తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త!
- వివిధ అర్హతతో సొంత జిల్లా, మండల ఆరోగ్య కేంద్రాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త! చెప్పింది.
- స్టాఫ్ నర్స్ కొలువుల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా 2050 పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ.
- ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని 33 జిల్లాల నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి.
- దరఖాస్తు ప్రక్రియ 28.09.2024 నుండి అందుబాటులోకి వస్తుంది.
- నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసమే ఇక్కడ..
సంఖ్య పోస్టుల వారీగా ఖాళీలు :
- డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ - 1576,
- తెలంగాణ వైద్య విధాన పరిషత్ - 332,
- ఆయుష్ - 61,
- ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ - 01,
- MNJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ & రీజనల్ క్యాన్సర్ సెంటర్ (MNJIO &RCC) - 80.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి జనరల్ నర్సింగ్ మరియు మిడ్-వైఫరీ (GNM)/ బీఎస్సీ నర్సింగ్ అర్హతలు కలిగి ఉండాలి.
- అలాగే తెలంగాణ రాష్ట్ర మెడికల్ బోర్డు నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయో పరిమితి :
01.07.2024 నాటికే 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 46 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
వయో-పరిమితిలో సడలింపులు కోరే అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు తప్పక అధికారిక నోటిఫికేషన్ చదవండి.
అధికారిక నోటిఫికేషన్ Pdf ఈ పేస్ దిగువన అందుబాటులో ఉంది.
ఎంపిక విధానం :
- ఈ పోస్టులకు రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
- రాత పరీక్ష 80 మార్పులకు ఉంటుంది.
- అభ్యర్థి కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్/ రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు సంస్థల్లో అందించిన సేవలకు 20 మార్పులు కేటాయిస్తారు.
- 6 నెలలు గిరిజన ప్రాంతాల్లో సేవలందించిన వారికి 2.5 మార్కులు, గిరిజనేతర ప్రాంతాల్లో సేవలందించిన వారికి 2 పాయింట్లు కేటాయిస్తారు.
- 📌 6 నెలలు పూర్తి గా సేవలందించిన వారికి మాత్రమే ఈ పాయింట్లు కేటాయించబడతాయి.
- ఇలా మొత్తం 100 మార్కుల ప్రాతిపదికన ఎంపికలు ఉంటాయి.
రాత పరీక్ష సెంటర్ల వివరాలు :
- రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు తమ సొంత జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఎంపీక చేసుకోవచ్చు. అవి;
- హైదరాబాద్
- నల్గొండ
- కోదాడ
- ఖమ్మం
- కొత్తగూడెం
- సత్తుపల్లి
- కరీంనగర్
- మహబూబ్నగర్
- సంగారెడ్డి
- ఆదిలాబాద్
- నిజామాబాద్
- వరంగల్
- నర్సంపేట మొదలగునవి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి స్కేల్ ఆఫ్ రూ.36,750/- నుండి రూ.1,06,990/- వరకు రాష్ట్ర ప్రభుత్వ అలవెన్స్ తో కలిపి చెల్లిస్తారు .
దరఖాస్తు విధానం :
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
దరఖాస్తు ఫీజు మరియు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.500+200=700/-.
ఎస్సీ/ ఎస్టీ/ బిసి/ ఈడబ్ల్యూఎస్/ దివ్యాంగులు మరియు మాజీ సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఇతర రాష్ట్రాల వారికి దరఖాస్తు ఫీజు మినహాయింపు లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 28.09.2024.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 14.10.2024 @ 05:00PM.
దరఖాస్తు సవరణ ప్రక్రియ ప్రారంభం & ముగింపు తేదీలు :: 16.10.2024 @ 10:30 AM నుండి 17.10.2024 @ PM.
రాత (కంప్యూటర్ ఆధారిత) పరీక్ష తేదీ :: 17.11.2024.
అధికారిక వెబ్సైట్ :: https://mhsrb.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.