విద్యాహక్కు చట్టం - 2009
- ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రతి బాలబాలికలకు ఉచిత విద్య మరియు నిర్భంధిత విద్యను హక్కుగా కల్పించబడింది. ఇది 86 వ రాజ్యాంగ సవరణ చట్టం ఆర్టికల్ 21 ఎ కి అనుబంధంగా కల్పించబడింది. ఉచితంగా విద్యను హక్కుగా పొందే ఈ సవరణ వలన మంచి పరిణామము ఇవ్వాలని కోరుతుంది .
- పాఠశాల నిర్వహణాసంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు పిల్లలందరికీ ఉచిత విద్యను కల్పించాలి. ప్రైవేటు పాఠశాలలు తమ పాఠశాలలలో 25 శాతం పిల్లలకు ఎటువంటి రుసుము లేకుండా ప్రవేశము కల్పించాలి.
- నాణ్యతతో పాటు అన్ని రకాల ప్రాథమిక విద్యా విషయాలను పర్యవేక్షించుటకు గాను జాతీయ సంఘం ఏర్పాటు చేయాలి.
ఈ చట్టం ఎందుచేత అత్యంత
ఆవశ్యకము ?
- ఉచిత నిర్భంద ప్రాథమిక విద్య మరియు తరువాత స్థాయి విద్య ఏర్పాటుని శాసననిర్మాణం చేస్తుంది
- ప్రతి ఆవాసానికి ఒక పాఠశాలని ఏర్పాటు చేస్తుంది
- పాఠశాల పర్యవేక్షక కమిటీ (పాఠశాల నిర్వహణను పర్యవేక్షించే ఆ ఆవాసంలో గల ఎన్నికైన సభ్యులు) ఏర్పాటు చేస్తుంది.
- ఆరు నుండి పద్నాలుగు (6-14) సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలెవరూ పనిలోకి వెళ్ళకుండా శాసనం చేస్తుంది