గ్రాడ్యుయేట్ లకు శుభవార్త!
- భారీగా సెక్యూరిటీ సిబ్బంది ఉద్యోగ అవకాశాలు.
- భారతీయ/ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏఐ ఇంజనీరింగ్ సర్వీస్ లిమిటెడ్ (AIESL), అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఖాళీగా ఉన్న సెక్యూరిటీ సిబ్బంది పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తూ అధికారికంగా నోటిఫికేషన్ Ref.No.: AIESL/HR-HQ/2024/4779 తేదీ:04.09.2024 న జారీ చేసింది. హైదరాబాద్ తో సహా దేశవ్యాప్తంగా వివిధ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఆన్ లైన్ లో Google Form ద్వారా దరఖాస్తులు సమర్పించి, ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ లో సూచించిన దరఖాస్తు ఫారం తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జతచేసి, 24.09.2024 సాయంత్రం 05:00 వరకు చేరే విధంగా సమర్పించండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 76.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి, ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- హిందీ ఇంగ్లీష్ భాషలతో ప్రాంతీయ భాషా పరిజ్ఞానం అవసరం.
వయోపరిమితి :
- 01-09-2024 నాటికి అభ్యర్థుల వయస్సు
- ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు - 30 సంవత్సరాలు,
- ఓబీసీ అభ్యర్థులకు - 35 సంవత్సరాలు,
- జనరల్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు - 28 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
ఒప్పంద కాలం :: 05 సంవత్సరాలు,
📌 అభ్యర్థి క్రమశిక్షణ, & అవసరాన్ని బట్టి పొడిగించే అవకాశం ఉంది.
గౌరవ వేతనం :
- రీజనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఎంపికైన అభ్యర్థులకు రూ.47,625/-,
- అసిస్టెంట్ సూపర్వైజర్ సెక్యూరిటీగా ఎంపికైన అభ్యర్థులకు రూ.27,940/-.
దరఖాస్తు ఫీజు : రూ.1,000/-.
- SC/ ST/ Ex-servicemen అభ్యర్థులకు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్: https://www.aiesl.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
Chief Human Resource Officer
AI Engineering Service Limited
Personal Department,
2nd Floor, CRA Building,
Safdarjung Airport Complex,
Aurobindo Marg, New Delhi - 110003.
ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 24.09.2024 సాయంత్రం 05:00 గంటల వరకు.