టోక్యో : ప్రపంచంలో సజీవంగా ఉన్న వృద్ధు నిగా జపాన్ విద్యావేత్త సకరి మొమోయ్ గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఈయనకు కవితలంటే మహా ఇష్టం. ఈయన వయసు 111 సంవత్సరా లు. గిన్నిస్ రికార్డుకు సంబంధించిన ధ్రువపత్రాన్ని బుధవారం ఆయన స్వీకరించారు. ఏప్రిల్‌లో మరణించిన న్యూయార్క్‌కు చెందిన అలెగ్జాండర్ ఇమిచ్ తర్వాత మొమోయ్ ఈ రికార్డు సాధించారు. అలెగ్జాండర్ 111 ఏళ్ల 164 రోజులు జీవించారు. ప్రపంచంలో అత్యధిక వయసుగల జీవించి ఉన్న మహిళ కూడా జపాన్‌కు చెందినవారే. మిసావో ఒకావా ఈ రికార్డు సాధించారు. ఒసాకాకు చెందిన ఆమె వయసు 116 సంవ త్సరాలు. మొమోయ్ 1903 ఫిబ్రవరి ఐదున ఫుకుషిమా ప్రిఫెక్చర్‌లో జన్మించారు. అక్కడే ఉపాధ్యాయ వృత్తిని నిర్వహించేవారు. కొంతకాలానికి టోక్యోకు ఉత్తరంగా ఉన్న సైతామాఅనే పట్టణానికి వెళ్లి హైస్కూలు ప్రిన్సిపాల్‌గా పని చేసి, పదవీ విరమణ చేశారు. పుస్తక పఠనం అంటే తనకు చాలా ఇష్టమని, ముఖ్యంగా చైనా కవితలంటే ఆసక్తి ఎక్కువ అని చెప్పారు.