ఐక్యమత్యం ముఖ్యమనేది ఇందుకే.. ఈ సింహాలు చేసిన తప్పు చూసైనా నేర్చుకోవాలి 'ఒకరు చేయలేనిది, నలుగురు కలిసి చేయొచ్చ'ని చెబుతుంటారు. దీనినే కార్పొరేట్ ప్రపంచంలో టీమ్ వర్క్‌గా చెబుతుంటారు. నలుగురు కలిస్తే చేయలేని పని అంటూ ఏది ఉండదని అంటుంటారు. అందుకే టీమ్ వర్క్ ఉండాలని సూచిస్తుంటారు. అయితే జట్టు సభ్యుల మధ్య సమన్వయం లేకపోతే అంతే సంగతులు. తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియో ఇది 100 శాతం నిజమని చెబుతోంది...
‘ఒకరు చేయలేనిది, నలుగురు కలిసి చేయొచ్చ’ని చెబుతుంటారు. దీనినే కార్పొరేట్ ప్రపంచంలో టీమ్ వర్క్‌గా చెబుతుంటారు. నలుగురు కలిస్తే చేయలేని పని అంటూ ఏది ఉండదని అంటుంటారు. అందుకే టీమ్ వర్క్ ఉండాలని సూచిస్తుంటారు. అయితే జట్టు సభ్యుల మధ్య సమన్వయం లేకపోతే అంతే సంగతులు. తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియో ఇది 100 శాతం నిజమని చెబుతోంది. ఇంతకీ ఏంటా వీడియో.? అందులో ఏముందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
అడవిలో 5 సింహాలు ఒక దున్నపోతుపై అటాక్ చేశాయి. దున్నపోతు అయితే దొరికింది. ఇక దానిని చంపేసి తినడమే తరువాయి. అయితే అంతలోనే వాటి మధ్య గొడవ షురూ అయ్యింది. పంపకాల విషయంలోనో మరే విషయంలో కానీ ఒకదానిపై మరొకటి దాడి చేసుకోవడం ప్రారంభించాయి. మొదట రెండు సింహాల మధ్య మొదలైన గొడవ క్రమంగా అన్ని సింహాలకు వ్యాపించాయి. దీంతో కష్టపడి పట్టుకున్న దున్నపోతును వదిలేసి మరీ గొడవ పడడం ప్రారంభించాయి. అదే పనిలో దున్నపోతును అక్కడే వదిలేసి వెళ్లిపోయాయి మరీ ఫైట్ చేసుకున్నాయి.
వైరల్ వీడియో..
ఇదే అదునుగా భావించిన దున్నపోతు.. బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి నెమ్మదిగా జారుకుంది. ఇలా సింహాలు ఒకదాంతో మరొకటి గొడవ పడడంతో కష్టపడి సాధించిన దున్నపోతును వదులుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. టీమ్ వర్క్ లేకపోవడం అంటే ఇదే అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.