దేశంలో ప్లాస్టిక్ వాడకం రానురాను ఎక్కువవ్ఞ తోంది. ప్లాస్టిక్ వాడకం ద్వారా వాతావరణం కాలు ష్యం పెరిగిపోతోంది. ప్లాస్టిక్ సమాజానికి సవాల్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిసంవత్సరం 50 వేలకోట్ల ప్లాస్టిక్ సంచులు వాడుతున్నారు. ప్లాస్టిక్ సంచులను వాడి ఎక్కడపడితే అక్కడ టన్నుల కొద్దీ పారేయడంతో ప్లాస్టిక్ వ్యర్థాల మూలంగా పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. వాతావరణం పూర్తిగా కలుషితం కావడంతో అనేక సమ స్యలు వస్తున్నాయి. హైదరాబాద్ మహానగరంలో ఒక రోజుకు సగ టున 350 మెట్రిక్ టన్నుల దాకా ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపో తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను నివారించేందుకు కాలుష్య నియం త్రణ మండలి అటవీశాఖ ప్రవేశపెట్టిన సరికొత్త విధానాలు సఫలీ కృతం కాలేదు. ప్లాస్టిక్‌ను ప్రభుత్వాలు నిషేధించినప్పటికీ అవి ఆచ రణలో అమలు కావడం లేదు. ప్లాస్టిక్ సంచుల ఉత్పత్తి విక్రయా లపై ఆంక్షలు విధిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిన పది లక్షల వంతును మైక్రాన్‌గా వ్యవహరిస్తున్నారు.
1986 నాటి పర్యావరణ పరిరక్షణ చట్టం నిబంధనలని ప్రతిపా దించినా ఫలితాలు ఏమిరావడం లేదు. ఆరోగ్య కేంద్రాలు , ఫలహా రశాలలు, పార్కులు,మైదానాలు పర్యాటక స్థలాలు తదితర ప్రాంతా లలో ప్లాస్టిక్ సంచుల వాడకం నిషేధించారు. ప్రభుత్వ నిబంధన లను పాటించని ప్లాస్టిక్ సంచులు విక్రయించే వ్యాపారులకు జరిమా నాలు వసూలు చేస్తారు. అది ఎక్కడా అమలుకావడం లేదు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు అవ్ఞతాయి. వాటిలో మున్సి పాలిటీ కమిషనర్లు, ప్లాస్టిక్ ఉత్పత్తిదారులు సమాఖ్య ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. రాష్ట్రవ్యాప్తంగా పల్లెలు, పట్టణాలు నగరా లలో ఎన్నో చోట్ల చెత్తకుండీలు, మురికికాలువాలు బహిరంగ ప్రదే శాలలో లెక్కకు మించి ప్లాస్టిక్ కవర్లు పడి ఉంటున్నాయి. దీంతో దోమల బెడద అధికంగానే ఉంది. ప్లాస్టిక్ సంచులు వెయ్యి సంవ త్సరాలైనా భూమిలోకి ఇంకిపోవ్ఞ. ప్లాస్టిక్ అత్యంత ప్రమాదకరంగా మారింది. కొన్ని సంవత్సరాలకు పాలిథిన్ ఛిద్రమై ప్లాస్టిక్ ధూళిగా మారి మానవ శరీరాల్లోకి ప్రవేశించి రోగాలకు దారితీస్తుంది. తది తర ప్రాణాంతక వ్యాధులు వెంటాడుతాయి. ఈ ప్లాస్టిక్ వల్ల జలా శయాలు కలుషితమైపోతున్నాయి. చెరువ్ఞలు, కుంటలు ఎండిపోయి మురికినీటితో కాలుష్యకాసారాలుగా మారుతున్నాయి. సముద్రాలు, నదులు, పూర్తిగా కలుషితంగా మారుతున్నాయి. పశువ్ఞల సంఖ్య నానాటికి ప్రమాదస్థాయిలో తగ్గిపోతున్నది. పక్షలు జీవరాశులు అంచెలంచెలుగా కనుమరుగైపోతున్నాయి. సముద్రాలలో తాబేళ్లు, చేపలు, కప్పలు, తరిగిపోతున్నాయి. ఆహారపదార్థాలను, కూరగా యలను, ఇతర వస్తువ్ఞలను ఎక్కువగా ప్లాస్టిక్ సంచులలో తెచ్చుకో వడంతో శారీరకంగా, మానసికంగా అనేక వ్యాధులు అంటుతు న్నా యి. చాలావరకు అనర్థాలకు దారితీస్తుంది. ఇంతజరిగినా ప్లాస్టి క్‌ను మాత్రం మరవలేకపోతున్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడా నికి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా,సిక్కిం, కర్ణాటక రాష్ట్రాలు చేస్తు న్న కృషి కొంతమేరకు ఫలితాలనిస్తున్నాయి. మన రాష్ట్రంలో మాత్రం ప్లాస్టిక్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వాలు పెద్దగా పట్టిం చుకోవడం లేదు. పర్యావరణ సమస్యలు దినదినంగా మరింత ఉత్పన్నమవ్ఞతున్నాయి. ప్రభుత్వాలు మాత్రం తూతూ మంత్రంగానే పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టి వదిలేస్తున్నాయి. అడవ్ఞలను నరికివేయడం, కాలం చెల్లిన వాహనాల నుంచి కార్బన్ డై ఆక్సైడ్ వంటి విషవాయువ్ఞలు వెలువడటంతో పర్యావరణం పూర్తిగా నాశన మైపోతున్నది. ప్రపంచవ్యాప్తంగా కార్బన్ డైఆక్సైడ్ ప్రమాదస్థాయికి చేరుకుంది. ఉష్ణోగ్రత పెరిగిపోయి వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో వర్షాలు లేక, కరువ్ఞ కాటకాలు, అతివృష్టి, అనావృష్టి ఎదురవ్ఞతుంది. ఎక్కడపడితే అక్కడ ఉమ్మివేయడం, ప్లాస్టిక్ సంచులను పారేయడం ఇతర వ్యర్థా లను ఎక్కడపడితే అక్కడ వేయడం వల్ల అంతుపట్టని అంటు వ్యాధులు వెంటాడుతున్నాయి.
హైదరాబాద్ వంటి మహానగరాల్లో భూగర్భజలాలు కలుషితంగా మారాయి. దేశంలో కలుషిత నీరు తాగడం వల్ల సంవత్సరానికి పది లక్షల మంది చనిపోతున్నారు. 2050 నాటికి కాలుష్యం తీవ్రం గా కలుషితం కానున్నది. పర్యావరణ పరిరక్షణకు రాజకీయ నేతల ఉపన్యాసాలు వేదికలకు మాత్రమే పరిమితమవ్ఞతున్నాయి తప్ప ఆచరణలో అమలు కావడం లేదు. ప్లాస్టిక్‌ను ప్రభుత్వం నిషేధిం చినప్పటికీ ప్లాస్టిక్ వాడకం తగ్గడం లేదు. ప్లాస్టిక్ కవర్లను ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల అవి భూమిలోకి చొచ్చుకుపోతు న్నాయి. వర్షాలు పడినప్పుడు భూమిలోకి నీరు ఇంకకుండా అడ్డు పడుతున్నాయి. దీంతో అనేక సమస్యలు ఉత్పన్నమవ్ఞతున్నాయి. వర్షాలు అధికంగా కురియడంతో పలుచోట్ల నీటినిల్వలవల్ల దోమలు, ఇతర క్రిమి కీటకాలు ఎక్కువై విషజ్వరాలకు కారణమవ్ఞతున్నాయి. ప్రతి ఒక్కరు మాకెందుకులే అనుకుంటే శుభ్రతతగ్గి వ్యాధులు ఎక్కు వయ్యే అవకాశాలున్నాయి.పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత కోసం పాటుపడాలి. పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా అందరు గుర్తించాలి. ప్లాస్టిక్ వస్తువ్ఞలైన బిందెలు, కవర్లు, గ్లాసులు, కప్పులు, గిన్నెలు, బాటిళ్లు లాంటి వాడకం తగ్గించాలి. ప్లాస్టిక్ వస్తువ్ఞలను తయారు చేసే కంపెనీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించాలి. ఒకవేళ ఈ కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసు కోకున్నా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్లాస్టిక్ సంచుల ఉత్ప త్తిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. ప్లాస్టిక్ సంచులను వాడినా వాటిని ఎక్కడపడితే అక్కడ వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మున్సిపాలిటీ వాళ్లు సేకరించిన ప్లాస్టిక్ సంచులను ఇతర వస్తు వ్ఞలను నివాస ప్రాంతాలకు దూరంగా తీసు కువెళ్లి వాటిని కాల్చి వేయాలి. ప్రజలు కూడా ఎక్కువగా పాలిథిన్ కవర్లను ఉపయో గించకుండా వాటిస్థానంలో పేపర్‌తో తయారైన సంచులను, బట్టలతో తయారైన సంచులను ఉపయోగిస్తే మంచిది. ఈ సంచు లు భూమిలోకి సులభంగా చొచ్చుకొనిపోతాయి. అంతే కాకుండా ఈ సంచులు నీటిని కూడా పీల్చుకుంటాయి.