Showing posts with label Study Material. Show all posts
Showing posts with label Study Material. Show all posts

Monday, July 20, 2015

Telangana 7th Class English Medium Text Books

7 Th Class English Medium

Telugu Download
Hindi Download
English Download
Maths Download
 Science Download

Tags: Telangana School Text Books  school textbooks cheap  school text books are only available on cd and dvd  school textbooks for sale  school textbooks online  school Telangana School Text Books  text books for sale  collecting vintage school text books readers  school text books Telangana School Text Books Telangana School Text Books 10Th Class Books Download  9Th Class Books Download 8Th Class Books Download 7Th Class Books Download  6Th Class Books Download 5Th Class Books Download 4Th Class Books Download

Telangana 8th Class English Medium Text Books



8th Class English Medium

Telugu Download
Hindi Download
English Download
Maths Download
Py.Science Download
Bio.Science Download
 Social Download

8th Class Telugu Medium

Tags: Telangana School Text Books  school textbooks cheap  school text books are only available on cd and dvd  school textbooks for sale  school textbooks online  school Telangana School Text Books  text books for sale  collecting vintage school text books readers  school text books Telangana School Text Books Telangana School Text Books 10Th Class Books Download  9Th Class Books Download 8Th Class Books Download 7Th Class Books Download  6Th Class Books Download 5Th Class Books Download 4Th Class Books DownloadTags: Telangana 6th Class Telugu Medium Text Books Telangana School Text Books  school textbooks cheap  school text books are only available on cd and dvd  school textbooks for sale  school textbooks online  school Telangana School Text Books  text books for sale  collecting vintage school text books readers  school text books Telangana School Text Books Telangana School Text Books 10Th Class Books Download  9Th Class Books Download 8Th Class Books Download 7Th Class Books Download  6Th Class Books Download 5Th Class Books Download 4Th Class Books Download Telugu Medium. 1 to 10 Classes. Telugu · Maths. 8th to 10th Classes. Biology · Physics. 6th & 7th Classes. General Science. 6th to 10th 6th Class Social AP State Board Syllabus Telugu Medium Telugu Online Full HD ... National Crime Records Bureau report – Telangana 2nd top state in farmers

Sunday, July 19, 2015

Telangana 9th Class English Medium Text Books

9th Class English Medium

Telugu Download
Hindi Download
English Download
Maths Download
Py.Science Download
Bio.Science Download
 Social Download
 9th Class Telugu Medium

Tags: Telangana School Text Books  school textbooks cheap  school text books are only available on cd and dvd  school textbooks for sale  school textbooks online  school Telangana School Text Books  text books for sale  collecting vintage school text books readers  school text books Telangana School Text Books Telangana School Text Books 10Th Class Books Download  9Th Class Books Download 8Th Class Books Download 7Th Class Books Download  6Th Class Books Download 5Th Class Books Download 4Th Class Books Download

Telangana 10th Class English Medium Text Books


10th Class English Medium

Telugu Download
Hindi Download
English Download
Maths Download
Phy.Science Download
Bio.Science Download
 Social Download

10th Class Telugu Medium  

 

Tags: Telangana School Text Books  school textbooks cheap  school text books are only available on cd and dvd  school textbooks for sale  school textbooks online  school Telangana School Text Books  text books for sale  collecting vintage school text books readers  school text books Telangana School Text Books Telangana School Text Books 10Th Class Books Download  9Th Class Books Download 8Th Class Books Download 7Th Class Books Download  6Th Class Books Download 5Th Class Books Download 4Th Class Books Download

Wednesday, March 18, 2015

కాకతీయ వైభవం


kakatiya-gateఆంధ్రదేశ చరిత్రలో కాకతీయుల పాలనా కాలం విశిష్టమైంది. అందుకు కారణం వారు అనుసరించిన ఉదార విధానాలు, చేసిన కళాసేవ. 






కాకతీయ వైభవం


అసలు కాకతీయులు అనగానే గభాలున గుర్తొచ్చేది వారి నీటి పారుదల విధానం. ఆలయాల నిర్మాణం కంటే చెరువుల నిర్మాణంపైనే వారు ఎక్కువ ఖర్చు చేశారు. దీక్షతో నిర్వహించారు. జలసాధన సంతోషాన్ని శిల్పం ద్వారా ప్రకటించి, ఆ ఆనందాన్ని ప్రజలతో పంచుకున్నారు. వారు నిర్మించిన తటాకాలు నేటికీ వేలాది ఎకరాల సాగుకు ఉపయోగ పడుతున్నాయి. వారి నిర్మాణాలు ముఖ్యంగా ఆలయాలు, అందులోని శిల్పకళా ఖండాలు వారి ఉన్నతాభిరుచిని, నాటి కళాకారుల నైపుణ్యాన్ని, భావ ఔన్నత్యాన్ని ఘనంగా చాటి చెప్తున్నాయి. వారి స్మృతి చిహ్నాలుగా మిగిలిన వీటన్నింటినీ పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.
కాకతీయులు ఓరుగల్లు రాజధానిగా సుమారు క్రీ.శ.1000 నుండి 1157 వరకు పశ్చిమ చాళుక్యులకు సామంతులుగాను 1158 నుండి 1323 వరకు స్వతంవూతులుగాను పాలించారు. శాసనాధారాలను బట్టి కాకర్త్య గుండ్యన ఈ వంశ మూల పురుషుడు. ‘కాకతీయ’ అనే పదానికి సంస్కృతీకరణమే ‘కాకర్త్య’.
కాకతీయుల కులదేవత ‘కాకతి’ అనీ, మొదట వారు కాకతి ఆరాధకులు కాబట్టి కాకతీయులయ్యారనీ, ఆ తర్వాత స్వయంభూదేవుని ఆరాధకులయ్యారనీ చారివూతక సమాచారం ఉంది. కాజీపేట శాసనాన్ని బట్టి వీరు గుమ్మడమ్మ సాంప్రదాయానికి (తీగకు) చెందిన వారని తెలుస్తోంది.
జైన దేవత గుమ్మడమ్మ (కుషాండిని) కి మరోపేరు కాకతి. ఈమె జీవుల్ని అనారోగ్యం నుండి కాపాడే జైన ఆరోగ్య దేవత. కాకతీయులు తమను తాము ‘దుర్జయుల’మని చెప్పుకున్నారు. అంటే ‘జయింప శక్యం కాని వారు’ అని అర్థం. కాకలు తీరిన వీరులుగా వీరు కాకతిని యుద్ధదేవతగా కొలిచారు. ‘కాకతికి సైదోడు ఏకవీర’ అనే నానుడి ఆ రోజుల్లో ప్రచారంలో ఉంది. ఏకవీరాదేవి ఆలయం ఓరుగల్లు సమీపంలోని మొగిలిచర్లలో ఉంది. కొన్ని శాసనాల్లో ‘కాకతి’ వీరి కులపురమని చెప్పబడింది. అయితే, ఆ గ్రామం లేదా పట్టణం ఎక్కడ ఉందో గుర్తించటం ఇప్పుడు కష్టంగా ఉంది.
కాకతీయ వంశానికి సంబంధించి లభ్యమైన శాసనాల్లో మొట్టమొదటిది క్రీ.శ. 956 నాటి మాంగల్లు శాసనం. ఈ శాసనాన్ని బట్టి గుండియ రాష్ట్రకూటుడు కాకతీయుల మూల పురుషుడు. గణపతిదేవుని సోదరి మైలమ (ధర్మకీర్తి) తన తల్లి బయ్యలదేవి పుణ్యం కోసం చెరువు తవ్వించి బయ్యవరం గ్రామాన్ని సకల సదుపాయాలతో నిర్మించి శాసనం చేయించింది. దాని ప్రకారం తొలి కాకతీయుల వంశవృక్షం ఇలా ఉంది. దుర్జయ వంశంలో- వెన్ననృపుడు – గుండయ(1)-గుండయ(2)-గుండయ(3)- ఎరియ లేదా ఎర్రనృపుడు- (పిండి) గుండయ(4)-బేత(1)పోల(1)-బేత(2)పోల(2)-రుద్రదేవుడు-గణపతిదేవుడు అనేవారు జన్మించారు.
నాల్గో గుండయ క్రీ.శ.973లో రాష్ట్రకూటుల అధికారం పతనమయ్యేవరకు వారికి విధేయుడిగానే ఉన్నాడు. ఆ తర్వాత నేటి తెలంగాణగా ఉన్న ప్రాంతం చాలా వరకు పశ్చిమ చాళుక్యుల వశమైంది. ఈ పరిస్థితుల్లో గుండయ పశ్చిమ చాళుక్యుల వైపుగాని తూర్పు చాళుక్యుల వైపుకాని చేరకుండా తటస్థంగా ఉన్నాడు. ఇంతలో ముదిగొండ చాళుక్యులు విజృంభించి కొరవిసీమను ఆక్రమించుకున్నారు. ఆ ఘర్షణలలో గుండయ ముదిగొండ చాళుక్యుల చేతిలో హతమయ్యాడు. అతని సోదరి కామసానమ్మ మేనల్లుడైన బేతనను దగ్గరకు తీసి పశ్చిమ చాళుక్యులతో దౌత్యం నెరపి కొరవిసీమ నుండి హన్మకొండ వరకు కాకతీయాధికారాన్ని నిలిపింది. ఈ విధంగా కాకతీయ యుగంలో స్త్రీల సాధికారతకు బీజం వేసింది కామసానమ్మ. ఆమె భర్త విరియాల ఎర్రభూపతి గొప్ప సేనానాయకుడు.
కాకతీయ బేతరాజు మొదట వేల్పుకొండ (జఫర్‌గడ్) కేంద్రంగాను, హన్మకొండ వరకు అధికారం విస్తరించిన తర్వాత హన్మకొండ రాజధానిగాను క్రీ.శ.1052 వరకు పాలించాడు. తర్వాత అతని కుమారుడు ప్రోలరాజు క్రీ.శ. 1052 నుండి 1076 వరకు పాలించాడు. తర్వాత రెండో బేతరాజు క్రీ.శ. 1076 నుండి 1108వ సంవత్సరం వరకు పాలించాడు.
ఇతని కొడుకు దుర్గరాజు క్రీ.శ.1108 నుండి 1117 వరకు పాలించాడు. ఆ తర్వాత ఏ కారణం వల్లో దుర్గరాజును త్రోసిరాజని రెండో ప్రోలరాజు అధికారంలోకి వచ్చాడు. ఈతడే స్వయంభూ ఆలయాన్ని ఏకశిలా నగరంలో మొదటగా నిర్మించాడు. ఏకశిలానగర (కోట నగరం) నిర్మాణానికి దీంతో బీజం పడినట్లైయింది.
రెండో ప్రోలరాజు క్రీ.శ.1117 నుండి 1157 వరకు పాలించాడు. ఈయన గొప్ప వీరుడు. తన ప్రభువైన చాళుక్య రెండో జగదేకమల్లుని అధికారం నేటి తెలంగాణగా ఉన్న ప్రాంతమంతటా విస్తరింపజేసి అది సుస్థిరమయ్యేందుకు తీవ్ర కృషి చేశాడు. అనేక బావులను, చెరువులను, పంటకాలువలను తవ్వించి ‘దారివూద్య వివూదావణ’ అనే బిరుదును పొందాడు. ‘దరివూదాన్ని నీరుగార్చి పారదోలిన వాడని’ దీని అర్థం.
స్వతంత్ర పాలకులుగా కాకతీయులు నకీ.శ.1158-1323):రెండో ప్రోలరాజు కుమారుడు రుద్రదేవుడు క్రీ.శ. 1158-1195 సంవత్సరాల మధ్యకాలంలో కాకతీయ రాజ్యాన్ని పాలించాడు. క్రీ.శ. 1163 నాటి వేయిస్తంభాల గుడి శాసనం ఇతని విజయాల గురించి వివరిస్తున్నది. కర్ణాటకంలో బిజ్జులుని విజృంభణతో ఆంధ్రదేశంలో తానూ స్వతంవూతించి రాజ్యపు ఎల్లల్ని విస్తరింపజేశాడు. ఇంతవరకు కాకతీయులు తెలంగాణంలో వ్యవసాయ, నీటి పారుదల రంగాల్లో చేసిన కృషివల్ల వ్యవసాయం మీద ఆధారపడి నడిచిన పరిక్షిశమలు కూడా ఇబ్బడి ముబ్బడిగా ఉత్పత్తుల్ని సాధించాయి. వాటికి అంతర్జాతీయంగా గిరాకీ సాధించాలంటే ఓడరేవు పట్టణాలు కావాలి. అందుకోసం సాగరసీమను జయించాలనుకున్నాడు. పల్నాటి యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నపుడు నాయకురాలు నాగమ్మకు సైనిక సాయం అందించి బాగా లాభం పొందాడు. అపర కురుక్షేత్ర సంగ్రామంగా పేరు పొందిన పల్నాటి యుద్ధంతో కర్నూలు, గుంటూరు, కృష్ణా దిగువ నల్గొండ జిల్లా ప్రాంతాల్లో దిగజారిన పరిస్థితుల్ని అవకాశంగా తీసుకుని ఆయా ప్రాంతాలపై కాకతీయాధికారాన్ని స్థాపించాడు. గోదావరీ తీరంపై దాడికి వెళ్లక ముందే సబ్బిసాయిర మండలం (కరీంనగర్) పైకి దేవగిరి పాలకుడు జైతుగి దండెత్తి వచ్చాడని తెలిసి హుటాహుటిన కొంత సైన్యంతో తిరిగి వచ్చాడు. కాని, దురదృష్టవశాత్తు ఆ యుద్ధంలో (1195) లో మరణించాడు.
ఈయన అరివీర భయంకరుడై తాను రాజ్యానికి రాగానే తిరుగుబాటు చేసిన వారిని కఠినంగా శిక్షించి తెలంగాణం నుండి సాగరసీమలో పశ్చిమ ప్రాంతమంతా తన అధికారాన్ని నెలకొల్పగల్గాడు. సుప్రసిద్ధ వేయి స్తంభాల ఆలయ నిర్మాత ఈయనే. అంతేకాదు. తండ్రి తలపెట్టిన కొత్త రాజధాని ప్రణాళిక ప్రకారం అనేక నిర్మాణాలను చేశాడు.
రుద్రదేవునికి సంతానం లేకపోవడం వల్ల తమ్ముడు మహాదేవుని కుమారుడు గణపతిదేవుని దత్తత తీసుకున్నాడు. ఈయన మరణం అనుకోకుండా యుద్ధరంగంలో జరగటం వల్ల మహాదేవుడు క్రీ.శ 1195లో అధికార బాధ్యతలు చేపట్టాడు. రుద్రుని మరణానికి కారణమైన జైత్రపాలునిపై ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో మహాదేవుడు యాదవ రాజ్యంపై దండెత్తి యుద్ధరంగంలో మరణించాడు. గణపతిదేవుడు యాదవులకు బందీగా చిక్కాడు.
ఏ కారణం చేతనో యాదవులు 11 నెలల అనంతరం గణపతిదేవుని చెరనుండి వదిలివేశారు. కాకతీయ రాజ్యంలో రాజు లేకపోయినా సామంతులు, సేనా నాయకులు, మంత్రులు ఒక్క అంగుళం భూభాగం కూడా పోగొట్టకుండా రాజ్యాన్ని కాపాడారు. బహుశా గణపతిదేవునికి యాదవ రాకుమ్తాతో వివాహ ప్రతిపాదనకు అంగీకరించి విడుదల చేయించి ఉంటారు. ఈ వివాహం గురించిన ప్రస్తావన ప్రతాప చరివూతలోను, చింతలూరు శాసనం లోనూ ఉంది.
ఆంధ్రదేశాన్ని పాలించిన కాకతీయ ప్రభువులందరిలో గొప్పవాడుగా ఎన్నదగినవాడు గణపతిదేవుడు. గొప్ప ఉదార పాలకుడు. అన్ని వర్గాల వారిని కలుపుకుపోవాలని, ప్రజల అభీష్టానికి అనుగుణంగా పాలనా పద్ధతులను తీర్చిదిద్దాలనీ, మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి పరచాలని, జానపద, గిరిజన కళలను, సంస్కృతులను ప్రోత్సహించి పండిత పామరవర్గాల మధ్య దూరాన్ని తగ్గించాలని ఇలా ఎన్నో రకాలుగా కృషి చేసి గొప్ప పాలకుడిగా చరివూతలో నిలిచిపోయాడు. ఈయన క్రీ.శ. 1199 నుండి 1259 వరకు అంటే తన పాలనాకాలానికి షష్టిపూర్తి అయ్యేంత వరకు పాలించాడు. తర్వాత రుద్రమదేవికి సలహాదారుగా 1269 వరకూ రాజ్య వ్యవహారాలు చూశాడు.
తన పెదతండ్రి ఆశయమైన అఖిలాంవూధావని స్థాపనను సాధించాలని తన సైన్యాలను బెజవాడవైపు నడిపించి వెలనాటి పృధ్వీశ్వరుణ్ణి ఓడించాడు. దివిసీమ వైపు నడచి అక్కడ అయ్యపు పినచోడుని ఓడించి అతని కుమ్తాలైన నారాంబ, పేరాంబలను వివాహమాడి, వారి సోదరుడైన జాయపసేనానిని తన సైన్యంలో చేర్చుకున్నాడు. ఈ రాణులకు కల్గిన సంతానమే ఈ తర్వాత ధరణికోటను పాలించిన గణపాంబ, అఖిలాంధ్ర దేశాన్ని పాలించిన రుద్రమ. ఆ తర్వాత ఆయన తన సైనిక విజయాలతో ఉత్తరాన బస్తర్ జిల్లా నుండి దక్షిణాన కంచి వరకు, తూర్పున సముద్రం నుండి పశ్చిమాన దాదాపు ఔరంగబాద్ వరకు, ఈశాన్యాన గంజాం జిల్లా వరకు గల తెలుగు వారి అధికారాన్ని నెల కొల్పాడు. రాజధానిని హన్మకొండ నుండి ఓరుగల్లుకు మార్చింది ఈయనే.
తిక్కసిద్ధి గణపతిదేవుని సాయం కోరటానికి వచ్చి ముందుగా వెలనాటి యుద్ధంలో గణపతిదేవునికి సాయం చేశాడు. అంతేకాదు, తుదివరకు ఎన్ని సమస్యలు వచ్చినా నెల్లూరు వారికి బాసటగా నిలవటమేకాక అఖిలాంవూధావనిని ఏకచ్ఛవూతాధిపత్యం కిందికి తెచ్చినా శరణు వేడిన నెల్లూరు రాజ్యాన్ని మాత్రం ఆక్రమించలేదు.
ఆ తరువాత గోదావరీ పరీవాహక వూపాంతాన్ని కాకతీయ రాజ్యంలో కలపటానికి సైన్యాన్ని పంపాడు. ఆ సైన్యం ఉదయగిరి, గంజాం, బస్తరు, చక్ర కూటం, మంథెన, కాడి, గోగులనాడు, కొలను, మాడియం, ద్రాక్షారామం మొదలైన ప్రాంతాలను కాకతీయ రాజ్యంలో కలపటంలో విజయాన్ని సాధించింది. గోదావరీ తీర ప్రాంతంలో శాంతి నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో గణపతి దేవుడు తన కుమార్తె రుద్రమను చాళుక్య యువరాజు వీరభవూదునికిచ్చి వివాహం చేశాడు.
క్రీ.శ.1248లో తిక్కభూపతి మరణించాడు. మళ్లీ జాతుల మధ్య అంతర్యుద్ధం ప్రారంభమైంది. గణపతిదేవుడు ఈసారి కూడా నెల్లూరును ఆదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈసారి తిక్కన సోమయాజి రెండో మనుమసిద్ధి తరుఫున ఓరుగల్లుకు మారువేషంలో వచ్చి గణపతి దేవుని దర్శనభాగ్యం పొంది సమస్యను వివరించాడు. గణపతిదేవుడు రెండో మనుమసిద్ధికి సాయం చేయటానికి సబ్బి మండలాన్ని (కరీంనగర్ ప్రాంతం) పాలించే సామంత భోజుని నాయకత్వంలో సైన్యాన్ని పంపాడు.
గణపతి దేవుడు దేవగిరి సేనలతో కూడా సత్సంబంధాలను కొనసాగించాడు. ఆయన పాలనా కాలంలో దేవగిరి నుండి ఒక్క దండయాత్ర కూడా రాలేదు. పైగా ఆయన చేసిన యుద్ధాలలో వారి సైన్యం, సైనికాధికారులు పాల్గొని గణపతిదేవుని విజయానికి కృషి చేశారు.
గణపతి దేవుడు తన సుదీర్ఘ పాలనా కాలంలో అనేక ఘన విజయాలను సాధించాడు. ఇంతవరకు ఓటమిని చవిచూడలేదు. అందుకు కారణం వినవూమతతో కూడిన ఆయన వ్యక్తిత్వం, ధర్మచింతనతో కూడిన ఆయన కార్యాచరణ ప్రణాళిక. వాటివల్లనే ఆయన తన అనుచరుల సహాయ సహకారాలను పూర్తిగా పొందాడు. కాని చివరి దశలో తాను నమ్మిన దేవగిరి పాలకుల ద్రోహచింత వల్లను, దుర్నీతిని పాటించిన పాండ్యుల కుటిలతంత్రం వల్లను 1262లో ముత్తుకూరు యుద్ధంలో కాకతీయ సైన్యం ఓడిపోయింది.
అప్పటికే అంటే క్రీ.శ.1259లో రుద్రమను పట్టోధృతిగా ప్రకటించడం ఇష్టం లేని యాదవ సైన్యం హృదయ పూర్వకంగా కాకతీయుల సైన్యంతో కలసి నెల్లూరును రక్షించడంలో పాల్గొనలేదు. బహుశా పాండ్యులు, నెల్లూరు, ములికి నాటి ప్రాంతాలలో ఉన్న అసంతృప్తికారుడు అంబదేవుడు కూడా కాకతీయులకు వ్యతిరేకంగా జరిగే కుట్రలో యాదవులను భాగస్వాములు చేశాడు. ఒక విభాగానికి నాయకత్వం వహించి ద్రాక్షారామంలో పాండ్యులపై విజయం సాధించిన గణపతిదేవుడు తన సైన్యంతో నెల్లూరు వైపు నడుస్తున్న సమయంలో అర్థాంతరంగా కాకతీయ సైన్యం కకావికలమైంది. బహుశా యాదవుల, ఇతర కాకతీయ తిరుగుబాటు నాయకుల సైన్యం కాకతీయ సేనలతోనే తలపడడంతో గందరగోళంలో పడి వెనుదిరగక తప్పలేదు. ఎదురు చూడని ఈ పరిణామంతో ఏర్పడిన ఉపవూదవ పరిస్థితుల్లో యుద్ధం కొనసాగించడం అవివేక మౌతుందని గణపతిదేవుడు భావించాడు.
క్రీ.శ.1262లో ముత్తుకూరు వద్ద జరిగిన ఈ యుద్ధ సన్నివేశంతో గణపతిదేవుడు తానిక క్రియాశీలక రాజకీయాల నుండి తప్పుకోవాలనే ఒక ముఖ్య నిర్ణయం తీసుకుని, పాలనాధికారాలతో పాటు సైనికాధికారాలు కూడా రుద్రమకు ఇచ్చి ‘రువూదమదేవమహారాజు’ అనే పేరుతో ఆమెకు పట్టాభిషేకం చేశాడు. ఇప్పటివరకు ‘మహామండలేశ్వరులు’గా చెప్పుకున్న కాకతీయ సంప్రదాయాన్ని మార్చి ‘మహారాజుంగారు’ గా రుద్రమను పరిచయం చేయటంలో విశేషం ఉంది. స్త్రీ రాజ్యపాలన చేయడం కొత్త విషయం. అందువల్ల కొందరు (అంబదేవుని వంటివారు) చులకన చేయవచ్చు. శత్రువులు తక్కువ అంచనా వేయవచ్చు. అందువల్ల ఎన్నో రకాలుగా ఆమె సాధికారతను సుస్థిరం చేయాల్సి ఉంది. అందుకే, గణపతిదేవుడు దానికి అవసరమైన దర్పాన్ని కల్పించి, అందుకు తగిన వస్త్రధారణను కూడా సూచించాడు. ఆమె ఎప్పుడూ పురుషవేషంలోనే ఉండి రాజ్యకార్యాలను నిర్వహించేది. అంతేకాదు, ఆమె మనుమడైన ప్రతాపరువూదుని రుద్రమకు దత్తత నిప్పించాడు. ఈ విధంగా ఆమె రాజకీయ జీవన బాటను సాధ్యమైనంత వరకు నిష్కంటకం చేసి క్రీ.శ. 1269-70 ప్రాంతంలో కన్నుమూశాడు.
రుద్రమ అఖిలాంవూధావనికే పాలకురాలైతే, ఆమె సోదరి కోట రాజ్యాన్ని 40 సంవత్సరాల పాటు సమర్థవంతంగా పాలించి మార్కోపోలో వంటి విదేశీ యావూతికుల మన్ననలు పొందింది. మోటుపల్లి ఓడరేవు పట్టణం ఆమె రాజ్యంలో ఒక బహుళజాతి పట్టణంగా వెలుగొందింది. వివిధ దేశాలకు, భాషలకు చెందిన వారు ఈ పట్టణంలో నివసించేవారు. ఆమె తన శక్తి సామర్ధ్యాలతో పరిక్షిశమలను, వర్తక వాణిజ్యాలను అభివృద్ధి పరచిందనీ, దాతృత్వంతో ప్రజల హృదయాలను చూరగొన్నదని, మర్యాద పూర్వక ప్రవర్తనతో విదేశీయుల మన్ననలను పొందుతున్నదని అభిప్రాయపడ్డారు. మార్కోపోలో వ్రాశాడు.
స్త్రీ పురుష సమానత్వ సాధనకే గాక వివిధ వర్గాలు సామాజికంగా సమానత్వాన్ని సాధించాలనే తపన గణపతి దేవునిలో కనపడుతుంది. తన సైన్యంలో అన్ని వర్గాల వారికి, కులాల వారికి సమాన అవకాశాలిచ్చాడు.
రుద్రమదేవి క్రీ.శ.1259-1289
తండ్రికి తగిన తనయగా రుద్రమదేవి అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే ఒక ప్రసూతి ఆలయం, జ్వరాలయం, విద్యాకేంవూదాలతో గోళకి మఠాన్ని నెలకొల్పేందుకు వీలుగా విశ్వేశ్వర శివాచార్యులకు వెలగపూడితో సహా మందర(డం) గ్రామాన్ని దానం చేసింది.
రుద్రమ రాజ్యానికి రావటం ఇష్టం లేని దేవగిరి రాజు మహాదేవుడు తన మేనల్లుడైన హరిహర మురారి దేవుల తరుఫున కాకతీయ రాజ్యంపైకి దండెత్తి వచ్చాడు. వీరు గణపతిదేవునికి మహాదేవుని సోదరి అయిన సోమలదేవి వల్ల కలిగిన సంతానం.
గణపతి దేవునికి నారాంబ, పేరాంబల వల్ల కల్గిన సంతానం గణపాంబ, రుద్రమలు. వీరి సవతి తమ్ముళ్ళు హరిహర, మురారి దేవులు. వీరిని కాదని క్రీ.శ.1259 లో గణపతి దేవుడు రుద్రమను ‘పట్టోధృతి’ గా ప్రకటించడం మహాదేవునికి మింగుడు పడని విషయమైంది. అప్పటివరకు కాకతీయ సైన్యంలో 60 సంవత్సరాల పాటు ప్రతి యుద్ధంలో కీలకపాత్ర నిర్వహించిన యాదవులు క్రమంగా శత్రుభావాన్ని పెంచుకున్నారు. బహుశా ముత్తుకూరు యుద్ధంలో కాకతీయ సైన్యం ఖంగు తినడానికి కారణం యాదవులు అంబదేవునితో కలసి శత్రువులైన పాండ్యులతో కలసి కుట్ర పన్నడమే. అందువల్లే ఇక ఆగకుండా గణపతిదేవుడు వెంటనే 1262లోనే రుద్రమకు సైనికాధికారాలను కూడా అప్పగించాడు. ఆ తర్వాత కొద్ది కాలానికే భర్త చనిపోయాడు.
విధవను అపశకునంగా భావించే ఉత్తరాది సంస్కృతికి భిన్నంగా దక్షిణాదిన వితంతువులైన స్త్రీలు ప్రశాంతంగా సజ్జీవనం గడుపుతూ సమాజసేవలో సమర్థులుగా తమను తాము నిరూపించుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. మధ్య తరగతి నుండి వచ్చిన నాయకురాలు నాగమ్మ పధానిగా), పాలకవర్గం నుండి వచ్చిన కోట గణపాంబ, రుద్రమ, చాగి ముప్పలదేవి, విరియాల సాగసాని, కోట బయ్యలదేవి మొదలైన వారిని ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. కూలిపని చేసుకునే ఒంటరి స్త్రీలు కూడా సమాజసేవలో, తటాక నిర్మాణాల్లో ఏ విధంగా పాలు పంచుకున్నదీ బసవపురాణం చెప్తూంది.
ఏమైతేనేం, రుద్రమ రాజ్యానికి రాగానే యాదవ మహాదేవుడు కాకతీయ రాజ్యంపైన దండెత్తి రావటంతో రుద్రమ రణరంగంలో వీర విహారం చేసి మహాదేవుని బెడద కోట (బీదర్) వరకు తరిమి కొట్టింది. తాను ఓరుగల్లు కోటలో బంధించిన యాదవ సైనికులను పెద్ద మొత్తంలో (కోటి బంగారు నాణాలు) యుద్ధ నష్టపరిహారం తీసుకుని వదిలి పెట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రుద్రమ ‘రాయగజకేసరి’ బిరుదును ధరించింది.
పాలకురాలిగా రుద్రమ ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంది. ఆమె అత్తింటి వారు నిడదవోలు ప్రాంతంలో స్వతంవూతంగా పాలించడం మొదలు పెట్టారు. వారిని చూసి ఇరుగుపొరుగు గవర్నర్లు కూడా స్వతంవూతంగా శాసనాలు జారీ చేయడం మొదలైంది. ఇదే అదనుగా తూర్పు నుండి కళింగ గంగరాజు భానుదేవుడు గోదావరి తీరంలోకి చొచ్చుకు రావాలనే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ విషమ పరిస్థితుల్లో రుద్రమ విజ్ఞతతో ప్రవర్తించి పరిస్థితులను చక్కదిద్దింది. గాంగులపై విజయాన్ని సాధించటమే గాక తూర్పున గోదావరి తీరాన్ని కాకతీయ రాజ్య సరిహద్దుగా పటిష్టం చేసింది.
కడప పాలకుడైన అంబదేవునికి రుద్రమ రాజ్యానికి రావడం ఇష్టం లేదు. అతని పూర్వీకులు మహారాష్ట్రకు చెందిన వారు కావటం వల్ల ఆ అభిమానంతో బహుశా రుద్రమ తమ్ముళ్లు హరిహర మురారి దేవుల పక్షపాతిగా ఆమెపట్ల శతృత్వభావం వహించాడు. పాండ్యులను, దేవగిరి పాలకులను కూడా ఆమెకు వ్యతిరేకంగా కూడ గట్టి తిరుగుబాటు చేశాడు. వల్లూరు రాజధానిగా స్వతంవూతతను ప్రకటించాడు.
అంబదేవుని ఆగడాలను ఎదుర్కోవడానికి రుద్రమ తన సైన్యాన్ని సిద్ధం చేసింది. ప్రతాపరువూదుడు వ్యుహరచన చేశాడు. సైన్యం మొత్తం మూడు భాగాలుగా విడిపోయి ముక్కోణంలో శత్రువులను ఎదుర్కొన్నారు. ఒక విభాగానికి ప్రతాపరువూదుడు, రెండో విభాగానికి అడిదం మల్లుసేనాని, మూడో విభాగానికి స్వయంగా రుద్రమ నాయకత్వం వహించారు. దురదృష్టవశాత్తూ త్రిపురాంతకం వద్ద అంబదేవునితో జరిగిన యద్దంలో రుద్రమ ప్రాణాలు కోల్పోయింది. ఆమె వయస్సు అప్పటికీ 80 సంవత్సరాలకు పైబడే ఉంది. క్రీ.శ 1289 నవంబర్‌లో ఆమె సైన్యాధికారి మల్లికార్జున నాయకునితో సహా యుద్ధ రంగంలో ప్రాణాలు విడించిందని నల్గొండ జిల్లా చందుపట్ల శాసనం వల్ల తెలుస్తోంది. ఈ విధంగా మొక్కవోని పట్టుదలతో ఆంధ్రరాజ్య పరిరక్షణ కోసం 80 సంవత్సరాల పైబడిన వృద్ధాప్యంలో కూడా స్వయంగా యుద్ధరంగంలో పోరాడుతూ వీరమరణం పొందిన రుద్రమ చరివూతపుటల్లో మహిళా శక్తికి ప్రతీకగా నిలచింది.
నిరంతరం యుద్ధాల్లో నిమగ్నమైనా ప్రజాపాలనను గాని, అభివృద్ధి కార్యక్షికమాలను గాని రుద్రమ నిర్లక్ష్యం చేయలేదు. ఓరుగల్లు కోటకు మరమ్మత్తులు చేయించి రాతి కోటకు లోవైపున మెట్లు కట్టించింది. మట్టికోటకు బురుజులను, అగడ్తను నిర్మించి కోటను దుర్భేద్యంగా మార్చింది. రుద్రమ తర్వాత ఆమె దత్తపుత్రుడు (మనుమడు) అయిన ప్రతాపరువూదుడు రాజ్యానికి వచ్చాడు. క్రీ.శ. 1289లోనే రుద్రమ మరణించినా 1295 వరకు ఇతడు శాసనాల్లో కుమార ప్రతాపరువూదుడిగానే కన్పిస్తాడు. బహుశా రుద్రమ వీరమరణం, దాని తర్వాత ఏర్పడిన రాజకీయ గందరగోళ పరిస్థితిని చక్కదిద్ది, అంబదేవునిపై ప్రతిచర్య తీసుకునే వరకు పట్టాభిషేకాన్ని జరుపుకోరాదని భావించి ఉండవచ్చు.
ముందుగా ప్రతాపరువూదుడు సైనికశక్తిని పటిష్టం చేయటానికి పూనుకున్నాడు. నాయంకర విధానాన్ని రూపొందించి సైనిక వ్యవస్థను క్రమబద్ధీకరించాడు. క్రీ.శ. 1291లో అంబదేవుని త్రిపురాంతకం నుండి పారవూదోలారు.
అంబదేవునితో చేతులు కలిపి రుద్రమ వీరమరణానికి కారకులైన పాండ్యులను, దేవగిరి పాలకుల్ని పలుచోట్ల ఓడించి క్రీ.శ. 1294 నాటికి తుంగభద్ర అంతర్వేది ప్రాంతంలోని పటిష్టమైన కోటలను స్వాధీనం చేసుకున్నాడు. ఈ విజయాల తర్వాత క్రీ.శ. 1295 లో కుమార ప్రతాపరువూదుడు ‘వీర ప్రతాపరుద్ర మహారాజుగా’ పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ తర్వాత పాండ్యులను కంచి నుండి పారవూదోలాడు.
ఢిల్లీ సుల్తానుల దాడులు:అల్లా ఉద్దీన్ ఖిల్జీ నుండి మహ్మద్ బిన్ తుగ్లక్ వరకు ఢిల్లీ సుల్తానులు క్రీ.శ.1303-1323 సంవత్సరాల మధ్య ఏడు సార్లు దండెత్తి రాగా కొన్నిసార్లు కాకతీయులు విజయం సాధించారు. కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించక దక్షిణ దండయాత్రల్లో ఉండడం వల్ల సంధి చేసుకోవలసి వచ్చింది.
పతనం: చివరగా 1323లో ఉల్లూఖాన్ (యువరాజైన మహ్మద్‌బిన్‌తుగ్లక్) నాయకత్వంలో రెండుసార్లు దండెత్తాడు. మొదటిసారి వచ్చిన దండయావూతలో కాకతీయ సైన్యం ఘనవిజయం సాధించింది. విజయ కేతనాలను ఎగురవేసి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. కోటలో ఉన్న ధాన్యాన్ని కూడా ప్రతాపరువూదుడు ప్రజలకు పంచిపెట్టాడు. ఇంతలో అనుకోకుండా ముస్లిం సేనలు హఠాత్తుగా వచ్చిపడ్డాయి. చుట్టు పక్కల గ్రామాలను తగులబెట్టారు. మండువేసవి. నీరు కోటలోకి పోకుండా గండ్లు కొట్టారు. కోటను చుట్టుముట్టారు. బొబ్బాడ్డి అనే నాయకుణ్ణి తమవైపుకు తిప్పుకున్నారు. బహుశా లంజపాతరదిబ్బ వద్ద మట్టి కోటకు గండికొట్టారు. కోటలో ప్రవేశించిన పద్మనాయక వీరులు ధైర్యం వీడక పోరాడుతూ ఒక్కొక్కరూ బలైపోతున్నారు. వృద్ధులు, పిల్లలు, స్త్రీలు హాహాకారాలు వినలేక ప్రతాపరువూదుడు కోట బయటకు వచ్చి లొంగిపోయాడు. ఈసారి ఉల్లూఖాన్ సంధికి అంగికరించలేదు. ప్రతాపరువూదుని ఢిల్లీకి బందీగా పంపుతుండగా అవమానంతో దారిలో నర్మదానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చారివూతకాధారాల వల్ల తెలుస్తూంది.
ప్రతాపరువూదుడు ఓడిపోయిన తర్వాత సంధి చేసుకుంటాడని, ఆ తర్వాత తమ శక్తి సామర్థ్యాలను, పద్మనాయకుల అసమర్థతను అంగీకరించి తమకు తగిన స్థానాన్ని కల్పిస్తాడని బొబ్బాడ్డి, అతని అనుచరులు ఆశించారు. అనుకోకుండా జరిగిన పరిణామానికి చింతించారు. ఓరుగల్లుకు ‘సుల్తాన్‌పూర్’ అని ఉల్లూఖాన్ నామకరణం చేశాడు. ఇస్లాం మతాన్ని స్వీకరించిన నాయకులకు ఉన్నత పదవులిచ్చాడు. ప్రతాపరువూదుని కటక (కోట) పాలకుడైన కన్ను (నాగయగన్నయ) ఉల్లూఖాన్ మన్ననకు పాత్రుడై మతాంతరీకరణ చెందిన మాలిక్ మక్బూల్‌గా ఇక్కడ గవర్నర్‌గా నియమింపబడ్డాడని షామ్సీసిరాజ్ అఫీస్ రచనను బట్టి తెలుస్తూంది. ఈ అంశం కూడా మంత్రుల, సామంతుల ద్రోహచింతన పట్ల అనేక అనుమానాలకు తావిస్తున్నది. సామంతుల సైన్యం ఎక్కువై ప్రభువు సైన్యం తక్కువైనపుడు ప్రభువు పని చిక్కుల్లో పడుతుంది. అదే కాకతీయ రాజ్య పతన సమయంలో జరిగింది.
కాకతీయ రాజ్య పతనానికి ఇంకా ఎన్నో అంశాలు దోహదపడ్డాయి. ఎన్నో సంవత్సరాలుగా శ్రమించి సాధించిన తెలుగువారి ఐక్యత దెబ్బతిన్నది. ఆంధ్రదేశం ముక్క చెక్కలైంది. ఓరుగల్లు బావురుమన్నది. దేవాలయాలు విధ్వంసానికి గురయ్యాయి. పంటలు, పరిక్షిశమలు నాశనమయ్యాయి. శాంతి భద్రతలు కరువై, వర్తక వాణిజ్యాలు అడుగంటాయి.
మళ్ళీ ఓరుగల్లుపై ఆధిపత్యం కోసం వివిధ రాజ్యాల మధ్య పోరు ప్రారంభమైంది. ఇక్కడ కాకతీయులు సాధించిన జలసమృద్ధి, వ్యవసాయ, వర్తక వాణిజ్యాల అభివృద్ధి తత్ఫలితంగా ఓరుగల్లు రవాణాకు కూడలిగా మారటం వంటివి ఈ ఆకర్షణకు మూల కారణాలు.
కాకతీయాధికారం అంతమైనా, వారి పాలనా ప్రభావం దానిలోని ఉన్నత లక్షణాల వల్ల, దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ఉండటం వల్లనూ, ఆ తరువాత ఆంధ్రదేశాన్ని పాలించిన ప్రభువులు, ముఖ్యంగా విజయ నగరాధీశులు, కుతుబ్‌షాహీ సుల్తానులు, కాకతీయ పాలనాంశాలను చాలా వరకు అనుసరించి కొనసాగించారు. విజయ నగరాధీశుల అమర నాయంకర విధానానికి పునాది వేసినవారు కాకతీయులే. 16,17 శతాబ్ధాల్లో ఆంధ్రదేశాన్ని పాలించిన కుతుబ్‌షాహీల పాలనలో కాకతీయుల పన్నిద్ధరు ‘ఆయగాండ్ర’ పద్ధతి ‘బారాబలవంతుల’ పద్ధతిగా మారి గ్రామ పాలనలో కొనసాగింది. నీటి తీరువాలో కాకతీయులు ప్రవేశపెట్టిన దశబంధ విధానాన్ని, పూడికతీత కార్యక్షికమాలను సుల్తానులు యధాతథంగా కొనసాగించారు. సైనిక వ్యవస్థలో కాకతీయుల లెంకల విధానాన్నే ‘ఖాసాఖైల్’ పద్ధతిగా కొనసాగించారు. అదే విధంగా వ్యవసాయాభివృద్ధిలోను, ఉద్యానవన కృషిలోను కాకతీయుల విధానాలను కుతుబ్‌షాహీలే కాక ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ కూడా అనుసరించాడు. ఫిరోజ్ షా తుగ్లక్ వద్ద ఉపవూపధానిగా ఉన్న మాలిక్ మక్బూల్ (గన్నయ నాయకుడు) దశబంధ విధానాన్ని ఢిల్లీ రాజ్యంలో ప్రవేశపెట్టడమే గాక ఉద్యానవన కృషి ద్వారా రాజ్యపుటాదాయాన్ని పెంచడానికి కృషి చేశాడు. ఈ విధంగా కాకతీయ పాలన సమకాలీన ప్రభువులకు, తదనంతర పాలకులకు సైతం మార్గదర్శకం అయింది.
ఇప్పటికే చాలా వరకు చెరువులు పూడికలు తీయక కప్పులు, సాసర్ల రూపంలోకి మారాయి. నాడు అతి విశాలంగా, లోతుగా ఉండి సమువూదాలుగా పిలువబడిన బాల సముద్రం వంటి జలశయాలు ఇళ్ల స్థలాలుగా మారి చిరునామా కోల్పోయాయి. ఉన్నవాటిని పరిరక్షించుకోవటం, బాగా పాడైన వాటిని పూడికలు తీయించి వాడకంలోకి తేవటం ప్రస్తుత కర్తవ్యం. అదే మనం ఆనాటి నిర్మాతలకు సమర్పించే నివాళి. అప్పుడే అది మన తరానికి, ముందు తరాలకి వారసత్వంగా వచ్చిన తరగని పెన్నిధి అవుతుంది.
కాకతీయులు గరుడాంక చిహ్నం కలిగిన రాష్ట్రకూటులు కాబట్టి, వారు రాష్ట్రకూట వంశస్థులని, మహారాష్ట్ర ప్రాంతం నుండి ఆంధ్రదేశానికి వలన వచ్చిన వారని గుండయ, ఎరియల పేర్ల చివర ఉన్న రాష్ట్రకూట శబ్ధమే ఇందుకు తార్కాణమని కొందరు అభివూపాయపడ్డారు. కానీ, ఇది ఏ మాత్రం సబబు కాదనిపిస్తుంది. ఎందుకంటే, రాష్ట్రకూట శబ్ధం ఇందుకు ముందు చెప్పుకున్నట్లు రట్టడిగా గ్రామాధికారులకు కూడా చాళుక్య శాసనాల్లోనూ ఉంది. రాష్ట్రకూటుల వద్ద సైనిక వృత్తిలో ఉన్నమాట వాస్తవమే, కానీ, రాష్ట్ర కూటుల ఆక్రమిత ప్రాంతాలైన ఆంధ్రదేశంలోనే వారున్నారు తప్ప మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్న దాఖలాలు లేవు. పైగా వారి పేర్లన్నీ అచ్చతెలుగు దేశీయపదాలే, వ్యవసాయ సంస్కృతికి చెందిన పేర్లు. ‘గుండము’ అంటే ‘లోతైన చెరువు’ అని అర్థం. ‘గుండయ’ పేరు దానికి సంబంధించిందే. చలమయ్య అనే పేరు కూడా నాటికీ నేటికీ ఆంధ్రదేశంలో సాధారణమైన పేరు. అది కూడా నీటి చలమకు సంబంధించిందే. బేతరాజు పేరు భూతక్షిగాహస్వామి (పోతురాజు) నుండి వచ్చిందే. ఈ పేరు పంటలకు చీడపీడలు రాకుండా పూజింపబడే దేవుడిదే. ప్రోలయ నూర్పిడి సమయంలో పూజింపబడే దేవత ప్రోచేరాజుగా పోలరాజు) శివుడు కూడా పూజితుడయ్యాడు. బ(వ)య్యలమ్మ (చదువుల తల్లి), మైలమ (భూదేవి) కుందమ్మ (వ్వ), మేడలమ్మ, రుయ్యమ్మ, ముమ్మడమ్మ (ముగ్గురమ్మల మూలపుటమ్మ) ముప్పమ మొదలైన కాకతీయ కుటుంబీకుల పేర్లు అచ్చ తెలుగు పదాలతో కూడినవి. రుద్రదేవునితోనే సంస్కృత పేర్లతో కాకతీయ ప్రభువులు కనిపిస్తారు.
తెలంగాణాన్ని హృదయసీమగా చేసుకుని అఖిలాంధ్ర దేశాన్ని పాలించిన కాకతీయుల సాంస్కృతిక వారసత్వం మహోన్నతమైందిగా ప్రశంసలందుకుంది. దానికి మూల కారణం కాకతీయులు బహుముఖంగా అనుసరించిన ఉదాత్త విధానమే. అన్ని వర్గాలను- స్త్రీలను, పురుషులను, శిష్ఠులను, జానపదులను, పాలకులను, పాలితులను – అందరినీ కలుపుకుపోయే ధోరణే వారి విధానాలకు వెన్నెముక అయింది. పండితులు రూపొందించిన కళారూపాలకు, జానపదులు పొందు పరచుకొన్న కళారూపాలకు సమన్వయాన్ని సాధించే ప్రయత్నం చేసి దానిలో వారు విజయాన్ని సాధించారు. అదే వారికి చరివూతలో ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించింది.
ranirudhramadevi‘రాయ గజకేసరి’ రుద్రమదేవి
- పి.వి.పరబ్రహ్మ శాస్త్రి
కాకతి రుద్రమదేవి ఒక వీరవనిత. గణపతి దేవుడి కూతురు. క్రీ.శ. 1262లో కాకతీయ రాజ్యానికి ఆమె పాలకురాలైంది. గణపతి దేవుడికి పుత్రులు లేని కారణంగా ఆమెనే పుత్రుడుగా భావించి రాజనీతితోబాటు కత్తి డాలు పట్టి ఆనాటి కదన విద్యలో మేటి యోధురాలుగా తీర్చిదిద్ది, తన రాజ్యానికి వారసురాలుగా ‘రువూదదేవుడ’నే పురుషనామంతో ఆమెను సింహాసనాధిష్ఠితురాలిని చేశాడు. ఇది సహించని కొందరు రాజ్యానికి ఉత్తరం వైపున సేవుణ రాజ్యాధిపతిఅయిన యాదవ మహాదేవరాజును ఓరుగల్లు కోటపై దండెత్తడానికి ప్రోత్సహించారు. అయితే, దేవగిరి యాదవ రాజసైన్యం ఓరుగల్లు కోటను సాధించలేక పోయింది. శత్రుసైన్యాన్ని యాదవుల రాజ్యంలో చేరిన బీదరు కోటను విడిచిపోయేట్లు రుద్రమదేవి తరిమికొట్టి ఆ కోటను తాను ఆక్రమించుకొంది. ఆ కోటకు కాకతి సైన్యాధిపతిని అధ్యక్షుడిగా నియమిస్తూ ఒక శిలాశాసనాన్ని కన్నడభాషలో గద్య పద్యాలతో రాయించి ప్రతిష్టించింది. ఇది రుద్రమదేవి మొదటి మహా విజయం. ఈ నేపథ్యంలోనే తండ్రి బిరుదైన ‘రాయ గజకేసరి’ అనే బిరుదాన్ని తాను కూడా వహించినట్లు స్పష్టమవుతోంది.
ఈ విజయ సూచకంగా ఓరుగల్లు కోటలో స్వయంభు దేవాలయానికి ముందు అనేక శిల్పాలతో అలంకరించిన రంగ మండపాన్ని ఆమె నిర్మించారు. దాని చూరుకి నలుమూలల తాను కొత్తగా వహించిన రాయగజకేసరి (శవూతురాజులైన ఏనుగులకు సింహం వంటిది) బిరుదాన్ని శిల్పరూపంలో అంటే ఏనుగు తలమీద విక్రమించిన సింహం, దాని మీద కత్తి, డాలు రెండు చేతులతో పట్టుకొని స్త్రీ యుద్ధం చేస్తూ కూర్చున్నట్లు ఆ శిల్పం మలచబడింది. ప్రస్తుతం ఈ శిల్పాలు ఓరుగల్లు కోటలో రంగ మండప శిథిలాల్లో భాగంగా కనిపిస్తున్నాయి. ఇది రుద్రమదేవి రూపమని చరివూతకారులు భావిస్తున్నారు.
దేవతా రూపమే అయితే, నాలుగు చేతులుండాలి. ముందు రాక్షసుడు కూడా కనిపించాలి. శిల్పంలో ఆ గుర్తులు లేవు. కనుక, ఈ శిల్పాలు ‘రాయగజ కేసరి’ బిరుదానికి తగినవిగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఆనాటి శంభునిగుడి నాలుగు తోరణ ద్వారాల నడుమ ఇది ఉన్నట్లు అర్థమవుతోంది. దాని శిథిలాలే ఇప్పుడు మిగిలాయి.
(వ్యాసకర్త కాకతీయుల శాసనాల పరిశీలన ద్వారా ఎన్నో సత్యాలను వెలికి తీశారు. అందులో మీరు చూస్తున్న కాకతి రుద్రమదేవి శిలా చిత్రాన్ని గుర్తించింది కూడా వీరే. అట్లే, బయ్యారం చెరువు శాసనం ఆధారంగా కాకతీయుల మూలాలను వెలికి తీయగలిగారు. అంబదేవునితో జరిగిన యుద్ధంలో చందుపట్ల శాసనం ద్వారా కాకతి రుద్రమదేవి మరణించిన సంవత్సరం క్రీ.శ.1290గా నిర్ధారించటం, రాయగజకేసరి బిరుదు ముద్ర ఆధారంగా కాకతీయులు వేయించిన నాణాలను గుర్తించడం, రుద్రదేవుని హనుమకొండ శాసనాన్ని పునర్వ్యాఖ్యానించడం -ఇలా కాకతీయుల చరిత్ర నిర్మాణంలో పి.వి.పి. గా పేరొందిన వీరి కృషి ప్రసిద్ధం. ‘కాకతీయలు’ పేరిట వారు రచించిన పరిశోధనా గ్రంథం ఓ ప్రామాణిక రచనగా సర్వామోదం పొందింది.)
ramappa1పాదవర్గం
అధిష్ఠానంపైన ఉండే దేవాలయ గోడభాగాన్ని ‘పాదవర్గం’ అంటారు. రామప్ప దేవాలయ గర్భాలయ, అర్ధమండపాల వరకూ వున్న గోడభాగం, కింద వేదిక, పొడవాటి స్తంభభాగం, దానిపైన కలశం, ఫలిక, పద్మం, పోదిక (బోదె) వున్నాయి. అడ్డంగా చూస్తే ఒకవైపు నుంచి మరోవైపుకు కర్ణకూటం, అహార, పంజర, ముఖశాల మళ్ళీ పంజర, అహార, కర్ణకూటాల అమరిక వుంది. ముఖశాల మధ్యభాగంలో మూడంచెలున్న కోష్టము, దానిపై శిఖరం, కోష్టం పక్క గోడలకు స్వస్తిభద్ర కిటికీలు, ఒక్కో అంచెకు కపోతం, వ్యాళ వర్గాలున్నాయి. కోష్టం కింద గజధార, దానికింద యధావిధిగా అధిష్ఠానం ముందుకు పొడుచుకొచ్చాయి. కుముద భాగం మధ్యలో చక్కటి నంది విగ్రహం వుంది. నంది కేవలం శివుని వాహనమే కాదు. వ్యవసాయానికి తోడ్పడి తిండి గింజలందించేది. కాబట్టి, దానిపట్ల కాకతీయులు మక్కువ పెంచుకొన్నారు. అలాగే, గర్భాలయ గోడల ముఖశాల మధ్యలో మూడువైపులా మూడు కోష్ఠాలున్నాయి. కర్ణకూట అహార భాగాల్లో రెండు స్తంభాల కోష్ఠాలపై మూడంతస్తుల విమానముంది.

రమణీయం రామప్ప

ramappa
- డా॥ ఈమని శివనాగిరెడ్డి స్థపతి, 98485 98446
రామప్ప దేవాలయానికి నిర్మాణ సహకారాన్ని అందించింది రేచర్ల రుద్రుడు. అతడు శివలింగాన్ని ప్రతిష్టించి ఆలయాన్ని తన పేర ‘రుద్రేశ్వరుడ’ని పిలుచుకొన్నాడు. ఇప్పుడు దాన్ని ‘రామలింగేశ్వరుడ’ని పిలుస్తున్నారు. 
ఈ దేవాలయానికి రామప్ప దేవాలయమని పేరెలా వచ్చిందో ఖచ్చితమైన ఆధారాలు లేవు. కొందరు గుడి కట్టిన శిల్పి పేరు రామప్ప అనీ, అందుకే ఆ దేవాలయాన్ని రామప్ప దేవాలయమని పిలుస్తున్నారని గ్రామస్తులంటారు. ఏమైనా, గణపతిదేవుని సైన్యాధ్యక్షుడిపైన రేచర్ల రుద్రిడ్డి (రువూదుడు) పాలంపేటలో క్రీ.శ.1213లో నిర్మించిన రామప్ప దేవాలయం కాకతీయ దేవాలయాలన్నింటిలోకీ మణిపూసగా చెప్పుకోవాలి.
దేవాలయ అమరిక
రామప్ప దేవాలయం గర్భాలయం, అర్ధమండపం, రంగమండపం, నంది మండపంతో కుడివైపున కామేశ్వరాలయం, కళ్యాణమండపం, ఎడమ వైపున కాటేశ్వరాలయాలతో చుట్టూ ప్రాకారంతో నిర్మాణమైంది.
ఉపపీఠం
పీఠమంటే అధిష్ఠానం. దేవాలయం మొత్తం దేనిమీద నిలబడి వుంటుందో దాన్ని ‘అధిష్ఠానం’ అంటారు. అంటే దేవాలయానికి ‘పాదం’ లాంటిది. ఈ అధిష్ఠానం కింద ఉండే వరుసల్ని ‘ఉపపీఠం’ అంటారు. రామప్ప దేవాలయ ఉపపీఠం చూడటానికి ఎత్తుగా, చుట్టూ ప్రదక్షిణ చేయటానికి విశాలంగా ఉంది. ఆధారశిల, ఉపానం, పద్మం, పట్టిక, కుముదం, పట్టిక, అధోపద్మం అనే ఉపపీఠం వరుసలపై ఎలాంటి అలంకార శిల్పమూ లేక సాదాగా వున్నాయి.
అధిష్ఠానం
అధిష్ఠానానికి ఉపానం, కుముదము, కపోతము దానిపైన ఏనుగుల వరుస (గజధార)లున్నాయి. కపోతం వరుసపై మట్టానికి సమంగా గర్భాలయ, అర్ధమండప, రంగమండపాల నేల రాళ్ళు పరచబడినాయి. ఏనుగుల వరుస గల రాయిపై ఏనుగులు మనిషిపై దాడి చేస్తున్నట్లు, గణపతి, భైరవ, గజలక్ష్మి, మల్లయుద్ధం, సూర్యుడు, మకరం (మొసలి), వ్యాళాలుఉన్నాయి.
కక్షాసనాలు
దేవాలయ రంగమండప అధిష్ఠానంపై గల ఏనుగుల వరుసలున్న రాయిపైన నిలువుగా ఒక పిట్టగోడ లాంటి రాయి వుంది. దీన్ని ‘కక్షాసనం’ (ఆనుకుని కూర్చోటానికి) అంటారు. మండపం లోపల ఒక మూడు వరుసల వేదిక, దానిపై భక్తులు కూర్చోవటానికి అరుగుగా ఉపెూగపడుతుంది. తూర్పువైపు ప్రవేశద్వారం నుంచి రంగమండపం అరుగుపైన 20 కక్షాసన ఫలకాలున్నాయి. వాటిపై జైనతీర్ధంకరులు, డాలు కత్తి పట్టిన యోధులు, నాట్యగణపతి, చామరధారి, విల్లు, బాణం పట్టుకొన్న వేటగత్తె, భటులు, భైరవుడు, గణిక, వేణుగోపాల, మల్లయుద్ధ దృశ్యాలు, సాలభంజిక (కొమ్మను పట్టుకొని వయ్యారంగా నిలబడిన స్త్రీ) నాట్యగత్తెలు, అటూ ఇటూ మద్దెలను వాయిస్తున్న వాద్యగాండ్లు, నాగిని, సూర్య, శృంగార మైథున శిల్పాలు, నగ్నంగా వున్న ఋషి పుంగవులు, శివభక్తులు, భటుల బొమ్మలు ఉన్నాయి. మధ్య మధ్యలో నాలుగు దళాల పద్మాలు, పట్టీలు వున్నాయి. ఈ కక్షాసనాలను వెనకగోడగా చేసుకొని రంగమండపం లోపలి వైపున చుట్టూ ఏడు చిన్న దేవాలయాలు ఉన్నాయి. రెండింటిలో మాత్రం దేవి, గణపతి విగ్రహాలున్నాయి. కేవలం కాకతీయుల దేవాలయ రంగమంటపాల్లోనే ఇలాంటి చిన్న దేవాలయాలు పరివారాలయాలుగా వుండటం గమనించాల్సిన విషయం.
ప్రస్తరం (చూరుగల కప్పు)
గర్భాలయం, అర్ధ మండపం, రంగమండపంపైన గోడలపై వర్షం నీరు పడకుండా బాగా వెడపూ్పైన ప్రస్తర కపోతముంది. దాన్ని చూరు అనవచ్చు. కిందనుంచి చూసే వారికి కొయ్యతో బాడిసె ఉలిపెట్టి పట్టీలు, బద్దెలు, చివర చూరునుంచే వర్షపు బిందువుల మాదిరి బొంగరం లాంటి రాతి బుడిపెలు కనబడేలా చెక్కారు. ఈ బుడిపెలనే సమరాంగణ సూత్రధారమనే శిల్పశాస్త్రాన్ని రచించిన భోజమహారాజు నకీ.శ.1వ శతాబ్ది) ‘ఝారావళి’ అని పిలిచారు. అంటే చూరు నుంచి రాలే ‘చిటుక్కు, చిటుక్కు వానచుక్కలని’ అర్ధం. కపోతం కింద ఉత్తరమనే దూలం వరుస, కపోతంపైన వ్యాళమనే వరుసా వున్నాయి.
శిఖరం (విమానం)
కప్పు వరకూ రాతితో కట్టిన రామప్ప దేవాలయ ప్రస్తరం పైన ఇటుకలతో కట్టిన మూడంతస్తుల ‘విమాన’ముంది. అనేక రకాల కొలతలతో నిర్మించటం వల్ల దీన్ని విమాన (నానా మానవిధానత్పాత్ విమానం పరికల్పయేత్) మన్నారు. కాకతీయుల కాలపు విమానం శిథిలమైతే నలభై ఏళ్ళక్షికితం దీన్ని పునర్నిర్మించారు. కూటకోట లక్షణం ద్రావిడ పద్ధతిలో కట్టిన విమాన శిఖరం చదరంగా వుంది. దానిపైన కలశముంది. విమానం ముందు భాగాన అర్ధ మండపంపైన రెండో అంతస్తు వరకూ ఉన్న కట్టడాన్ని శుకనాసి చిలుకముక్కు (చి.ము) అంటారు.
నీళ్లపై తేలే ఇటుకలు
రామప్ప శిల్పులు సకల విద్యావూపవీణులు, ప్రయోగశీలురు. వాళ్లు ఎంతటి ప్రతిభాశాలులూ అంటే అప్పటికే భారీశిలలతో బరు దేవాలయానికి మరింత బరువు కాకూడదని, గర్భగుడిపై విమానాన్ని నీళ్లలో తేలే ఇటుకలతో నిర్మించి, నిర్మాణ రంగంలో యావత్ భారతదేశంలోనే తమకెవరూ సాటిలేరన్న విషయాన్ని రుజువు చేశారు.
రంగమండపం
రామప్ప దేవాలయ గర్భగృహం, అర్ధమండపం తరువాత వున్న చదరపు మండపాన్ని ‘రంగమండపం’ అంటారు. దీనికి మూడువైపులా భక్తులు లోనికి వెళ్ళడానికి దారులున్నాయి. దేవుని విగ్రహానికి చేసే అలంకరణలను అంగభోగమని, రంగశిలనుంచి అర్పించే నాట్యాన్ని రంగభోగమనీ, రెండింటినీ కలిపి అంగరంగ భోగాలనీ అంటారు. ఈ మండపంలో మధ్యన ఎత్తైన నాలుగు ప్రధాన స్తంభాలు, చుట్టూ వేదిక మీద కురచస్తంభాలు వున్నాయి. కపోతం వంగిపోతుంటే అప్పటి పురావస్తు శాఖ సంచాలకులు డా॥ గులాం యజ్దాని చుట్టూ అదే సాదాగా చెక్కించిన రాళ్ళతో స్తంభాపూత్తించాడు. దానిపై నున్న వ్యాళ వర్గం శిథిలమైతే దాన్ని కూడా రాతితో పిట్టగోడ మాదిరిగా కట్టించాడు. నిజానికి కాకతీయుల పిట్టగోడపై ప్రధాన ఆలయాన్ని పోలిన చిన్న ఆలయాల వరుస వుంటుంది.
రంగమండప స్తంభాలపై శిల్పం
రంగమండపం మధ్యనున్న నాలుగు స్తంభాలు, దూలాలు, కప్పు రాళ్ళను నల్ల శానపు రాతితో చెక్కారు. వాటిని ఎంత నున్నగా చెక్కారంటే చూసుకుంటే మన ముఖం కూడా కనపడుతుంది. ఇక, ఆగ్నేయంలో వున్న స్తంభానికి కింద అశ్వపాదం, స్తంభభాగం దానిపై నాట్య గణపతి, ఎకచెక్కాలాడుతూ శృంగారం భంగిమల్లో ఉన్న దంపతులు, ఒక సైనికుడు, అతని భార్య (కొంతమంది పరిశోధకులు ఈ శిల్పాన్ని రేచర్ల రుద్రసేనాని, అతని భార్యగా వర్ణించారు), నాట్యగత్తెలను చెక్కారు. నైరుతిలోని స్తంభంపైన నాట్యగత్తెలు, రతీ మన్మథ, అమృత మధన దృశ్యాలు, వాయువ్య స్తంభం మీద గోపికా వస్త్రాపహరణం, నాట్యగాళ్ళు, ఈశాన్య స్తంభంపై డిజైన్లు వున్నాయి. స్తంభాలపైన కలశం, దాడి, ఫలికా పద్మాలను బంగారు పనిచేసే కంసాలులు తీర్చి దిద్దారా అన్నట్లుంది. దానిపై నాలుగు వైపులా నాలుగు ముఖాలున్న బోదెలు వున్నాయి.
రంగమండప దూలాలు
బోదెలపైన గల దూలాలపై కూడా వెన్నతో తీర్చిదిద్దారా అన్నట్లుగా లెక్కలేనన్ని దేవతా మూర్తుల్ని సులువుగా చెక్కారు. తూర్పువైపు దూలం ఎదురుగా శివ కల్యాణ సుందరమూర్తి, దూలం కింది వైపున బ్రహ్మ, విష్ణువుల మధ్య నర్తనమాడుతున్న నటరాజు, ఏకాదశ రుద్రులు, లోపలి వైపు త్రిపుర సంహారమూర్తి, దక్షిణం వైపు దూలంపై ఎదురుగా, నందీశ్వర, బ్రహ్మ, విష్ణు, వాహనాలపైనున్న దిక్పాలకులు, సప్తర్షులు, దూలం కిందవైపున గజాసుర సంహారమూర్తి, లోపలివైపు అమృతకలశానికి అటూ ఇటూ దేవతలు, పడమర దూలం ఎదురుగా దేవతా శిల్పాలు, దూలం కింది వైపున దిక్పాలకుల మధ్య నటరాజు, లోపలి వైపు సాగరమధన దృశ్యం, ఉత్తరం వైపున దూలంపై ఎదురుగా రుషులు, కింది వైపు గజాసుర సంహారమూర్తి, లోపల రామరావణ యుద్ధ దృశ్యాలు రమణీయంగా మలిచారు. దూలాలపైన మధ్యలో (మూలరాళ్ళు) కోణవట్ట, చదరవట్టాల (చదరపు రాళ్ళు)పై దిక్పాల శిల్పాలు, మధ్యన నటరాజశిల్పం చూపరుల దృష్టిని మరల్చటమే కాక మెడనొప్పిని కూడా కలిగిస్తుంది. ఎందుకంటే, ఏ శిల్పానికి ఆ శిల్పం అద్వితీయం, కనుక!
మదనిక నాగిని శిల్పాలు
రంగమండప కక్షాసనాల వెనుక వేదికపై నిలబెట్టిన కురచ స్తంభాలున్నాయి గదా! వాటి వెలపలి వైపు నుంచి దూలాల బోదె భాగాల్లోకి నల్ల శానపురాతితో చెక్కిన ఏనుగుపైనున్న సింహాన్ని పోలిన ఉహాత్మక జంతువు -యాళి – గజకేసరి శిల్పాలు, నాగినీ, మదనికా శిల్పాలు ఉన్నాయి. చక్కటి అంగసౌష్టవంతో వొంపుసొంపులు, హొయలూ, వయ్యారాల కలపబోతగా తీర్చిదిద్దిన సుందరీమణులు కాకతీయుల కాలపు అందమైన యువతుల రూపలావణ్యానికి ప్రతిబింబాలు. నల్లశానపు రాతిలో చెక్కిన రంగమండప వాయువ్యభాగంలో ఐదు గజకేసరి శిల్పాలు, తరువాత తూర్పు ద్వారానికి రెండువైపులా ఇద్దరేసి నాట్యగత్తెలు, నాగినులు, మద్దెల వాయిస్తున్న యువతులు. తూర్పువైపు ద్వారానికి ఎడమవైపున్న యువతి ఎత్తు మడమల చెప్పులతో ఫ్యాషన్లలో ఫ్రెంచి అందగత్తెల్ని తలదన్నే రీతిలో ఉంది. మరో యువతి వంటిపై జారిపోతున్న ఎంబ్రాయిడరీ అల్లికలు, అప్పటికి కొంగొత్త డిజైన్లు అద్దుకున్న బట్టలతో అందమంతా తన సొంతమేనన్నట్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ సుందరీమణులు తమ కురులను అందంగా అలంకరించుకొన్న తీరు, చెవులకు పెద్దసైజు గుండ్రటి దుద్దులు, నాజూకైన బంగారు నగలు, నాట్య భంగిమలు. ఆ సొగసుగత్తెల మాటే చేయి తిరిగిన శిల్పుల పనితనానికి మనం అబ్బురపడతాం. అంగాంగానికి పొందుపరచిన ఆభరణాలతో అప్సరసలను సైతం కవ్వించి, అలంకరణలో, అందంలో తమకు సాటిరాదన్న గర్వంతో సవాళ్ళు విసురుతూ, అలనాటి తెలంగాణ ప్రాంత యువతులు మొదటి నుంచీ సౌందర్యోపాసకులని రుజువు చేస్తున్నాయి.
ద్వారశాఖలు
గర్భాలయంలో ప్రతిష్టితమైన రుద్రేశ్వరుని దర్శించాలనుకొన్నా వీటన్నిటినుంచి దృష్టి మరల్చాలి. అవును. అపురూపంగా చెక్కిన ద్వారబంధాలు, వాటి శాఖలు, కింద సుందరశిల్పాలు, వేటగత్తెలపాట్లు, లోనికి వెలుతురు రావటానికి కిటికీలు, కిటికీ కళ్లపై అలనాటి నాట్యభంగిమలు, కరణాలు, అభినయ, నృత్యరీతులు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. బహుశా రేచర్ల రుద్రుడు, జాయపసేనాని సహవాసం వల్ల అబ్బిన నాట్యాభిరుచిని ఇక్కడ తెలియజెప్పాలనుకున్నారేవెూ! ద్వార బంధాల కిందున్న గడపపై రమణీయ శిల్పం, పైనున్న పతంగంపై నటరాజు తాండవం చూపరులను మమేకం చేస్తుంది. ఇక్కడ మలచిన నాట్య భంగిమలను, జాయపసేనాని రచించిన ‘నృత్య రత్నావళి’లోని నాట్య సంప్రదాయాలను డా॥ నటరాజ రామకృష్ణ తులనాత్మకంగా పరిశీలించి, పరిశోధించిన ఎన్నో నాట్య విశేషాలను ప్రపంచానికి తెలియజెప్పారు. వారు 1985లో రామప్ప దేవాలయ ప్రాంగణంలో పేరిణి నృత్యవూపక్షికియను వేలమంది సమక్షంలో ప్రదర్శించిన విషయం లోక విదితమే.
నంది మండపం
దేవాలయ దర్శనమైన తరువాత రంగమండపం బయటికొచ్చిన వారికి, తంజావూరు బృహదీశ్వరాలయంలో మాదిరిగా వ్యవసాయం పట్ల మక్కువ గల కాకతీయ రాజుల అభిమతానికి మచ్చుతునకగా, దుక్కిటెడ్లపట్ల గల మమకారాన్నంతా కలిపి చెక్కించుకొన్న నంది కనిపిస్తుంది. దీన్ని ప్రతిష్టించిన నందిమండపం, అటు అంతకుముందు కళ్యాణి చాళుక్యుల దేవాలయాల్లోగానీ, లేక అప్పటి వరకూ కట్టిన కాకతీయదేవాలయాల్లోనూ ఎక్కడా లేనట్లు విలక్షణ వాస్తుశైలిలో ఉంటుంది.
కాటేశ్వరాలయం
అర్ధమండప, గర్భాలయం, మహామండపాలతో ఉన్న కాటేశ్వరాలయాన్ని రుద్రసేనాని తన తండ్రి కాట్రెడ్డి పేర నిర్మించాడు. చుట్టూ చిన్న ప్రదక్షిణ పథంగా వున్న ఉపపీఠం దానిపై చిన్న అధిష్టానం, పాదవర్గం, ప్రస్తర కపోతం, దానిపైన ఒక్క అంతస్థు వరకు మిగిలి వున్న ఇటుకరాతి శిథిల విమానం, కొంచెం ఎత్తైన అధిష్ఠానం, దానిపై కక్షాసనాలతో ఉన్న రంగమండపం, ప్రవేశం దగ్గర అటూ ఇటూ శిథిలమైనా పదిలంగా మెట్లెక్కండని భక్తులను ఆహ్వానించే రెండు ఏనుగు శిల్పాలు చూడముచ్చటగా ఉంటాయి.
రంగమండపంలో 16 స్తంభాలు, ద్వారబంధాలపై స్వస్తిభవూదజాలకాలతో రామప్ప ప్రధానాలయానికి తగ్గట్టుగా నిర్మితమైంది. ముందున్న మెట్లకు అటూ ఇటూ పొందికగా వున్న అధిష్ఠాన భాగాలను సంస్క ృతంలో గజహస్తాలనీ, ఆలంబన బాహులనీ అంటారు.
కామేశ్వరాలయం
రామప్ప దేవాలయానికి నైరుతి దిక్కులో నిర్మితమైన కామేశ్వరాలయం చిన్న ఉపపీఠం, సాదాగోడలు, దానిపై చిన్న కపోతం, వ్యాళ వర్గాలున్నాయి. ముందుభాగంలో అటూ ఇటూ రెండు కక్షాసనాలుండటం గమనించదగ్గ విషయం. ద్వారబంధాలు కాకతీయ శిల్ప వైశిష్ఠ్యాన్ని తెలియజేస్తున్నాయి.
కల్యాణ మండపం
రామప్ప ఆలయ దక్షిణ భాగంలో ప్రాకారానికి మధ్యగల కల్యాణ మండపం శిథిలమైపోగా దానిని భారత పురాతత్త్వ సర్వేక్షణ శాఖ పదిలపరుస్తోంది.
ప్రాకారం
ఆలయాలను అపురూపంగా కట్టించిన రుద్రుడు వాటి భద్రతను గురించి కూడా ఆలోచించాడు. ఆలయాల భద్రతతో పాటు పచ్చటి పరిసరాల నడుమ అందం ఇనుమడించేటట్లు చుట్టూ ఎత్తైన విశాలమైన ప్రాకారాన్ని నిర్మించాడు. తూర్పు, పడమర, దక్షిణ దిక్కుల్లో ప్రవేశ ద్వారాలను కల్పించాడు. ప్రాకారం దృఢంగా ఉండటానికి రెండు వరుసలతో గోడకట్టి, ఆ వరుసల మధ్య మట్టితో నింపి, పైన కప్పునూ, దానిపై అందం కోసం కలశాలను తలపించే కోడిపుంజు తలపై ఉండే తురాయి రీతిలో శిల్పకళాకృతులను నిర్మించాడు.
ఇతర దేవాలయాలు
రామప్పకు నైరుతి దిక్కులో 100 గజాల దూరంలో ఒక త్రికూటాలయం, వాయువ్యంలో చాళుక్య రీతిలో నిర్మించిన ఆలయం, చెరువుకట్టపై కుడివైపున కొండగట్టున మరో ఆలయం, చెరువుకట్టకు ఎడమవైపు ఒక త్రికూటాలయం, మరో ఏక కూటాలయం ఉన్నాయి. ఇవన్నీ శిథిలమైనా చూడదగ్గ కట్టడాలే.
కాకతీయ శిల్పంలో జైన తీర్ధంకరులు, శైవ, వైష్ణవ, శాక్త, గాణాపత్య శిల్పాలు, సామాజిక శిల్పంలో వేటగాళ్ళు, వేటగత్తెలు, నాట్యగాళ్ళు, నాట్యగత్తెలు, వాద్యగాళ్ళు, వాద్యగత్తెలు, దంపతి శిల్పాలు, నాగిని, మదనిక శిల్పాలు తలమానికాలు. శైవ శిల్పాల్లో, గణపతి, కార్తికేయ, వివిధ శివరూపాలలో నటరాజ, వైష్ణవ ప్రతిమల్లో విష్ణు, చెన్నకేశవ, శాక్త శిల్పాల్లో, సప్తమాతృక, మహిష మర్ధిని శిల్పాలు ముఖ్యమైనవి.
శాతవాహనుల తరువాత అంతటి చక్కటి రూపలావణ్యంతో బాగా నగిషీ చేసే శిల్ప ప్రక్రియ మళ్ళీ కాకతీయుల కాలంలోనే జరిగింది. మనుషులు, దేవతా శిల్పాలే కాక జంతువులకూ విశేష ప్రాధాన్యాన్నిచ్చారు శిల్పులు. దేవాలయ గోడలపై నంది, హంసలు, ఏనుగులు, గుర్రాల వరుసలు నాటి శిల్పుల ప్రతిభకు తార్కాణాలు. రామప్ప రంగమండప స్తంభాలకున్న నాగిని, యువతుల శిల్పాలు మరెక్కడా కాన రావు.
రెండున్నర శతాబ్దాల్లో వేలకొద్దీ శిల్పాలు చెక్కించి భారతీయ శిల్పకళా చరివూతలో తమకంటూ మహత్తర స్థానాన్ని కల్పించుకొన్న కాకతీయులు నిజంగా ధన్యజీవులు!
అపురూపమే కాక ఎంతో అరుదైన రామప్ప దేవాలయం మధ్యయుగపు రాజవంశ ఠీవిని, అప్పటి వాస్తు శిల్ప వైవిధ్యాన్నీ అట్లే నాటి శిల్పుల హస్తకళా లాఘవాన్ని ఆవిష్కరిస్తూ, ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటుకోసం ఎదురుచూస్తోంది.
శాసన మండపం
గణపతి దేవుని అడుగుజాడల్లో నడుస్తున్న రేచర్ల రుద్రుడు ఆలయాన్ని కట్టిన సందర్భంగా సంస్కృతంలో ఒక శాసనాన్ని వేయించి, దానిని నిలబెట్టి ఎండావానల నుంచి రక్షణకు ఒక మండపాన్ని కట్టించాడు. చక్కటి ఉపపీ నాలుగు స్తంభాలపై అందమైన కప్పుతో నిర్మించిన శాసన మండపం కాకతీయ వాస్తు కట్టడాల్లో విలక్షణమైందిగా గుర్తింపు పొందింది.

కాకతీయుల చెరువులు
Paakhaalaవ్యవసాయం – చెరువులు
నాటికీ, నేటికీ వ్యవసాయం ప్రజల ప్రధాన జీవనాధారం. కాబట్టి, కాకతీయులు వ్యవసాయ భూమిని, పంటలను విస్తృతంగా అభివృద్ధి పరిచే చర్యలు తీసుకున్నారు. వ్యవసాయ భూమి పరిమాణాన్ని పెంచడానికి వారు ప్రధానంగా నాలుగు రకాల చర్యలు తీసుకున్నారు. ఒకటి: అడవులను నరికించి వ్యవసాయ యోగ్య భూములను అందుబాటులోకి తెచ్చారు. రెండు: నిరుపయోగంగా ఉన్న భూములను పోడు చేసేవారికి (వ్యవసాయం) పన్నుల రాయితీతో ఇచ్చారు. మూడు: గ్రామాలకు దూరంగా నిరుపయోగంగా ఉన్న భూములను బ్రాహ్మణులకు, పండితులకు, మంచి అధికారులకు, దేవాలయాలకు, అగ్రహారాలుగా నగామాలు), కానుకలుగా, వృత్తులను నిర్వహించుకోవడానికి ఇచ్చి ఆయా భూములను వ్యవసాయం యోగ్యంగా మార్చేలా చేశారు. నాలుగు: రాజ్యంలోని భూమి అంతటికీ రాజే యజమాని కాబట్టి, రాచపొలాలను సగం ఆదాయాన్ని చెల్లించే రైతులకు (అర్థసీరులు) కౌలుకు ఇచ్చారు. చివరి పద్ధతిని ‘అడపగట్టు’ అనేవారు.
Paakhaala-Cheruvuఅవి చాలా పెద్ద చెరువులు కావటం వల్లనే కాకతీయులు తమ శాసనాల్లో వాటిని ‘సమువూదము’లు అని వర్ణించారు.
కాకతీయ రాజులు, వారి సామంతులు-సేనానులు వ్యవసాయాభివృద్ధికి పెద్ద పెద్ద చెరువులు తవ్వించారు. వాటిని ‘సమువూదము’ లనే వ్యవహరించారు. ప్రోలసముద్రం, నామ సముద్రం, ఎరక సముద్రం, కేసరి సముద్రం, కాట సముద్రం, సబ్బి సముద్రం వంటి తటాకాల పేర్లు చూస్తే, ఆనాటి దేశ ఆర్థిక వ్యవస్థలో చెరువులకున్న ప్రాముఖ్యం అర్థమవుతది. తటాక నిర్మాణం మహా పుణ్యకార్యంగాను, సప్తసంతానాలలో ఒకటిగాను పరిగణింపబడింది. రెండు పెద్ద కొండల మధ్యనో, గుట్టల మధ్యనో, నీటి వాలు బాగా ఉన్నచోట్లలో మట్టిగట్లు పోసి కాకతీయ రాజులు చెరువులు నిర్మించేవారు. ఇలాంటి చెరువుల కిందనే వ్యవసాయం జరుగుతూ ఉండేది. అంతేకాక, ఎవరు కట్టించిన చెరువులు వాళ్ల పేరనే ఉండేవి. ప్రోలరాజు నిర్మించింది ప్రోల సముద్రం, ఎరక సానమ్మ నిర్మించింది ఎరక సముద్రం…ఇట్లా ఆ పేర్లుండేవి.
గణపతిదేవుని ముఖ్యమంత్రి అయిన బయ్యన నాయకుని కుమారుడు జగదలముమ్మడి నాయకుడు పాకాల చెరువు నిర్మించాడు. ఈ చెరువు పరీవాహక ప్రదేశం దాదాపు 20 చదరపు మైళ్ళు. ఈ చెరువులో పుట్టిన మున్నేరు కాలువ దాదాపు 100 మైళ్ళు ప్రవహించి కృష్ణలో కలుస్తుంది. ఈ చెరువుకు 3 తూములున్నాయి. ఈ 3 తూములు 32 మైళ్ళకు నీటిని తీసుకొని పోతయి. 14-15 అంగుళాల వర్షం పడితే చెఱువు నిండుతది. ఈ చెఱువు నీటితో 10 వేల ఎకరాలు సాగవుతది.
ఓరుగల్లులోని లక్నవరం, రామప్ప చెరువులు కూడా ఇంత పెద్దవే. రామప్ప దేవాలయం కట్టించిన రేచర్ల రుద్రుడు రామప్ప చెరువును తవ్వించాడు. 83 చదరపు మైళ్ళ ప్రదేశంలోని నీరు ఈ చెఱువులో వచ్చి పడుతది. దీని ఆయకట్టు 5000 ఎకరాలు. 75 చదరపు మైళ్ల ప్రాంతంలోని నీటితో నిండే లక్నవరం చెఱువు ఆయకట్టు 3500 ఎకరాలు. కాకతీయ రాజవంశానికి చెందిన మైలాంబ బయ్యారం చెరువును నిర్మించింది. ఇవి ఈనాటికీ నిలిచి ఉన్నయి. కోవూరి బ్రహ్మయ్య 700 జైన బసదులను కూల గొట్టించి పొట్ల చెఱువును తవ్వించాడట.
ఇంతింత పెద్ద చెరువులు కావటం వల్లనే శాసనాలలో వాటిని ‘సమువూదము’లని వర్ణించారు. గణపతిదేవుని సేనాని గౌండప్ప ‘సమువూదాల గర్వాన్ని అణచివేస్తున్న’ గౌండ సమువూదాన్ని నిర్మించాడట. ఈ గౌండ సేనానియే తన యజమాని పేరున ‘ఆకాశాన్నంటే తరంగాలనే చేతులతో ఆకాశగంగను ఆహ్వానిస్తున్నట్లున్న’ గణప సమువూదాన్ని నిర్మించాడట. బాస సముద్రం కూడా గౌడప్ప నిర్మించిందేనట.
తటాకాలు, చెరువులు, కాలువలే కాక బావుల కింద కూడా వ్యవసాయం జరిగేది. ఈ విధంగా ఆనాటి నీటి వనరులు కాకతీయ సామ్రాజ్యాన్ని సస్యశ్యామలం చేశాయి. ఇప్పటికీ మన కాలానికీ ఉపయోగపడుతున్నయి.
(ఆచార్య హరి శివకుమార్ రచించిన ‘కాకతీయ వైభవము’ నుంచి…)
కాకతీయుల నాటి తెలంగాణ ఆర్థిక జీవనం
తెలుగునేల, ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతం స్వర్ణయుగాన్ని అనుభవించింది కాకతీయుల కాలంలోనే.
– కాకతీయ రాజలు తెలంగాణ గడ్డమీదనే పుట్టి, పెరిగి ప్రజల కష్టసుఖాలను ఎరిగినవారు. కాబట్టి, ప్రజల కష్టాలను తీర్చి సుఖాలను పెంచే మార్గాలను ఆలోచించి, ఆచరణలో పెట్టారు. అలా ప్రజలు ఆశించిన ఫలితాలను అందుబాటులోకి తెచ్చారు.
– తొలి కాకతీయ రాజులు రాష్ట్రకూట రాజులకు సామంతులుగా సుమారుగా రెండు వందల సంవత్సరాల పాటు నకీ.శ. 973 వరకు) హనుమకొండ-వరంగల్ జిల్లా ప్రాంతాన్ని పాలించారు. మరో రెండు వందల సంవత్సరాల కాలం నకీ.శ. 1162 వరకు) పశ్చిమ చాళుక్య రాజులకు సామంతులుగా మధ్య తెలంగాణను పరిపాలించారు. ఆ తరువాత స్వతంత్ర రాజులుగా యావత్ తెలుగుదేశాన్ని సుమారు 160 సంవత్సరాలు నకీ.శ. 1323 వరకు) ఏలారు.
– కాకతీయులు వ్యవసాయం, వ్యాపారం, ద్రవ్య విధానం తదితర ఆర్థిక రంగాల్లో తెలుగునేలపై ఉన్న వనరులను ప్రజల సంక్షేమానికి వినియోగపడేటట్లు అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచారు. ఆనాటి రాతి శాసనాలు, రాగి శాసనాలు, నాణాలు, గ్రంథాలు ఈ విషయాలను స్పష్టపరుస్తున్నాయి.
డా॥ ద్యావనవల్లి సత్యనారాయణ, 94909 57078
కాకతీయులు చేపట్టిన పై సంస్కరణల వల్ల చెన్నూరు, మంథని, ఏటూరు నాగారం, పాలంపేట, పాకాల, కొత్తగూడ, ఎల్లందు, బయ్యారం, అమ్రాబాద్, శ్రీశైలం ప్రాంతాల్లో కొన్ని లక్షల ఎకరాలు భూమి కొత్తగా సాగులోకి వచ్చినట్లు, ఆయా ప్రాంతాల్లోనే కొన్ని వేల గ్రామాలు ఏర్పడినట్లు, ఆయా ప్రాంతాల్లో దొరికిన శాసనాలు విశదం చేస్తున్నాయి.
కొత్తగా సాగులోకి వచ్చిన భూములకు, రావలసిన భూములకు సాగునీరు అందించడానికి కాకతీయులు కొన్ని వేల చెరువులు తవ్వించారు. ప్రత్యేకించి తెలంగాణలో కాకతీయుల కాలంలో తవ్వించిన చెరువు లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు.
మొదటి ప్రోలరాజు నకీ.శ. 1052 – 1076) తన బిరుదు ‘అరిగజ కేసరి’ పేరుతో వరంగల్ జిల్లా మహబూబ్‌బాద్ దగ్గర కేసరి సమువూదాన్ని తవ్వించాడు. అతని వారసుడు రెండవ బేతయ (1076 – 1108) మరో కేసరి సముద్రం, సెట్టి కేరెయ అనే చెరువులను నిర్మించాడు. రుద్రదేవుని మంత్రి గంగాధరుడు ఈనాటి హన్మకొండ బస్టాండ్ దగ్గరి చెరువుని కట్టించాడు.
గణపతిదేవుని కాలంలోనైతే (1199 – 1262) ఆయన బంధువులు, మంత్రులు, అధికారులు ఎందరో ఎన్నో చెరువులను తవ్వించారు. ఉదాహరణకు, ఆయన మంత్రి బయ్యన కొడుకు జగదాలు ముమ్మడి పాకాల చెరువును తవ్వించాడు. అది ఇప్పటికీ ఏటా 9,037 ఎకరాల భూమికి సాగు నీటిని అందిస్తున్నది. గణపతిదేవుని కింద మాండలిక పరిపాలకుడైన రేచర్ల రుద్రుడు రామప్ప చెరువు నిర్మించాడు. ఆ చెరువు ఇప్పటికీ 4,350 ఎకరాల భూమికి నీరందిస్తున్నది. ఆ చెరువు గట్టు తూర్పు కొసనున్న దేవాలయ మంటప స్తంభానికి చెక్కిన మూడు స్త్రీ మూర్తుల శిల్పాలు ఆ చెరువు ద్వారా వృద్ధి చెందే పాడిపంటలను సూచిస్తున్నాయి.
గణపతిదేవుని సోదరి మైలాంబ ఖమ్మం జిల్లాలో బయ్యారం చెరువును తవ్విస్తే, అతని మరో సోదరి కుందవ్వ అదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో తన పేర రెండు కుంద సమువూదాలను తవ్వించింది. అతని భార్య మైలమ కూడా కరీంనగర్ జిల్లాలో కటుకూరు చెరువును నిర్మించింది. గణపతిదేవుని సేనాని మల్యాల చౌండ కొండపర్తిలో ‘సమువూదాల గర్వాన్ని అణిచివేసే’ చౌండ సమువూదాన్ని నిర్మించాడు. ఈ చౌండ సముద్ర ప్రస్తావనలో మనకు ఆనాటి చెరువులను ‘సమువూదాలని’ ఎందుకు పిలిచేవారో స్పష్టమవుతున్నది.
చెరువులను తవ్వించడం ఆనాడు సప్త సంతానాల్లో ఒకటైన పుణ్యకార్యంగా ప్రచారంలో ఉండేది. కాబట్టి, రాజులతో పాటు చేతనైన వారెవరైనా చెరువులను తవ్విస్తుండేవారు.
చెరువులతో పాటు ఇతర సాగునీటి ఆధారాలు కూడా కాకతీయుల కాలంలో మనుగడ సాగించినట్లు శాసనాధారాలున్నాయి. అలా మనకు కుంటలు, ఊటకాలువలు, ఏతం, మోట, రాటనాలు, మనుషులే లాగే కప్పీ రాట్నాల ప్రస్తావనలు కన్పిస్తాయి. ఇల్లంతకుంట (కరీంనగర్ జిల్లా) ఒక కుంటకు ఉదాహరణ. ఊట కాలువలకు ఉదాహరణలుగా గొనుగు కాలువ, బొమ్మకంటి కాలువ, ఉత్తమ గండ కాలువ, ఉటుం కాలువ, చింతల కాలువ తదితరాలను పేర్కొనవచ్చు.
కరీంనగర్ జిల్లా ధర్మవరం మండలంలో ఉండే గొనుగు కాలువమీద హక్కు విషయమై నేఢవూరు, చామనపల్లి, కటిక్యోలపల్లి గ్రామస్తుల మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి ఆనాటి రాజు గణపతిదేవుడు రెండుసార్లు వారి వద్దకు అధికారులను పంపి, అన్ని కుల సంఘాల అభివూపాయాలను (ండుసార్లు) తెలుసుకుని, ప్రాడ్వివాకుని (న్యాయమూర్తి) సమక్షంలో తన తుది తీర్పు ప్రకటించి, ఆ కాలువ మీద చామనపల్లి మహాజనులకు బాహ్మణులకు) హక్కును కల్పించి, ఆ విషయాన్ని రాగి శాసన రూపంలో భద్రపరచడం జరిగిందీ అంటే ఆనాటి రాజులు ప్రజల సంక్షేమం, అభివూపాయాల పట్ల ఎంత శ్రద్ధ తీసుకునేవారో అర్థమవుతుంది.
సాగునీటి కల్పన అనేది ఆనాడు దానంగా, వ్యాపారంగా కూడా చెలామణిలో ఉండేది. ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ దేవుడికి దానంగా చెరువులను, కుంటలను తవ్వించడం గురించి పైన తెలుసుకున్నాం. చెరువులు, కుంటలు, కాలువలు ప్రైవేటు వ్యక్తులు కూడా తవ్వించి లేదా మరమ్మత్తులు చేసి రైతులకు సాగునీటిని అందించే పద్ధతి కూడా కాకతీయుల కాలంలో అమలులో ఉండేది. లబ్ధి పొందిన రైతులు మరమ్మత్తుదారుకు తాము పండించిన ప్రతి ధాన్యానికి ఒక కుంచం చొప్పున చెల్లించేవారు. అలా చెల్లించడాన్ని ‘పుట్టికుంచం’ లేదా ‘చెరువు కుంచం’ అనేవారు. ఈ పద్ధతిని ‘దశవంధ’ అనేవారు. చెరువు కింది రైతులందరూ చెరువు కుంచం చెల్లించక అందుకు బదులుగా ఉమ్మడిగా మరమ్మత్తుదారుకు దశంవధ మాన్యం (కొంత భూమి) కూడా ఇవ్వడం అమలులో ఉండేది. పుట్టి …అంటే 80 కుంచాలు… పండించుకునేందుకు సాగునీరును నిరంతరాయంగా కల్పించే ఏర్పాటు చేసి, కేవలం ఒకే కుంచం పన్ను వసూలు చేసుకునేట్లు చూడడం ఆనాటి ప్రభుత్వ సంక్షేమ యంత్రాంగానికి ఒక మచ్చు తునక.
ఆనాటి భూముల్లో అడవులు, పచ్చిక బయళ్ళు పశువుల మేతకు, వంట చెరుకు, వ్యవసాయ పనిముట్లు, వన మూలికలు తదితర అవసరాలకు ఉపయోగపడగా, అచ్చుకట్టు భూముల్లో వ్యవసాయం చేసేవారు. అచ్చుకట్టు భూముల్లో ఈనాటి లాగే మెట్ట భూముల్లో వర్షాధార పంటలు పండేవి. మాగాణి భూముల్లో నీటి నేలలు, తోంటలు అని రెండు రకాలుండేవి. నీటినేల అంటే వరి పండించే నేల. తోంట అంటే తోట. తోటలో ఈనాటి మాదిరిగానే కూరగాయలు, కొన్ని రకాల వాణిజ్య పంటలు, పండ్లను పండించేవారు.
రాజ్యంలోని భూములన్నిటికీ రాజు యజమాని కాబట్టి, రైతులు అన్ని రకాల భూములపై శిస్తుపన్ను చెల్లించేవారు. అడవులు, పచ్చిక బయళ్ళపై పుల్లరి, ఉప్పు మడులపైన అడ్డవట్టు సుంకం చెల్లించేవారు. మెట్ట, మాగాణి భూముల పైన చెల్లించే పన్నును ‘అరి’ అనేవారు. దీనిని ధనం, ధాన్యం, వస్తురూపాల్లో శిస్తు చెల్లించడం అమలులో ఉండేది. ఒక నిర్ణీత భూమిలో పండిన పంటను ‘సిద్ధాయం’ అనేవారు. ఈ సిద్ధాయంలో ఒక పుట్టి ధాన్యానికి ఒక బంగారు (పహిండి) నాణాన్ని చెల్లించేవారు. దాన్ని ‘పుట్టి పహండి’ లేదా ‘పుట్టిమాడ’ అనేవారు. ‘సిద్ధాయం’ పెరిగితే ప్రభుత్వానికి చెల్లించవలసిన పుట్టిమాడల సంఖ్య పెరుగుతుందన్న మాట. నీరు నేల సిద్ధాయం మీద చెలించే పన్నును ‘గడ్డుగమాడ’ అనేవారు.
శిస్తును ధాన్యరూపంలో వసూలు చేసే సందర్భంలో తూము న్యాయకాండ్రు పంటను కొలిచేవారు. తాసు న్యాయకాండ్రు తూచేవారు. ఒక పుట్టి పంట పండితే ఒక తూము వసూలు చేసేవారు. దీనిని ‘పుట్టితూము’ లేదా ‘రాసితూము’ అనేవారు. ‘పుటి’్ట అంటే 80 కుంచాలు, ‘తూము’ అంటే 4 కుంచాలు. కాబట్టి, భూమి శిస్తు పంటలో 5 శాతం ఉండేదని చెప్పవచ్చు. పండిన పంట ధాన్యం కాక మరోలాగా కొలిచే పంట అయితే, ఆ పంటలో కొంత భాగాన్ని అది పండిన రూపంలోనే శిస్తుగా చెల్లించేవారు. అలాంటి వస్తురూప శిస్తును ‘పంగ’ లేదా ‘పంగము’ అనేవారు. కొలుచు, కొలుగు, పఱ అనే పదాలు కూడా అదే అర్థంలో శాసనాల్లో కనిపిస్తున్నాయి.
పంగను సరైన సమయంలో, సరైన విధంగా చెల్లించకపోతే అందుకు శిక్షగా ‘పంగతప్పు’ అనే పన్నును చెల్లించవలసి ఉండేది. పంగము రూపంలో వసూలైన పంటను వసూలు చేసిన ‘ఆయకాండ్రు’ అనే అధికారులు అదే రోజు అంగట్లో అమ్మేందుకు కూడా రైతే అమ్మకపు పన్ను, కొనేవాడు ‘విల్చుపన్ను’ కట్టేవారు. ఈ రెండు పన్నులను ‘అమ్మడికాలు’ అనేవారు.
పై పన్నులతో పాటు కాంపులు (రైతులు) రాజుకు కానిక, దరిశనము అనే పన్నులను చెల్లించేవారు. రాచపొలాలను కౌలుకు తీసుకోవడం కోరు వ్యవస్థ. అలాంటి పొలాల్లో పండిన పంటలో ఆర్థాయం రాజుకు చెల్లించవలసి ఉండేది. పంట మంచిగా పండినప్పుడు చెల్లించే పన్నును ‘వెన్నుపన్ను’ అనేవారు. పొలానికి నీరు అందించినందుకు చెల్లించవలసిన పన్ను కాలాన్ని బట్టి పండిన పంటలో ఆరవ భాగాన్నుండి సగభాగం వరకు ఉండేది. ఒక్క రాజుపోలం పైనే సగభాగం పన్ను ఉండేది. మిగతా భూములపై సాధారణంగా ఐదవ భాగం పన్నుగా ఉండేది. ప్రభుత్వానికి అందిన పన్ను తిరిగి ప్రజల సంక్షేమం కోసం చెరువులు, కుంటలు, కాలువలు తవ్వించడం తదితర ప్రజోపయోగ పనుల నిర్మాణం కోసమే వినియోగించబడేది. పైగా ఆనాటి రాజులు అగ్రహారాలు, వృత్తులు, మాన్యాలు వరుసగా పండితులు, దేవాలయాలు, దేశ సేవకులకు ఉచితంగా ఇచ్చి, వాటిపై పన్ను రాయితీ కల్పించేవారు.
కొత్తగా సాగులోకి వచ్చిన భూములకు, రావలసిన భూములకు సాగునీరు అందించడానికి కాకతీయులు కొన్ని వేల చెరువులు తవ్వించారు. ప్రత్యేకించి తెలంగాణలో కాకతీయుల కాలంలో తవ్వించిన చెరువు లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు.
అలనాటి వైభవం
ఆనాటి పంటలు ఎలా ఉండేవో అప్పటి కవి ఒకరు కింది శ్లోకంలో ఇలా వర్ణించారు.
ఆంధ్రాస్సంతి గరీయాంసః కాంచన ఛాయ శాలయః
యథాహాటక స్యూతస్య కోటరారత్న శాలిః
అంటే…ఆంధ్రదేశపు భూములు పండిన వరి చేలతో బంగారు మేరు పర్వతం లాగా మెరుస్తున్నాయని అర్థం. వరితోపాటు ఇతర పంటలు కూడా బాగా దిగుబడి నిచ్చేవని సాహిత్య ఆధారాలు తెలియజేస్తున్నాయి.
ఇవాళ తెలంగాణలో పండిస్తున్న అన్ని ఆహార పంటలు, పప్పు దినుసులు, వాణిజ్య పంటలన్నింటినీ కాకతీయుల కాలంలో పండించేవారు. ప్రభుత్వమే కాకుండా ప్రైవేటు వ్యక్తులు కూడా భూమిని కౌలుకిచ్చేవారు. దానిని ‘తాంబూల స్రవ’ అనేవారు. ఆ సమయంలో తాంబూలాలను రైతులు పరస్పరం మార్చుకునే వారేమో!
కాకతీయుల విధానాల వల్ల ప్రజల ఆదాయం మళ్ళీ ప్రజల సంక్షేమానికే వినియోగించబడి ప్రజలు శాంతి సౌభాగ్యాలతో విలసిల్లారు. కాని, ఆ రాజులు మరింత ధనవంతులు కాలేదు. విలాసాలకు మరుగలేదు. తద్వారా దేశ వినాశనానికి ఒడి కట్టలేదు.
కాకతీయుల కాలం నాటి వృత్తులు
వ్యవసాయానికి అనుబంధమైనవి కొన్ని, నిత్యావసర వస్తు సేవలను అందించేవి కొన్ని కాకతీయుల కాలంలోనూ ఉండేవి. అన్ని వృత్తుల్లో కుటీర పరిక్షిశమ స్థాయిలో ఉన్నవి నేత వృత్తి, గానుగ వృత్తి, లోహ వృత్తి. తిండి తరువాత అత్యవసర వస్తువులు బట్టలు. కాబట్టి, బట్టలు నేసే సాలెలకు కాకతీయ రాజ్యమంతటా ప్రముఖ స్థానం ఉండేది. ఒక్క ఓరుగల్లు పట్టణంలోనే పద్మశాలీలు 6,500ల మంది, పట్టు నేసే సాలెలు 2,500 మంది ఉండేవారట. పట్టు బట్టలకు విలువ ఎక్కువ. కాబట్టి, పట్టు సాలెలకు కూడా సమాజంలో విలువ ఎక్కువగా ఉండేది. వారు నేసే పట్టు బట్టలు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అయ్యేవి. వారి నైపుణ్యాన్ని రుద్రమదేవి కాలంలో నకీ.శ.1262-1289) తెలుగుదేశాన్ని సందర్శించిన వెనిస్ యాత్రికుడు మార్కోపోలో ఇలా పొగిడాడు. ‘‘వారు (పద్మశాలీలు) సాలెపురుగు జాల వలె వుండే అతి విలువైన సన్నని వస్త్రాలను నేసేవారు. వాటిని ధరించనొల్లని రాజు, రాణి ప్రపంచంలో లేరు’’.
ఇదే మార్కోపోలో ఆనాడు తెలుగునాట వజ్రాల పరిక్షిశమ కూడా ఉండేదని, ప్రకాశం జిల్లా దేశీయక్కొండ (నేటి మోటుపల్లి) రేవు నుండి వజ్రాలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేవారని రాశాడు. పాకాల చెరువు గట్టు మీదున్న ఇనుప నాగలిని బట్టి, తెలంగాణలో ఇనుప పరిక్షిశమకు సంబంధించి కనిపిస్తున్న ఆనవాళ్ళను బట్టి, సాహిత్యంలో ఇనుప వస్తువులకు సంబంధించి కనిపిస్తున్న ప్రస్తావనలను బట్టి కాకతీయుల కాలంలో ఇనుప పరిక్షిశమ కూడా బాగా వర్ధిల్లిందని చెప్పవచ్చు.

Friday, February 13, 2015

Theory of computation ebooks





Tags:Theory of computation ebooks ,Searches related to theory of computation books  theory of computation books free download  theory of computation books for gate  theory of computation books pdf  theory of computation books pdf free download  theory of computation download  theory of computation mathematics  theory of computation programming  theory of computation lecture notes, Searches related to theory of computation books  theory of computation books free download  theory of computation books for gate  theory of computation books pdf  theory of computation books pdf free download  theory of computation download  theory of computation mathematics  theory of computation programming  theory of computation lecture notes, Searches related to theory of computation books  theory of computation books free download  theory of computation books for gate  theory of computation books pdf  theory of computation books pdf free download  theory of computation download  theory of computation mathematics  theory of computation programming  theory of computation lecture notes

Sunday, November 23, 2014

AP DSC 2014 SGT Study Material


    • SGT Social Study Material     Download

    • SGT Maths Study Material    Download 

    • SGT Science Study Material  Download 

    • SGT History Study Material Download 

    • SGT Geography Study Material Download 

    • SGT Civics Study Material         Download 

    • SGT Economics Study Material Download 

    DSC 2014 Methodology Subjects Download here Directly — Download

     

Tags:AP DSC 2014 SGT Study Material,Telugu study dsc,dsc study material in telugu, dsc study material in telugu pdf, dsc study material in telugu free download, SGT Study Material,DSC 2014 Study Material,DSC Telugu Study Material,dsc sgt study material in telugudsc study material in telugu, dsc study material in telugu pdf ,dsc study material in telugu free download, DSC SGT study material in telugu, dsc perspectives in education study material in telugu, dsc social studies syllabus in Telugu , DSC  material in telugu medium

Saturday, November 22, 2014

సింధునది


సింధునది : ఇది టిబెట్‌లోని మానస సరోవర్ అనే సరస్సు దగ్గర పుట్టి జమ్ముకశ్మీర్ గుండా ప్రవహించి తరువాత పాకిస్థాన్ గుండా కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీని మొత్తం పొడవు 2880 కి.మీ. సింధునదికి ఆపేరు పెట్టింది ఆర్యులు. ఈ సింధు నుంచి ఇండియా(ఇండస్) అను పేరు మనదేశానికి వచ్చింది. సింధునది మనదేశంలో 709 కి.మీ.లు ప్రవహిస్తుంది. ఈ నదీ జలాల్లో ఇండియా 20 శాతం మాత్రమే ఉపయోగించుకుంటోంది. సింధు 5,180 మీటర్ల ఎత్తున ఇండియాలో జమ్ముకశ్మీర్‌లో ధీమ్‌చోక్ వద్ద ప్రవేశిస్తుంది. చిలాస్ వద్ద పాకిస్థాన్‌లో ప్రవహిస్తుంది. జీలం : ఉలార్ సరస్సులోకి ప్రవహిస్తుంది. ఇది ఇండియా, పాకిస్థాన్ సరిహద్దు గుండా ప్రవహించి(ముజఫర్‌బాద్, మంగళ) పాకిస్థాన్‌లోని జాంగ్‌వద్ద చీనాబ్ నదిలో కలుస్తుంది. రావి : చంబాలోయ గుండా ప్రవహిస్తుంది. పిర్ పంజాల్ దైల్‌దార్ శ్రేణుల దక్షిణ, తూర్పు ప్రాంతాలను తడుపుతుంది. బియాస్ : కులలోయ, దౌల్‌దార్ శ్రేణుల గుండా ప్రవహించి పంజాబ్ మైదానంలోకి ప్రయాణిస్తుంది. ఇది భాక్రానంగల్, హరికే, సరిహింద్ ప్రాజెక్టుల కాలువల వ్యవస్థకి నీటిని అందిస్తుంది. ఉపనదులు : ష్యాక్, షిగార్, గిర్‌గిడ్‌డ్య్రాస్, ఔస్కర్, నుబ్రా అనునది జమ్ముకశ్మీర్‌లో ముఖ్య ఉపనదులు. నాగరికతలు : హరప్పా, మెహంజోదారో నాగరికతలు వెల్లివిరిసినది ఈ నదీ పరివాహక ప్రాంతంలోనే పంజాబ్ : పంజాబ్ అనగా ఐదు నదులు ప్రవహించే ప్రదేశం. సింధునది ఉపనదులు పంజాబ్‌లో ప్రవహిస్తున్నాయి. కావున దీనికి పంజాబ్ అని పేరు వచ్చింది. ఈ ఐదు ఉప నదులు జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లేజ్‌లు. సింధు నది ముఖ్య ఉనదులైన రావి, సట్లేజ్, చీనాబ్‌లు పాకిస్థాన్‌లో సింధు నదిలో కలుస్తాయి. గంగానది వ్యవస్థ : ఇండియాలో అతిపెద్ద నదీవ్యవస్థ. గంగానది రెండు ప్రధాన సెలయేరులైన అలక్‌నంద, భగీరిథిలు దేవప్రయోగ వద్ద కలిసి గంగా నది ఏర్పడింది. గంగానది-గంగోత్రి, హిమనీనదము(గోయుఖ్-3900మీ.)ఉత్తరాంచల్‌లో ఉత్తర ఖోకా జిల్లాలో పుడుతుంది. దీన్ని భగీరథి అంటారు. అలక్‌నంద శటోపనాథ హిమనీనదం వద్ద పుడుతుంది. దేవప్రయగాగ వద్ద భగీరథి కలక్‌నందను కలిసి గంగానదిగా ఏర్పడుతుంది. -గంగానది పరీవాహక ప్రాంతం ఆర్య నాగరికతకు కేంద్రంగా ఉన్నది. -గంగానది మొత్తం పొడవు 2525 కి.మీ. దీనిలో ఎక్కువ భాగం ఉత్తర ప్రదేశ్‌లో 1450 కి.మీ. బీహార్‌లో 445 కి.మీ. పశ్చిమబెంగాల్‌లో 520 కి.మీ ప్రవహిస్తుంది. -పశ్చిమ బెంగాల్‌లోని పరక్కా తర్వాత ఆగ్నేయ దిశగా ప్రవహించి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. -గంగానది రెండు పాయలుగా చీలుతుంది. ఒకదాన్ని భగీరథి హూగ్లీ, రెండోదాన్ని పద్మ అని పిలుస్తారు. ఉపనదులు. గంగ ముఖ్య ఉపనది యమున -గంగానదికి ఎడమవైపున కలిసే ఉపనదులు యమున, చంబల్, బెట్వా, సన్, పున్‌పున్. -కుడివైపున కలిసే ఉపనదులు రామగంగా, గోమతి, ఘాగ్రా, గండక్, కోసి, మహనంద్, రప్తీలు హిమాలయాల్లో పుడతాయి. -ఈ నది హరద్వార్ వద్ద మైదానంలోకి ప్రవేశిస్తుంది. 
Tags:dsc study material in telugu,dsc study material in telugu pdf,dsc study material in telugu free download,dsc sgt study material in telugu,dsc perspectives in education study material in telugu,dsc social studies syllabus in Telugu,dsc material in telugu medium ,geography of india pdf ebook  geography of india in hindi  download geography of india by khullar  climate of india  geography of india for kids  history of india  geography of india quiz  geography of india ppt


Thursday, November 20, 2014

ఆంగ్ల విధ్యను ప్రవేశ పెట్టుట

ఆంగ్ల విధ్యను ప్రవేశ పెట్టుట



Thursday, June 26, 2014

English Tenses

Tense అంటే  " కాలం "

 Simple Present Tense 


సాధారణ  పనులకు, రోజు చేసే పనులకు, అలవాటుగా చేసే పనులకు   "Simple Present Tense" 
ఉపయోగిస్తాం. 

EXAMPLES for Simple Present Tense : Positive way 

I read the news paper everyday.
( నేను ప్రతిరోజూ వార్త పత్రిక చదువుతాను. )

We go to the  temple every monday.
( మేము  ప్రతి సోమవారం  గుడికి  వెళ్తాం. )

She always cheats others.
(ఆమె ఎప్పుడు ఇతరులను మోసగిస్తుంది.)

EXAMPLES for Simple Present Tense : Negative way 

I don't read the news paper everyday.
( నేను ప్రతిరోజూ వార్త పత్రిక చదవను. ) 

We don't go to the temple every monday.
( మేము  ప్రతి సోమవారం  గుడికి  వెళ్ళం. ) 

She doesn't cheat others.
(ఆమె  ఇతరులను మోసగించదు.)

EXAMPLES for
Simple Present Tense : Interrogative way 


Do you read the news paper?
( నీవు  ప్రతిరోజూ వార్త పత్రిక చదువుతావా? )  

Do we go to the  temple every monday?
( మనం  ప్రతి సోమవారం  గుడికి  వెళ్తామా ? )  

Does she cheat others?
(ఆమె  ఇతరులను మోసగిస్తుందా? ) 

EXAMPLES for Simple Present Tense : Negative Interrogative way 

Don't you read the news paper?
( నీవు  ప్రతిరోజూ వార్త పత్రిక చదవవా ? )   

Don't we go to the temple every monday?
( మనం  ప్రతి సోమవారం  గుడికి  వెళ్తామా ? )   

Doesn't she cheat others?
(ఆమె  ఇతరులను మోసగించదా? )  


 Present Continuous Tense 
జరుగుతూ ఉన్న పనులను తెలియచెయాడానికి  "Present Continuous Tense" 
ఉపయోగిస్తాం.

EXAMPLES for Present Continuous Tense : Negative way 

I am reading the news paper.
( నేను వార్త పత్రిక చదువుచున్నాను.) 

We are going to the temple.
( మేము  గుడికి  వెళ్తున్నాము. ) 

She is cheating others.
(ఆమె ఇతరులను మోసం చేస్తుంది. ) 

EXAMPLES for Present Continuous Tense : Negative way  

I am not reading the news paper.
( నేను వార్త పత్రిక చదవట్లేదు.)  

We are not going to the temple every monday.
( మేము  గుడికి  వెళ్ళట్లేదు. )  

She is not cheating others.
(ఆమె ఇతరులను మోసం చేయట్లేదు. )  

EXAMPLES for Present Continuous Tense : Interrogative way 

Are you reading the news paper?
( నీవు  వార్త పత్రిక చదువుచున్నవా? )   

Are we going to the temple?
( మనం   గుడికి  వెళ్తున్నామా? )   

Is she cheating others?
(ఆమె ఇతరులను మోసం చేస్తుందా? )   

EXAMPLES for Present Continuous Tense : Interrogative way 

Aren't you reading the news paper?
( నీవు  వార్త పత్రిక చదవట్లేదా ? )    

Aren't we going to temple every monday?
( మనం   గుడికి  వెళ్ళట్లేదా ? )    

Isn't she cheating others?
(ఆమె ఇతరులను మోసం చేయట్లేదా? )    


 Present Perfect Tense 
ఈ మధ్య కాలంలో జరిగిన దానికి, కొద్దిసేపటి క్రితం పూర్తిచేసిన పనులకు  "Present Perfect Tense
ఉపయోగిస్తాం.

EXAMPLES for Present Perfect Tense : Negative way 

I have read the news paper.
( నేను  వార్త పత్రిక చదివాను.) 

We have gone to temple.
( మేము  గుడికి  వెళ్ళాం.) 

She has cheated others.
(ఆమె  ఇతరులను మోసగించింది.) 

EXAMPLES for Present Perfect Tense : Negative way 

I have not read the news paper.
( నేను  వార్త పత్రిక చదవలేదు. )  

We have not gone to temple.
( మేము  గుడికి వెళ్ళలేదు. )  

She has not cheated others.
(ఆమె  ఇతరులను మోసగించలేదు. )  

EXAMPLES for Present Perfect Tense : Interrogative way 

 have i read the news paper?
( నేను  వార్త పత్రిక చదివానా ? )   

 have we gone to temple?
( మేము  గుడికి వెళ్ళామా ?  )   

 Has she cheated others?
(ఆమె  ఇతరులను మోసగించిందా? )   

EXAMPLES for Present Perfect Tense : Interrogative way 

 haven't  i read the news paper?
( నేను  వార్త పత్రిక చదవలేదా? )    

 haven't we gone to temple?
( మేము  గుడికి వెళ్ళలేదా ? )  

 hasn't she cheated others?
(ఆమె  ఇతరులను మోసగించలేదా? )    


 Present Perfect Continuous Tense 
గతంలో ప్రారంభమై ఇప్పటికి జరుగుచున్న పనులకు  "Present Perfect Continuous Tense" ఉపయోగిస్తాం.

EXAMPLES for Present Perfect Continuous Tense 
I have been reading the news paper for 20minutes. (Positive way)
( నేను 20 నిమిషాల నుండి వార్త పత్రికను  చదువుచూనే ఉన్నాను? )     

I have not been reading the news paper for 20minutes. (Negative way)
( నేను 20 నిమిషాల నుండి వార్త పత్రికను  చదువుచుండటం లేదు ? ) 

Have i been reading the news paper since morning?(Interrogative way)
( ఉదయం నుండి నేను   వార్త పత్రికను  చదువుచూనే ఉన్నానా? ) 

Haven't i been reading the news paper since morning?(Negative interrogative way)
( ఉదయం నుండి నేను   వార్త పత్రికను  చదువుచుండటం లేదా? ) 


 Simple Past Tense 

పూర్తి చేయబడిన పనులకు Simple Past Tense" ఉపయోగిస్తాం.

EXAMPLES for Simple Past Tense 
I read the news paper. (Positive way)
( నేను వార్త పత్రికను చదివాను. )

I did not read the news paper. (Negative way)
( నేను వార్త పత్రికను చదవలేదు . )

Did i read the news paper? (Interrogative way)
( నేను వార్త పత్రికను చదివానా ? )

Didn't i read the news paper? (Negative interrogative way)
( నేను వార్త పత్రికను చదవలేదా ? )



 Past Continuous Tense 

గతంలో ఖచ్చితమైన సమయం లో జరుగుచున్న పనిని తెలియచేయడానికి  "Past Continuous Tense" ఉపయోగిస్తాం.

EXAMPLES for Past Continuous Tense 
I was reading the news paper at this time yesterday. (Positive way)
(నేను నిన్న ఈ సమయానికి  వార్తా పత్రిక చదువుతూ ఉంటిని.)

I was not reading the news paper at this time yesterday. (Negative way)
(నేను నిన్న ఈ సమయానికి  వార్తా పత్రిక చదువుతూ లేను.)

Was i reading the news paper at this time yesterday.?(Interrogative way)
 (నేను నిన్న ఈ సమయానికి  వార్తా పత్రిక చదువుతూ ఉంటినా? )

Wasn't i reading the news paper at this time yesterday.? (Negative interrogative way)
(నేను నిన్న ఈ సమయానికి  వార్తా పత్రిక చదువుతూ లేనా ? )


 Past Perfect Tense 

గతంలో జరిగిన రెండు పనులలో మొదట జరిగిన పనిని తెలియచేయడానికి  "Past Perfect Tense" ఉపయోగిస్తాం.

EXAMPLES for Past Perfect Tense 
I had slept at 8pm yesterday. (Positive way)
( నేను నిన్న రాత్రి 8 గంటలకి  పడుకొని వున్నాను.)

I had not slept at 8pm yesterday. (Negative way)
( నేను నిన్న రాత్రి8 గంటలకి  పడుకొని లేను.)

had i slept at 8pm yesterday? (Interrogative way)
( నేను నిన్న రాత్రి8 గంటలకి  పడుకొని ఉన్నానా ?)

hadn't i slept at 8pm yesterday? (Negative interrogative way)
( నేను నిన్న రాత్రి8 గంటలకి పడుకొని లేనా?)


 Past Perfect Continuous Tense 

గతంలో మొదలై... ఖచ్చితమైన  సమయం వరకు జరుగుతూనే  వుంది అని తెలియచేయడానికి  "Past Perfect Continuous Tense" ఉపయోగిస్తాం.

EXAMPLES for Past Perfect Continuous Tense 
I had been reading the news paper. (Positive way)
( నేను వార్త పత్రిక చదువుతూనే  వుంటిని.)

I had not been reading the news paper. (Negative way)
( నేను వార్త పత్రిక చదువుతూ లేకుంటిని.)

Had i been reading the news paper?(Interrogative way)
( నేను వార్త పత్రిక చదువుతూనే  ఉంటినా ? )

Hadn't i been reading the news paper? (Negative interrogative way)
( నేను వార్త పత్రిక చదువుతూ లేకుంటినా ?)

 Simple Future Tense  

భవిషత్తులో చేయబోయే పనిని తెలియచేయడానికి  "Simple Future Tense" ఉపయోగిస్తాం.

EXAMPLES for Simple Future Tense  
I will go to abids tomorrow . (Positive way)
( నేను రేపు అబిడ్స్ కు వెళుతాను)

I will not  go to abids tomorrow . (Negative way)
( నేను రేపు అబిడ్స్ కు వెళ్ళను.)

will you  go to abids tomorrow  (Interrogative way)
( మీరు రేపు అబిడ్స్ కు వెళతారా? )

Won't you go to abids? (Negative interrogative way)
( మీరు రేపు అబిడ్స్ కు వెళతారా? )



 Future Continuous Tense  
భవిషత్తులో చేయబోతున్న పనిని తెలియచేయడానికి  " Future Continuous Tense" ఉపయోగిస్తాం.

EXAMPLES for  Future Continuous Tense  
I will be reading the news paper tomorrow. (Positive way)
( నేను రేపు వార్త  పత్రిక చదువుతూ వుంటాను.)

I will not be reading the news paper tomorrow. (Negative way)
( నేను రేపు వార్త పత్రిక చదువుతూ ఉండను.)

Will i be reading the news paper tomorrow?(Interrogative way)
( నేను రేపు వార్త పత్రిక చదువుతూ ఉంటానా? )

Won't i be reading the news paper tomorrow? (Negative interrogative way)
( నేను రేపు
వార్త పత్రిక చదువుతూ ఉండనా? )

 Future Perfect Tense  
భవిషత్తులోఒక సమయానికి పని పూర్తి అయి ఉంటుందని  తెలియచేయడానికి   Future Perfect Tense" ఉపయోగిస్తాం.

EXAMPLES for Future Perfect Tense  
I will have bought a laptop by next april. (Positive way)
( నేను వచ్చే ఏప్రిల్ కల్లా ల్యాప్ టాప్ కొని ఉంటాను. )

I will not have bought a laptop by next april. (Negative way)
( నేను వచ్చే ఏప్రిల్ కల్లా ల్యాప్ టాప్ కొని ఉండను. )

Will i  have bought a laptop by next april.?(Interrogative way)
 ( నేను వచ్చే ఏప్రిల్ కల్లా ల్యాప్ టాప్ కొని ఉంటానా? )

Won't i have bought a laptop by next april. ? (Negative interrogative way)
 ( నేను వచ్చే ఏప్రిల్ కల్లా ల్యాప్ టాప్ కొని ఉండనా ? )


 Future Perfect Continuous Tense  

భవిషత్తులో ఒక సమయం వరకు పని జరుగుతూనే ఉంటుందని  తెలియచేయడానికి   Future Perfect Continuous Tense" ఉపయోగిస్తాం.

EXAMPLES for  Future Perfect Continuous Tense 
I will have been waiting for you tomorrow (Positive way)
(నేను రేపు నీ కొరకు ఎదురుచూస్తూ ఉంటాను.)

I will not  have been waiting for you tomorrow (Negative way)
(నేను రేపు నీ కొరకు ఎదురుచూస్తూ ఉండను.)

Will i  have been waiting for you tomorrow?(Interrogative way)
( నేను రేపు నీ కొరకు ఎదురుచూస్తూ ఉంటానా? )

Won't i have been waiting for you tomorrow? (Negative interrogative way)
 ( నేను రేపు నీ కొరకు ఎదురుచూస్తూ ఉండనా? )