Monday, September 9, 2013

హిస్టరీ - జాగ్రఫీ


సివిల్స్ మెయిన్స్ పేపర్ - 2
సివిల్ సర్వీసెస్ 2013 మెయిన్స్ పరీక్షా విధానంలో మార్పులు చేసిన నేపధ్యంలో డిసెంబర్‌లో జరుగబోయే రాత పరీక్షలకు గైడెన్స్ అందిస్తున్నాం. గతవారం పేపర్-1 జనరల్ ఎస్సే పై మార్గదర్శక వ్యాసం అందించాం. ఈవారం పేపర్-2 హిస్టరీ - జాగ్రఫీ పై విశ్లేషణ అందిస్తున్నాం.యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ నూతనంగా ప్రవేశ పెట్టిన సిలబస్‌లో జనరల్‌స్టడీస్ పేపర్ల సంఖ్యను (గతంలో రెండు) నాలుగుకు పెంచింది. (4x250=1000 మార్కులు) అందువల్ల అభ్యర్థులు జనరల్‌స్టడీస్ ప్రిపరేషన్‌లో మరింత విస్తృతంగా చదవాల్సిన అవసరం ఉంది. గతంలో రెండు ఆప్షనల్స్ ఉండటం వల్ల (600x 2=1200 మార్కులు) జనరల్ స్టడీస్‌లో (600 మార్కులు) 50శాతం మార్కులు వచ్చినప్పటికి ఆప్షనల్స్‌లో టాప్ స్కోర్ రావడం వల్ల ఎక్కువ మంది అంతిమంగా విజయం సాధించడమే కాకుండా మంచి సర్వీసులు కూడా పొందారు. ఆప్షనల్స్ స్కోర్ విషయంలో తీవ్ర వ్యత్యాసం ఉండటం వల్ల కేవలం కొన్ని పాపులర్ ఆప్షనల్స్‌ను తీసుకున్న అభ్యర్థులే విజేతలవ్వడం మిగతా వారికి అవకాశం లేకపోవడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న యు.పి.ఎస్.సి అందరికి సమాన అవకాశాలను కల్పించే ఉద్దేశంతో జనరల్ స్టడీస్ రూపంలో కామన్ పేపర్లను ప్రవేశపెట్టింది.
జనరల్ స్టడీస్-1 (250 మార్కులు)
జనరల్‌స్టడీస్-1లో చరిత్ర పపంచ చరిత్ర కూడా) సంస్కృతి సమాజం. అదే విధంగా జాగ్రఫికి సంబంధించి ప్రపంచ భౌగోళిక పరిస్థితులు, సహజ విపత్తుల గురించి పేర్కొన డం జరిగింది. భారతీయ సంస్కృతికి సంబంధించి ప్రాచీన కాలం నుండి ఆధునిక యుగం వరకు వివిధ కళల రూపాలు, సాహిత్యం, వాస్తు శిల్పం గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి.
లలిత కళలు
మానవ సంస్కృతి వికాస చరిత్రలో సంగీతం, నాట్యం, చిత్రలేఖనం శిల్పం, కవిత్వాలను లలితకళలుగా పేర్కొన్నారు. సంగీతం ప్రకృతి నుండే పుట్టిందని, నారద పరివ్రాజక ఉపనిషత్తు సప్తస్వరాలను వివరించింది. ఇక భారతదేశంలో శాస్త్రీయ-జానపద నృత్యాలన్నీ క్రీ.శ. 2వ శతాబ్దంలో భరత మునిచే క్రోడీకరించబడిన భరతనాట్య శాస్త్రం నుండే ఆవిర్భవిం చాయి. చిత్రకళకు సంబంధించి అజంతా చిత్రకళ మొదలు ఆధునిక చిత్రక శైలి వరకు అనేక మార్పులకు లోనయ్యింది. వాస్తు శిల్ప కళా చరిత్ర సుదీర్ఘమైంది. అవసరాలను బట్టి దేవాలయాల వాస్తు శిల్పకళా చరిత్ర సుదర్ఘీమైంది. అవసరాలను బట్టి దేవాలయాల వాస్తు శిల్పకళ శైలుల్లో అనేక మార్పులు కలిగాయి.
ప్రశ్నల స్వరూపం
1. List out the classical dance forms of India as per the Sangeet Natak Academi (2011,50 words, 4 marks)
2. What are the groups into which musical instruments in India have traditionally been classified? (2012, 50 words, 5 marks)
ఆధునిక భారతదేశ చరిత్ర
ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి 18వ శతాబ్దం మధ్యభాగం నుండి ఇప్పటి వరకు జరిగిన ముఖ్యమైన చారిత్రక సంఘటనలు గురించి తప్పని సరిగా చదవాల్సి ఉంటుంది. ఇందులో మొదటి భాగంలో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ముఖ్యమైన నాయకులు, జరిగిన ఉద్యమాలు. వాటికి కారణాలు, ఫలితాలు ప్రశ్నలుగా రావడానికి అవకాశముంది.
ఉదా ః
1. The Indian Independence Movement was a mass based Movement that encompassed various sections of society, It also underment the process of constant ideological evolution. critically examine. (2012, 250 words,25marks)
రెండవ భాగంలో స్వాతంత్య్రానంతరం జరిగిన పరిణామా లు ముఖ్యంగా భారత్ యూనియన్‌లో సంస్థానాల విలీనం, రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ (consolidation and reorganisation) చిన్న రాష్ట్రాల డిమాండ్, హరిత విప్లవం గ్రామీణా భివృద్ధి వ్యూహాలు, ఆర్థిక సంస్కరణల గురించి విభిన్న కోణాల్లో ప్రశ్నలు రావడానికి అవకాశముంది.
భారతీయ సమాజం మౌలిక లక్షణాలు, భిన్నత్వంలో ఏకత్వం, మహిళల పాత్ర, మహిళా సంస్థలు, జనాభా సంబంధిత అంశాలు, పేదరికం, అభివృద్ధి సంబంధిత అంశాలు, పట్టణీకరణ సమస్యలు, వాటికి పరిష్కారాలు వంటి అంశాలను సిలబస్‌లో పేర్కొన్నారు కాబట్టి సమకాలీన అంశాలుగా ఈ అంశాలు ఎక్కువగా చర్చలో ఉన్నందున ప్రశ్నలు వివిధ రకాలుగా రావడానికి అవకాశముంది.
ఉదా ః
1. Evaluate the influence of the three important women’s organisations of the early twentieth century in India or the country’s society and Politics. To what extent do you think were the social objectives of these organisations constrained by their political objectives? (2011-250 words, 20 Marks)
2. The significance of Counter-Urbanisation in the improvement of Metropolitan cities in India (2011, 150 words, 12 Marks)
ప్రపంచీకరణ
స్వాతంత్య్రానంతరం భారతదేశ సామాజిక ఆర్థిక రాజకీయ పరిపాలనా వ్యవస్థలను పూర్తిగా మార్చివేసిన సంఘటన 1991 నాటి ఆర్థిక సంస్కరణలు కాబట్టి ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ ప్రభావం భారత దేశ సమాజంపై ఏ విధంగా పడిందో క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ప్రపంచీకరణ మొత్తం ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చినందున దేశీయ ఆర్థిక అవసరాల దృష్ట్యా అనివార్యంగానే భారత ప్రపంచీకరణలో భాగస్వామి అయినందున దీని ప్రభావం భారతీయ సమాజంపై ఎక్కువగా కనపడుతున్నది.
ఉదా ః
1. Why is international trade perceived to have failed to act as an engine of growth in many developing countries including India (2012,100 words, 10 marks)
2. Discuss the Globalisation of R&D and its inpact on Indias development provide an illustration from at least one sector such as Information Technology or Health. (2012, 250 words, 25 Marks)
ఛాలెంజింగ్ అంశాలు
సామాజిక సాధికారత (Social empowerment) మతతత్వం (Communalism) ప్రాంతీయతత్వం (Regionalism) మరియు లౌకిక వాదం (Secularism) వంటి అంశాల గురించి సిలబస్‌లో పేర్కొన్నారు కాబట్టి. వీటికి సంబంధించిన చారిత్రక నేపధ్యాన్ని (Historical background) రాజ్యాంగ పరంగా మత, కుల, ప్రాంతీయ పరంగా అసమానతల తొలగింపుకు జరుగుతున్న కృషి, ప్రభుత్వాలు చట్ట పరంగా, విధానాల ప్రాతిపదికన వీటి పరిష్కారానికి అవలంభిస్తున్న వ్యూహాల గురించి తెలుసుకోవాలి. అఖిల భారత సర్వీసులు (ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్,ఐ.ఎఫ్.ఎస్) దేశ సమగ్రతను కాపాడ టంలో క్రీయాశీల పాత్ర పోషిస్తాయి కాబట్టి ఈ అంశాల గురించి తప్పనిసరిగా ప్రశ్నలు రావడానికి అవకాశముంది.
ఇక ప్రపంచ చరిత్రకు సంబంధించి 18వ శతాబ్దం నుండి జరిగిన ప్రపంచ సంఘటనలైన పారిశ్రామిక విప్లవం, ప్రపంచ యుద్ధాలు, వలసవాదం, కమ్యూనిజం, పెట్టుబడిదారీ విధానం, (Capitalism), సామ్యవాదం (Socialism) రూపాలు మరి యు సమాజంపై వీటి ప్రభావం గురించి విభిన్న అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ సంఘటనలకు భారతదేశ చరిత్రకు ప్రత్యక్ష సంబంధమున్నందున, అంతర్జాతీయ సంఘటనలను దేశీ య సంఘటనలతో అనుసంధానం చేస్తూ చదవడం మంచింది.
వరల్డ్ జాగ్రఫీ- ప్రత్యేక అంశం
ఇప్పటి వరకు వరల్డ్ జాగ్రఫీని ప్రిలిమ్స్‌లో అబ్జెక్టివ్ బిట్స్ రూపంలోనే అడిగేవారు. అయితే మారిన విధానంలో ఈ విభాగం నుండి విశ్లేషణాత్మక, డిస్క్రిప్టివ్ విధానంలో ప్రశ్నలు రానున్నాయి కాబట్టి అభ్యర్ధులు దీన్ని ప్రత్యేకంగా ప్రిపేర్ కావాలి. ప్రపంచ వ్యాప్తంగా సహజ వనరుల విస్తరణ (దక్షిణాసియా మరియు భారత ఉప ఖండంతో సహ), భారత్ తో సహ ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ప్రాధమిక, ద్వితీయ, తృతీయ స్థాయి పరిశ్రమల స్థాపనకు దోహదపడిన కారకాల గురించి విస్తృతంగా తెలుసుకోవాలి.
ఉదా ః
1. List out the Central Asian Republics and Identify those of particulor strategic and economic Importance to India. Examine the opportunities and bottlenecks in enhancing relations with these countries? (2011,250 words, 20 Marks)
భౌగోళిక కారణాలు, కారకాలు, సహజ క్రియల ఫలితంగా సంభవించే విపత్తులైన భూకంపాలు, సునామీ, అగ్ని పర్వతాలు బద్దలవ్వడం, తుఫానులు వంటి వాటి గురించి సమగ్ర సమాచారాన్ని కలిగి ఉండాలి.
ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్, శీతోష్ణస్థితిలో మార్పు వలన దృవప్రాంతాలు కరిగి పోవడం, సముద్ర మట్టం పెరిగిపోవడం, జంతు, వృక్ష జాతులు ప్రభావితం కావడం వంటి అంశాల నుండి కూడా ఎక్కువగా ప్రశ్నలు రావడానికి అవకాశముంది. విపత్తు నిర్వహణ (Disaster Management) పరంగా వీటి గురించి ఎక్కువ సమాచారాన్ని తెలుసుకొనేందుకు ప్రయత్నించాలి.
పదపరిమితి కీలకం
మారిన నూతన విధానంలో జవాబు పత్రంలోనే ప్రశ్నను ఇచ్చి దాని కింద ఎన్ని పదాల్లో సమాధానాన్ని రాయాలో నిర్ణయించి తదనుగుణంగా నిర్థిష్టమైన ఖాళీ స్థలాన్ని మాత్రమే వదులుతారు కాబట్టి ప్రిపరేషన్ మరింత పటిష్టంగా ఉండాలి. అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం రాయాలి తప్ప దాని పూర్ణ చరిత్ర, అనుబంధ సమాచారం రాయకూడదు. ఒక లైన్‌లో సగటున 10 పదాలు రాయడానికి అవకాశముంది కాబట్టి, 150 పదాలను 15 లైన్‌లలో రాస్తే 15 మార్కులు Attempt చేసినట్లు. సమాధా నంలో ఖచ్చితత్వం, ప్రశ్నలో అడిగిన అన్ని భాగాలను స్పృశించగలిగితే ప్రతి సమాధానానికి సగటున 70-80 శాతం వరకు మార్కులు రావడానికి అవకాశముంది.