ముంబయిలోని నేషనల్ బ్యాంక్ ఫర్
అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) దేశవ్యాప్తంగా ఉన్న
శాఖల్లో 102 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన చేసింది
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్,
సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల
ఆధారంగా ఎంపిక చేస్తారు.
మొ త్తం 102 ఉద్యోగాల్లో అన్‌రిజర్వుడ్‌కు 46, ఓబీసీలకు 26, ఈడబ్ల్యూఎస్‌లకు 9, ఎస్సీలకు 11, ఎస్టీలకు 10 కేటాయించారు.
జనరల్, చార్టర్డ్ అకౌంటెంట్, ఫైనాన్స్, కంప్యూటర్/ ఇన్ఫర్మేషన్
టెక్నాలజీ, అగ్రికల్చర్, యానిమల్ హజ్బెండరీ, ఫిషరీస్, ఫుడ్ ప్రాసెసింగ్,
ఫారెస్ట్రీ, ప్లాంటేషన్ అండ్ హార్టికల్చర్, జియో ఇన్ఫర్మేటిక్స్,
డెవలప్మెంట్ మేనేజ్మెంట్, స్టాటిస్టిక్స్, సివిల్ ఇంజినీరింగ్,
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్/ సైన్స్,
హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, రాజ్‌భాష విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: జనరల్ విభాగంలో పోస్టులకు ఏదైనా డిగ్రీ 60 శాతం మార్కులతో
పాసవ్వాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీలకు 55 శాతం సరిపోతుంది. లేదా
ఎంబీఏ/ పీజీడీఎం 55 శాతం, ఎస్సీ/ఎస్టీలు 50 శాతం మార్కులతో పాసవ్వాలి.
దరఖాస్తు చేసే విభాగాన్ని బట్టి సంబంధిత డిగ్రీని 60 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీలకు 55 శాతం సరిపోతుంది.
01.07.2024 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో
ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పది నుంచి
పదిహేనేళ్ల సడలింపు ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీలకు దరఖాస్తు ఫీజు
రూ.150. ఇతరులకు రూ.850.
ప్రిలిమినరీ పరీక్ష
ప్ర శ్నపత్రం హిందీ/ ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. మొత్తం మార్కులు 200.
టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 20 ప్రశ్నలు - 20 మార్కులు, ఇంగ్లిష్
లాంగ్వేజ్ 30 ప్రశ్నలు - 30 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ 20 ప్రశ్నలు -
20 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 20 ప్రశ్నలు - 20 మార్కులు,
డెసిషన్ మేకింగ్ 10 ప్రశ్నలు - 10 మార్కులు, జనరల్ అవేర్నెస్ 20
ప్రశ్నలు - 20 మార్కులు, ఎకో అండ్ సోషల్ ఇష్యూస్ (విత్ ఫోకస్ ఆన్
రూరల్ ఇండియా) 40 ప్రశ్నలు - 40 మార్కులు, అగ్రికల్చర్ అండ్ రూరల్
డెవలప్మెంట్ విత్ ఎంఫసిస్ ఆన్ రూరల్ ఇండియా 40 ప్రశ్నలు - 40
మార్కులు.
- టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్,
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డెసిషన్ మేకింగ్.. క్వాలిఫైయింగ్ సెక్షన్
కిందికి వస్తాయి.
- జనరల్ అవేర్నెస్, ఎకో అండ్ సోషల్ ఇష్యూస్, అగ్రికల్చర్ అండ్
రూరల్ డెవలప్మెంట్.. మెరిట్ సెక్షన్ కిందికి వస్తాయి. ఈ సెక్షన్
మార్కుల ఆధారంగానే మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు.
- జనరలిస్ట్, స్పెషలిస్ట్, రాజ్‌భాషా పోస్టులకు మెయిన్స్ పరీక్ష వేర్వేరుగా ఉంటుంది.
- ప్రిలిమినరీని నిర్దేశించిన పరీక్ష కేంద్రాల్లో ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఈ వివరాలను కాల్ లెటర్ ద్వారా తెలియజేస్తారు.
ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాలు:
ఆంధ్రప్రదేశ్‌లో: శ్రీకాకుళం, గుంటూరు/విజయవాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, విజయనగరం.
తెలంగాణలో: హైదరాబాద్/సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్.
సన్నద్ధత
- బీఎస్ఆర్బీ, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ పరీక్షల పాత ప్రశ్నపత్రాల సాధన వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చు.
- మాక్ టెస్టులు రాస్తూ బలాబలాను సమీక్షించుకోవచ్చు. వెనకబడి ఉన్న అంశాలకు అదనపు సమయాన్ని కేటాయించాలి.
- టైమ్‌టేబుల్ వేసుకుని దాన్ని కచ్చితంగా అమలుచేయాలి. కొంత సమయాన్ని విషయావగాహనకు, మరికొంత సమయాన్ని ప్రశ్నపత్రాల సాధనకు కేటాయించాలి.
- జనరల్ అవేర్నెస్, ఎకో అండ్ సోషల్ ఇష్యూస్, అగ్రికల్చర్ అండ్
రూరల్ డెవలప్మెంట్ అంశాలకు ఎక్కువ మార్కులు కేటాయించారు. అందుకే
ప్రధానంగా వీటిపైన దృష్టి పెట్టాలి.