మరింత అనువుగా పనిని చేయడం ఎలా?... ఇదో ప్రశ్న. నిత్యం పీసీతో పని చేసే వారి మదిలో మెదులుతూనే ఉంటుంది. వాడుతున్న సాఫ్ట్‌వేర్‌లపై ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. దగ్గరి దార్లు వెతుకుతుంటారు. ఈ నేపథ్యంలో ఫైర్‌ఫాక్స్ వాడే యూజర్లు అనేక చిట్కాల్ని ప్రయత్నించొచ్చు. నచ్చిన వాటిని బ్రౌజర్‌కి జత చేసుకుని వాడుకోవచ్చు. ఉదాహరణకు ఏవైనా వెబ్ సర్వీసుల్ని తెరపై కావాల్సిట్టుగా సెట్ చేసుకుని అన్నింటినీ ఒకేసారి చూస్తూ పని చేసుకోవచ్చు. అందుకో ప్రత్యేక యాడ్‌ఆన్ సిద్ధంగా ఉంది. యూట్యూబ్‌లో వీడియోలు చూసేప్పుడు ఆటోమాటిక్‌గానే హైక్వాలీటీ వీడియోలు ఓపెన్ అవుతాయి. ఇలా చెప్పాలంటే చాలానే ఉన్నాయి. అవేంటో కాస్త వివరంగా తెలుసుకుందాం!ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని సార్లు జీమెయిల్, ఫేస్‌బుక్‌ని ఒకేసారి చూడాలనుకుంటాం. రెండిటిలోని స్నేహితులతో ఒకేసారి ఛాట్ చేయడానికి వీలుపడుతుందేమో అని ప్రయత్నిస్తాం. కొంత మంది విజయం సాధించి ఉంటారు. కానీ, అది క్లిష్టమైన ప్రక్రియే. చాలా సులువుగా ఒకటి కంటే ఎక్కువ ట్యాబ్‌లను తెరపై ఒకేసారి చూస్తూ పని చేసేందుకు అనువైన యాడ్‌ఆన్ ఒకటుంది. అదే ఫైర్‌ఫాక్స్ యాడ్‌ఆన్స్ స్టోర్ నుంచి పొందొచ్చు. రౌజర్‌కి యాడ్ చేయగానే అడ్రస్‌బార్ పక్కనే అదనపు ఐకాన్ గుర్తు కనిపిస్తుంది. పక్కనే ఉన్న పాయింటర్‌పై క్లిక్ చేసి ఓపెన్ చేసిన ట్యాబ్ విండోలోను కావాల్సినట్టుగా తెరపై సెట్ చేసుకోవచ్చు. అందుకు మెనూలో వివిధ రకాల 'ట్యాబ్ లేఅవుట్స్' ఉన్నాయి. ట్యాబ్‌లను తెరకు నిలువు, అడ్డంగా పెట్టుకునే వీలుంది. ఒకవేళ ఓపెన్ చేసిన అన్ని ట్యాబ్‌లను నిలువుగా సెట్ చేసుకునేందుకుసెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ లేఅవుట్ అక్కర్లేదు అనుకుంటే మెనూలోకి వెళ్లి 'క్లోజ్ లేవుట్'పై క్లిక్ చేయాలి. 'ఆప్షన్స్'ని మార్చుకుని ట్యాబ్ లేఅవుట్‌లో మార్పులు చేసుకునే వీలుంది. ఖాళీ దొరికితే టీవీ ఛానల్స్ చూస్తామో లేదో తెలియదుగానీ... యూట్యూబ్ ఛానల్‌ని తప్పక ఓపెన్ చేస్తాం. మీకు తెలుసుగా? యూట్యూబ్‌లో ఏదైనా వీడియోని ఓపెన్ చేస్తే డీఫాల్ట్‌గా మీడియం క్వాలిటీతో ప్లే అవుతుంది. తర్వాత ఒకవేళ హెచ్‌డీ క్వాలిటీలో చూడాలనుకుంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి పిక్సల్స్ క్వాలిటీని మార్చుకోవాలి. ఇవేం లేకుండా ఒక బుల్లి యాడ్‌ఆన్‌తో యూట్యూబ్ వీడియో క్వాలిటీని కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. ఎక్స్‌టెన్షన్ని బ్రౌజర్‌కి యాడ్ చేయగానే టూల్‌బార్‌లో లోగో కనిపిస్తుంది. ఇక మీదట యూట్యూబ్‌లో వీడియోని ఓపెన్ చేస్తే హెచ్‌డీ క్వాలిటీతో ఓపెన్ అవుతుంది. ఇక టూల్‌బార్‌లోని మెనూ ద్వారా మరింత అనువుగా వీడియోని చూడొచ్చు. ప్లే అవుతున్న వీడియోని తెరపై పెద్దగా చూడలంటే... మెనూలోని ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. 'ఫుల్‌స్క్రీన్'లో చూసేందుకు వీడియోపై డబుల్‌క్లిక్ చేయాలి. నెట్ కనెక్షన్ స్పీడ్ ఆధారంగా వీడియో క్వాలిటీని నుంచి కి సెట్ చేయవచ్చు. ఆలస్యం దేనికి లింక్‌లోకి వెళ్లండి. బ్రౌజింగ్ హిస్టరీగానీ, ఎలాంటి కీవర్డ్స్‌గానీ ఇతరుల కంట పడకూడదు అనుకుంటే ప్రైవేటు బ్రౌజింగ్ చేస్తుంటాం. అందుకు బ్రౌజర్‌లోనే 'ప్రైవేటు విండో' ఆప్షన్ ఉంది. దాన్ని ఎంపిక చేసుకుంటే ఏకంగా బ్రౌజర్ మరో కొత్త విండోలో ఓపెన్ అవుతుంది. అలాకాకుండా అన్ని ట్యాబ్‌ల మాదిరిగానే ప్రైవేటు బ్రౌజింగ్ కోసం 'ప్రైైెవేటు ట్యాబ్'ని ఓపెన్ చేసుకుంటే? అందుకు మార్గమే యాడ్‌ఆన్. బ్రౌజర్‌ని యాడ్ చేశాక రీస్టార్ట్ చేయక్కర్లేదు.బ్రౌజర్‌లోని ఫైల్ మెనూలోకి వెళ్తే అదనంగా 'న్యూ ప్రైవేట్ ట్యాబ్' మెనూ కనిపిస్తుంది. క్లిక్ చేస్తే సరి. ఒకవేళ షార్ట్‌కట్‌తో ఓపెన్ చేద్దాం అనుకుంటే మీటల్ని కలిపి నొక్కండి. యాడ్‌ఆన్ కోసం లింక్‌లోకి వెళ్లండి. వెబ్ విహారంలో కావాల్సిన కొన్ని వెబ్ పేజీలను ప్రింట్‌లు తీస్తుంటాం. కానీ, పేజీల్లో అక్కర్లేని కంటెంట్ ఉంటుంది. అలాగే, ప్రింట్‌లు తీస్తే ప్రింటర్ క్యాట్రిడ్జ్ వృథానే కదా! మరి, దీనికి పరిష్కారం లేదనుకోవద్దు. అందుకో ప్రత్యేక యాడ్‌ఆన్ ఉంది. కావాలంటే ప్రయత్నించండి. బ్రౌజర్‌కి యాడ్ చేయగానే టూల్‌బార్‌లో ప్రత్యేక ఐకాన్ గుర్తు కనిపిస్తుంది. ఇక మీరు ఏదైనా వెబ్ పేజీని ప్రింట్ తీయాలనిపిస్తే అదే పేజీలో ఉండి 'ప్రింట్ ఎడిట్' గుర్తుపై క్లిక్ చేసి పేజీ మొత్తం ప్రివ్యూ కనిపిస్తుంది. ఇక పాయింటర్‌తో అక్కర్లేని వాటిని డిలీట్ చేయవచ్చు. సెలెక్ట్ చేసేందుకు మౌస్‌తో డ్రాగ్ చేయాలి. డిలీట్ చేయడం ఎందుకు అనుకుంటే చేయవచ్చు. టెక్స్ట్‌కి ఉన్న ఫార్మెట్స్‌ని తీసేందుకు 'ఫార్మెట్' మెనూలోకి వెళ్లండి. పొరబాటున డిలీట్ చేస్తే చేసుకునే వీలుంది. యాడ్‌ఆన్‌ని ప్రయత్నించాలనుకుంటే లింక్‌లోకి వెళ్లండి. ఇంట్లో తాతయ్యకు బ్రౌజర్ మెనూలు కనిపించడం లేదా? డీఫాల్ట్‌గా ఉన్న ఫాంట్ చదివేందుకు అనువుగా లేదా? అయితే మార్చేయండి. అదెలా సాధ్యం? అందుకు తగిన యాడ్‌ఆన్ సిద్ధంగా ఉంది. అదే బ్రౌజర్‌కి యాడ్ చేసి రీస్టార్ట్ చేయాలి. ఇప్పుడు టూల్‌బార్‌లో ఐకాన్ గుర్తు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఫాంట్ మెనూలోని ఉన్న ఫాంట్ స్త్టెల్ సెలెక్ట్ చేయగానే బ్రౌజర్‌లో మారిపోతుంది. అలాగే, సైజు మెనూ ద్వారా మెనూల్లోని టెక్స్ట్ పరిమాణాన్ని పెంచుకునే వీలుంది. టెక్స్ట్ రంగు, బ్యాక్‌గ్రౌండ్‌ని కూడా మార్చుకునే వీలుంది. అక్కర్లేదు అనుకుంటే తిరిగి 'నార్మట్' సెట్టింగ్స్‌ని మార్చుకోవచ్చు. కొన్ని సైట్‌ల్లో రైట్‌క్లిక్‌ని కట్టడి చేస్తుంటారు. టెక్స్ట్‌ని సెలెక్ట్ చేయడానికి వీలు పడదు. రైట్‌క్లిక్ చేసి కాపీ, పేస్ట్ ఆప్షన్లను యాక్సెస్ చేయడం సాధ్యపడదు. అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి? రైట్‌క్లిక్‌ని వాడలేమా? ఏం కాదు... ఎక్స్‌టెన్షన్‌తో చిటికెలో సాధ్యం. కావాలంటే లింక్‌లోకి వెళ్లండి. బ్రౌజర్ స్టార్ట్ పేజీలోనే స్పీడ్ డయల్ ట్యాబ్‌లతో పాటు బుక్‌మార్క్‌లను సింక్రనైజ్ చేసుకుని మేనేజ్ చేసుకునేందుకు ఎక్స్‌టెన్షన్ని వాడొచ్చు. మీ ఫొటోలను పేజీ బ్యాక్‌గ్రౌండ్‌గా పెట్టుకోవచ్చు. బ్రౌజర్ ఎడిట్ మెనూలోని 'కాపీ' ఆప్షన్‌తో కాపీ చేస్తే టెక్స్ట్‌కి ఉన్న అన్ని ఫార్మెట్‌లూ కాపీ అవుతాయి. అలా కాకుండా వెబ్ పేజీల్లోని టెక్స్ట్ మేటర్‌ని ఎలాంటి ఫార్మెట్‌లు అప్లె కాకుండా కాపీ చేయవచ్చు. అందుకు ఎక్స్‌టెన్షన్‌ని ఫైర్‌ఫాక్స్‌కి యాడ్ చేయండి. తర్వాత ఎడిట్ మెనూలోకి వెళ్లి చూస్తే ఆప్షన్ కనిపిస్తుంది. షార్ట్‌కట్ ద్వారా చేయాలంటే మీటల్ని వాడొచ్చు. ఓపెన్ చేసి ఉన్న ట్యాబ్‌ల్లోకి వెళ్లకుండానే ప్రివ్యూ చూడొచ్చా? యాడ్‌ఆన్‌తో చూడొచ్చు. దీన్ని బ్రౌజర్‌కి జత చేసిన తర్వాత పాయింటర్‌ని ట్యాబ్‌పై ఉంచగానే అక్కడే 'పాప్‌అప్' మెనూ మాదిరిగా ప్రివ్యూ విండో కనిపిస్తుంది. విండోపై రైట్‌క్లిక్ చేస్తే జూమ్ అవుతుంది కూడా. ప్రివ్యూ విండో నుంచే ట్యాబ్‌ని 'రీఫ్రెష్' చేయవచ్చు. బ్రౌజర్‌లోని మెమొరీని ఒకే క్లిక్కుతో తొలగించొచ్చు. అందుకు బటన్‌ని వాడొచ్చు. బ్రౌజర్‌ని జత చేయగానే ఐకాన్ గుర్తు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే సరి.