వ్యాధులన్నీ ప్రాణాంతకం కావు. కాని కొన్ని వ్యాధులు మాత్రం శరీరాన్ని నిర్జీవంగా మార్చివేస్తాయి. అలాంటిదే ఈ వెన్నునొప్పి, సయాటికా సమస్యలు కూడా. జీవితాన్ని నరకప్రాయం చేస్తాయి. ఈ సమస్యను ముందే గుర్తించి వైద్య చికిత్సలు తీసుకుంటే వెన్నునొప్పి శాశ్వతంగా తగ్గడమే కాదు, జీవితం పునశ్శక్తిని పొందుతుంది. ఈ ప్రయోజనాలన్నీ నెరవేరేది ఆయుర్వేద వైద్యంలోనే. వెన్నునొప్పి మొదట్లో అంతా సామాన్యంగానే అన్పిస్తుంది.కాని ఒక దశలో పక్షవాతంలా జీవితాన్ని కుప్పకూల్చేస్తుంది. వెన్నునొప్పి, సయాటికా సమస్యలు నిజంగా మనిషిని అస్తవ్యస్తం చేస్తాయి. అయితే అత్యంత తీవ్రమైన ఈ రెండు సమస్యలు ఆధునిక జీవనవిధానంతో వచ్చేవే. పైగా ఈ సమస్యలు ఏదో ఒక ఐదేళ్లు వచ్చిపోయేవి కాదు. ఏళ్లతరబడి మంచాన పడివుండేలా చేస్తాయి. దీనితో రోగి శారీరకంగా, మానసికంగా అసహనానికి, ఆగ్రహానికి లోనవుతారు. ఇది అన్ని వయసుల వారిని నిలువునా కుంగదీస్తుంది. వెన్నెముక అనేది శరీరం మొత్తానికి కరెంటును సప్లయి చేసే ఒక పవర్‌హౌస్, కాళ్లనొప్పులు, వెన్నుభాగంలో పొడిచినట్లు, మొద్దుబారినట్లు చురకలు, పోట్లు, మంటలు మొదలవుతాయి. ఈ వెన్నునొప్పి బాగా ముదిరితే పురుషుల్లో అంగస్తంభనలు తగ్గిపోవడం, స్త్రీలలో జననాంగం పొడిబారిపోవడం జరుగుతుంది. వెన్నుపాములోని నరాలు, డిస్క్‌లు ఒత్తిడికి గురైతే కాళ్లూచేతులు పక్షవాతానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. సర్జరీతో జరిగేదేమిటి? వెన్నునొప్పితో వెళితే అల్లోపతి వైద్యాలు మొదటగా సూచించేది పెయిన్ కిల్లర్లు, బెడ్ రెస్ట్. ఎక్కువరోజులు పెయిన్ కిల్లర్లు వాడడం వల్ల కలిగే దుష్ప్రభావాలు అన్నీ ఇన్నీ కావు. సర్జరీ దాకా వెళితే పెద్దమొత్తంలో ఖర్చు కావడమే తప్ప కలిగే ప్రయోజనం మాత్రం పెద్దగా ఉండదు. సర్జరీ వల్ల కలిగే ప్రయోజనాల విషయంలో వారిచ్చే గ్యారెంటీ కూడా ఏమీ ఉండదు. కనీసం ఆ ఒక్క సర్జరీతో అంతా అయిపోతుందా అంటే చెప్పలేం. మరో సర్జరీ కూడా అవసరం రావచ్చు. ఆయుర్వేదం ఏం చేస్తుంది? ముందుగా వెన్నునొప్పి రావడానికి గల కారణాలను ఆయుర్వేదం కనిపెడుతుంది. శరీరంలో వాతం ఎక్కువ అయినప్పుడు వెన్నునొప్పికి, కాలు అంతటా పాకే సయాటికా నొప్పికి మూలమవుతుంది. చికిత్సావిధానంలో లిగమెంట్లు, టెండాన్లు, డిస్క్‌లు, వెన్నెముకతో అనుబంధంగా ఉండే కండరాలను సమస్థితికి తీసుకురావడం ఆయుర్వేద చికిత్స ద్వారానే సాధ్యపడుతుంది. దానితో పాటు నరాల వ్యవస్థను ఉత్తేజపరచడం ద్వారా వెన్నునొప్పి తగ్గడమే కాకుండా మరోసారి ఆ నొప్పి రాకుండా చేస్తాయి. ఈ చికిత్సలో మేరు చికిత్సలు, మర్మచికిత్సలు, పంచకర్మ చికిత్సలు కీలకపాత్ర వహిస్తాయి. కాబట్టి ఆయుర్వేద వైద్య చికిత్సల ద్వారా మీ వెన్నునొప్పికి శాశ్వత పరిష్కారాన్ని పొందండి.