మైనర్ గా వున్నపుడు ప్రారంభమైన కథ మేజర్ గా మారినపుడు జానీ మాస్టర్ కు మేజర్ డామేజ్ చేసింది.
పవన్ కళ్యాణ్ జానీ సినిమా కథ కాదు. డ్యాన్స్ మాస్టర్ జానీ ప్రేమకథ ఇది.
ప్రేమల్లో రకాలు వుంటాయి. బ్రేకప్ అయితే మూవ్ అన్ అనుకునే వాళ్లు వుంటారు.
పిచ్చోళ్లు అయిపోయే వాళ్లు వుంటారు. పగతీర్చుకునే వాళ్లు ప్రేయసిని
చంపుకునే వాళ్లు వుంటారు. ఇదంతా ఎవరి మనసత్వం మేరకు, వారి మనసుకు తగిలిన
గాయం మేరకు వుంటుంది. ఇలాంటి వ్యవహారాల్లో విపరీత సంఘటన జరిగినపుడు, అ
సంఘటన కనిపిస్తుంది తప్ప, తగిలిన గాయం, దాని నేపథ్యం తెలియదు. అలా
తెలిసినపుడు అయ్యో అనిపిస్తుంది. మరీ పిచ్చోడా ఏమిటి? అని కూడా కామెంట్
చేయాలనిపిస్తుంది.
వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న డ్యాన్స్ డైరక్టర్ జానీ మాస్టర్ వెనుక కూడా ఇలాంటి భావోద్వేగ ప్రేమ కథ దాగి వుందని టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. కళాకారులు సాధారణంగా కాస్త భావావేశం పాలు ఎక్కువ కలిగి వుంటారు. అందుకేనేమో సినిమాల్లోనే కాదు, సినిమా రంగంలో కూడా ప్రేమ కథలే ఎక్కువ వుంటాయి.
ఓ డ్యాన్స్ షో లో చూసినపుడే జానీ మాస్టర్ ఆ అమ్మాయితో వన్ సైడ్ లవ్ లో పడిపోయినట్లు కనిపిస్తోంది. తన దగ్గర అవకాశం ఇచ్చాడు. ఇద్దరూ దగ్గరయ్యారో, జానీ మాస్టర్ బలవంతంగా దగ్గర చేసుకున్నాడో మొత్తానికి కలిసారు. చాలా మంది చాలు ‘పనైపోయింది’ ఎలాగో అలా వదిలించేసుకుంటే చాలు అనుకుంటారు. అవతలి వాళ్లు కూడా కెరీర్ కోసం కలిసాం.. పనైపోయింది అని.. బై..బై చెప్పడానికి పెద్దగా బాధపడరు.
కానీ జానీ మాస్టర్ వేరు. తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలనుకున్నాడని తెలుస్తోంది. అక్కడే కథ అడ్డం తిరిగింది. ఎంతయినా తన భర్త తను వుండగా మరో పెళ్లి చేసుకుంటా అంటే ఏ మహిళా అంగీకరించదు. జానీ మాస్టర్ దగ్గరా అదే జరిగినట్లుంది. కుటుంబంలో చిన్న పాటి తగాదాలు. ఇవన్నీ చూసి అ అమ్మాయి దూరం జరిగింది. అక్కడితో జానీ మాస్టర్ ఆగిపోయి వుంటే కథ ఇంత దూరం వచ్చేది కాదు.
కెరీర్ పీక్ లో వుంది. కానీ జానీ మాస్టర్ కాస్త డ్రిపెషన్ లోకి వెళ్లాడు. అప్పట్లో కొరియోగ్రఫీ చేసిన సినిమాల సెట్ ల్లో జానీ మాస్టర్ డల్ మూడ్ లో కూర్చుని వుండడం చాలా మంది గమనించారు. అది ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. తను డల్ మూడ్ లోకి డిప్రెషన్ మోడ్ లోకి వెళ్తే ఓకె. అక్కడి నుంచి ఆ అమ్మాయి పని చేసే వర్క్ ప్లేస్ కు వెళ్లి, ఆమెను పిలవడం, ఇబ్బంది పెట్టడం, ఎంబ్రాసింగ్ సిట్యు వేషన్ క్రియేట్ చేయడం, ఇది చూసి అవకాశాలు వెనక్కు పోవడం ఇలా రచ్చ.. రచ్చ ప్రారంభమైంది.
దీంతో అమ్మాయి విసిగిపోయింది. ప్రేమించే వాడిని ఇష్టపడుతుంది. ఇబ్బంది పెట్టవాడిని మరింత దూరం పెట్టాలనుకుంటుంది. అదే జరిగింది. ఇలాంటి టైమ్ లో భర్త పిచ్చోడైపోవడం చూసి జానీ మాస్టర్ భార్య ఇక తప్పదని గమనించి పెళ్లికి ఓకె చెప్పినట్లు తెలుస్తోంది. కానీ అలా పెళ్లి జరగాలంటే మతాలు అడ్డు. దానికి మళ్లీ మరో మార్గం. అది కూడా పరిస్థితిని మరింత వికటించేలా చేసింది.
దాంతో కథ మొత్తం సినిమా పెద్దల దగ్గరకు అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు చేరింది. మైనర్ గా వున్నపుడు ప్రారంభమైన కథ మేజర్ గా మారినపుడు జానీ మాస్టర్ కు మేజర్ డామేజ్ చేసింది. ప్రేమావేశాన్ని కంట్రోలు చేసుకోలేకపోవడం అసలు సిసలు తప్పిందం. డ్యాన్స్ షో టైమ్ లోనే ప్రేమావేశాన్ని కంట్రోలు చేసుకుని, జడ్జ్‌గా పెద్దరికంతో వుండిపోయి వుంటే, రేపు కోర్టులో రేప్ కేసు మీద జడ్జ్ ముందు నిల్చునే పరిస్థితి వుండేది కాదు.