Friday, September 20, 2024

ఎలక్ట్రిక్ సైకిల్స్‌ లాంచ్‌ చేసిన TATA Stryder .. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 కి.మీ నడపొచ్చు.. ధర, ఫీచర్లు ఇవే!

 

 


TATA E-Bike: ఎలక్ట్రిక్ సైకిల్స్‌ లాంచ్‌ చేసిన TATA Stryder .. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 కి.మీ నడపొచ్చు.  ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ ట్రెండ్ క్రమంగా ఊపందుకుంటోంది. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతూ ఉండటంతో పాటు.. కాలుష్యం కారణంగా ఇప్పుడు వినియోగదారులు ఎలక్ట్రిక్ సైకిళ్లను కూడా విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో..

TATA EV Electric Cycle : ప్రస్తుతం మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల (Electric Vehicles) వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా కార్లు, బైక్‌లకు డిమాండ్ అధికంగా ఉంటోంది. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతూ ఉండటంతో పాటు దాని వల్ల కలిగే కాలుష్యం కారణంగా ఇప్పుడు వినియోగదారులు ఎలక్ట్రిక్ వెహికల్స్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పలు కంపెనీలు ఇప్పుడు కొత్త సైకిళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. తాజాగా టాటా Stryder సంస్థ మరో రెండు మోడళ్లను లాంచ్ చేసింది. 'వోల్టిక్ X', 'వోల్టిక్ GO' పేరిటి రెండు కొత్త వేరియంట్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

ధర- ఫీచర్లను పరిశీలిస్తే..
వోల్టిక్ X ప్రారంభ ధర రూ.32,495 గా ఉంది. వోల్టిక్ GO ధర రూ.31,495గా నిర్ణయించారు. అసలు ధరపై 16 శాతం తగ్గింపు ఇస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ వోల్టిక్ X, వోల్టిక్ GO ఎలక్ట్రిక్ సైకిళ్లు 48V అధిక సామర్థ్యం, స్ల్పాష్ ప్రూఫ్ బ్యాటరీని కలిగి ఉంటాయి. ఈ బ్యాటరీలు ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం కలిగి ఉంటాయి. ఈ బ్యాటరీలను కేవలం మూడు గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 కి.మీ. నడపొచ్చని సంస్థ పేర్కొంది.

అయితే.. వోల్టిక్ GO సౌకర్యం, సౌలభ్యం కోరుకునే రైడర్‌ల కోసం తయారు చేశారు. దీని స్టెప్-డౌన్ ఫ్రేమ్ డిజైన్ మహిళా రైడర్‌లను ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. ఇప్పుడు వోల్టిక్ X ఎలక్ట్రిక్ సైకిళ్లు పట్టణ ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న కొండల మీదకు ఎక్కేలా.. సస్పెన్షన్ ఫోర్క్‌తో రూపొందించారు. ఇక.. ఈ రెండు మోడల్స్ బ్యాటరీపై రెండేళ్ల వారంటీ ఉంటుంది. మెరుగైన భద్రత కోసం ఆటోమేటిక్ పవర్ కట్ ఆఫ్‌తో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు కూడా ఉన్నాయి.

2012లో Stryder ప్రారంభం:
ఈ స్ట్రైడర్ (Stryder) సైకిల్ కంపెనీ టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్ (TIL) యాజమాన్యంలోని అనుబంధ సంస్థ. 2012లో ప్రారంభమైనప్పటి నుండి స్ట్రైడర్ భారతదేశం అంతటా 4,000 స్టోర్‌లకు పైగా ఓపెన్‌ చేసింది. ఇతర దేశాల్లోనూ దీనికి ఎగుమతులు ఉన్నాయి. అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. టాటా గ్రూప్ నాణ్యతలాగే మంచి ఆవిష్కరణలతో స్ట్రైడర్ సైకిళ్లను అందిస్తుంది. ఇది ఎలక్ట్రిక్ సైకిళ్లు, ఎంటీబీ, జూనియర్, లేడీస్, రోడ్‌స్టర్ సైకిళ్లతో సహా అనేక రకాల సైకిళ్లను విక్రయిస్తుంది.

గత ఏడాది ఈ టాటా స్ట్రైడర్ (Tata Stryder) ఎలక్ట్రిక్ సైకిల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. అదే టాటా స్ట్రైడర్ జీటా ప్లస్ (Tata Stryder Zeeta Plus E). ఇది ఒక బడ్జెట్ ఎలక్ట్రిక్ సైకిల్. ఈ సైకిల్‌లో కంపెనీ 250W బీఎల్డీసీ మోటార్‌ను ఉపయోగించింది. ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ పని చేయగలదు. ఈ సైకిల్‌లో 36V-6Ah బ్యాటరీ ప్యాక్ అందించారు. ఇది 216 డబ్ల్యూహెచ్ పవర్ అవుట్‌పుట్‌ను ఇస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 30 కిలోమీటర్ల వరకు ఈ సైకిల్ ప్రయాణించగలదు. గంటకు 25 కిలోమీటర్లు దీని టాప్ స్పీడ్. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ సైకిల్‌లో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లను అందించింది. దీని కారణంగా ఈ సైకిల్‌ను బాగా కంట్రోల్ చేయొచ్చు.