చు. Telugu SMS మనసుతో - తెలుగు మ్యూజిక్ యాప్, ఈ అప్లికేషన్ ద్వారా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు అత్యుత్తమ మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు. Manasu Tho - Telugu Music తెలుగు ఇ-బుక్స్, ఈ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా నచ్చిన తెలుగు ఇబుక్‌లను ఫోన్‌లో వీక్షించవచ్చు.. Telugu eBooks తెలుగు బాలశిక్ష, Telugu Balasiksha Lite వన్‌ఇండియా తెలుగు న్యూస్ Oneindia Telugu News