Sunday, December 8, 2024

Digital Ration Card: డిజిటల్ రేషన్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

 

 

Mera Ration app Download

Digital Ration Card: డిజిటల్ రేషన్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? Digital Ration Card: డిజిటల్ రేషన్ కార్డ్ అనేది ఎలక్ట్రానిక్ కార్డ్. ఇది రేషన్ కార్డ్ డిజిటల్ వెర్షన్. దీన్ని డౌన్‌లోడ్ చేయడం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) కింద ఆహార ధాన్యాలు, ఇతర..  

డిజిటల్ ఇండియా కింద కేంద్రం ఎన్నో కార్యక్రమాలను చేపడుతోంది. ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో అన్ని రకాల డేటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ విభాగంలో రేషన్ కార్డును డిజిటల్ రూపంలో అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వం విజయం సాధించింది. దేశంలో “ఒకే దేశం, ఒకే రేషన్ కార్డ్” పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

డిజిటల్ రేషన్ కార్డ్ అనేది ఎలక్ట్రానిక్ కార్డ్. ఇది రేషన్ కార్డ్ డిజిటల్ వెర్షన్. దీన్ని డౌన్‌లోడ్ చేయడం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) కింద ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువులను పొందడం సులభం అవుతుంది. దీన్ని ఆన్‌లైన్‌లో లేదా మేరా రాషన్ 2.0 యాప్ ద్వారా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మేరా రాషన్ 2.0 యాప్ అంటే ఏమిటి?

డిజిటల్ రేషన్ కార్డ్ అనేది ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) కింద సబ్సిడీ ఆహార ధాన్యాలను పొందేందుకు లబ్ధిదారులను సులభతరం చేసే ఎలక్ట్రానిక్ పత్రం. దీన్ని ఆన్‌లైన్‌లో లేదా మేరా రాషన్ 2.0 యాప్ ద్వారా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది భారత ప్రభుత్వం ప్రారంభించిన మొబైల్ యాప్. ఇది రేషన్ కార్డ్ హోల్డర్‌లకు పీఈఎస్‌ సేవలను సులభంగా యాక్సెస్ చేస్తుంది. దీనిని కేంద్రం మరింత డెలవప్‌ చేస్తోంది.

  • మీరు డిజిటల్ రేషన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
  • వ్యక్తిగత సమాచారాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
  • మీరు మీ రేషన్ హక్కుల గురించి సమాచారాన్ని పొందవచ్చు.
  • మీరు కుటుంబ సభ్యులను జోడించడం లేదా తీసివేయడం వంటి సేవలను పొందవచ్చు.

అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి..

  • Android వినియోగదారులు: Google Play Store నుండి డౌన్‌లోడ్ చేసుకోండి.
  • iOS వినియోగదారులు: Apple App Store నుండి డౌన్‌లోడ్ చేసుకోండి.
  • యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి: మీ స్మార్ట్‌ఫోన్‌లో మేరా రేషన్ 2.0 యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి.
  • అప్లికేషన్ ఓపెన్‌ చేయండి.
  • స్క్రీన్‌పై చూపిన మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి.
  • “ధృవీకరించు” బటన్‌ను క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
  • ఓటీపీ నమోదు చేసి, “ధృవీకరించు”పై క్లిక్ చేయండి.
  • ధృవీకరణ తర్వాత, మీ డిజిటల్ రేషన్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. డౌన్‌లోడ్ చేయండి. ప్రింట్ చేయండి లేదా సేవ్ చేయండి.

డిజిటల్ రేషన్ కార్డ్ యొక్క ప్రయోజనాలు

  • మీరు దీన్ని ఎక్కడైనా, ఎప్పుడైనా ఉపయోగించవచ్చు.
  • ఫిజికల్ కార్డ్ పోతుందనే భయం ఉండదు.
  • రికార్డులన్నీ డిజిటల్‌గా ఉండడంతో మోసం జరిగే అవకాశాలు తక్కువ.
  • మీ ఇ-రేషన్ కార్డును ఎలా ధృవీకరించాలి.
  • మీరు మీ ఇ-రేషన్ కార్డ్ సమాచారాన్ని తనిఖీ చేయాలనుకుంటే, మీ రాష్ట్ర ఆహార, ప్రజా సంక్షేమ శాఖను సందర్శించండి.

 

 Telangana Ration Card Download