సుప్రీం కోర్టు కొత్త నిబంధనలు న్యూఢిల్లీ : మరణ శిక్ష పడిన వ్యక్తి పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌ను బహిరంగ కోర్టులో విచారించాలని సుప్రీం కోర్టు మంగళవారం రూలింగ్ ఇచ్చింది. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ పిటిన్లను విచారిస్తుందని పేర్కొంది. ఇప్పటికే రివ్యూ పిటిషన్లను తోసిపుచ్చిన వ్యక్తులు (మరణశిక్ష పడిన) తిరిగి నెల రోజుల్లోగా తాజాగా పిటిషన్లు దాఖలు చేసకుని తమ వాదనలు వినిపించుకోవచ్చని సుప్రీం కోర్టు తెలిపింది. అంటే దీనర్ధం ఉరి శిక్ష పడిన ఖైదీలు తమకు ఇచ్చిన తీర్పును సవాలు చేయడానికి మరో అవకాశాన్ని ఇవ్వడమన్న మాట. ఒకవేళ సదరు ఖైదీ క్యురేటివ్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకుంటే ఆ వ్యక్తి రివ్యూ పిటిషన్‌ను మళ్ళీ పెట్టుకోరాదని కోర్టు రూలింగ్ ఇచ్చింది. ఐదురుగు న్యాయమూర్తుల బెంచ్ 4-1 మెజారిటీతో ఈ తీర్పు ఇచ్చింది. ఎర్రకోటపై దాడి కేసులో ఉరి శిక్ష పడిన మహ్మద్ అసఫక్, ముంబయి పేలుళ్ళ సూత్రధారి యాకుబ్ మీనన్, సోను సర్దార్ ఇంకా అనేకమంది తమపై తీర్పును సవాలు చేసేందుకు ఈ ఉత్తర్వులు అవకాశాన్నిచ్చాయి.